Drop Down Menus

దేవి నవరాత్రులలో ఆరో రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం | Navratri 6th Day Pooja Katyayani

నవరాత్రులలో ఆరో రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం - అక్టోబర్ 20 శుక్రవారం , 6వ- షష్ఠి, మాతా కాత్యాయని పూజ.

కాత్యాయని (లక్ష్మి)

కాత్యాయనీ దుర్గాదేవి, నవదుర్గల్లో ఆరో అవతారం. నవరాత్రుల్లో ఆరవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయనీ. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయనీ అమ్మవారిని దుర్గదేవిగా వర్ణించారు. ఇది క్రీ.పూ రెండో శతాబ్దంలో రాశారు.

యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకలో మొట్టమొదటే ఈ ఆమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారం   సింహవాహిని అయిన ఈ  అమ్మవారు మహిషాసుర  సంహారంలో పార్వతీదేవికి సహాయం  అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశమంతటా పూజిస్తారు.

మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంధాలలో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు.

హిందూ శాస్త్రాలు, యోగ, తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీ దేవి అజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.[

ధ్యాన శ్లోకం

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | 

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.

Related Posts:

నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

నవరాత్రుల్లో 2వ రోజు  చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )

నవరాత్రుల్లో 3వ రోజు  చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )

నవరాత్రుల్లో 4వ రోజు  చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )

నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )

నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)

నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )

నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )

నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )

> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం

కాత్యాయని, katyayani mantra, katyayani meaning, katyayani kolhapur, katyayani devi color, katyayani in telugu, katyayani devi story, vijayadasami, devi navaratrulu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON