Drop Down Menus

దేవి నవరాత్రులలో ఐదవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం | Navratri 5th Day Pooja Skandamata

నవరాత్రులలో ఐదవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం - గురువారం 19 అక్టోబర్ - పంచమి, మా స్కందమాత పూజ

స్కందమాత ( లలిత )

స్కందమాత దుర్గా, నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా, స్కందుడు(కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి.

కథ

తన కుమారుడు స్కంద/కార్తికేయ/కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాతా దుర్గాదేవి.

స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ, పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తరువాత, వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా, కుమారస్వామి జన్మిస్తాడు.

ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు, ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని, ఇది మంచి, ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ, కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా, ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది.

కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ, రెల్లు పొద(శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ, పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని, అతనిపై యుద్ధం ప్రకటించి, దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.

ధ్యాన శ్లోకం

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| 

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

అయిదవ రోజు అమ్మవారు లలితా దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి.

Related Posts:

నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

నవరాత్రుల్లో 2వ రోజు  చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )

నవరాత్రుల్లో 3వ రోజు  చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )

నవరాత్రుల్లో 4వ రోజు  చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )

నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )

నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)

నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )

నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )

నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )

> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం

స్కందమాత, Skandmata, Skandamata mantra, Skandamata katha telugu, Skandamata Navratri, Skandamata Aarti, Skandamata image, Skandamata temple, vijayadasami, devi navaratrulu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON