చంద్ర కళలను బట్టి నిత్య దేవతారాధన | Sarvadevatha Nitya Devatarchana

చంద్ర కళలను బట్టి నిత్య దేవతారాధన...

దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో మిక్కిలి ప్రేమ చూపెడివాడు, ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు, అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది.

 ఓషదులన్ని క్షీణించినవి, అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు. అంత చతుర్ముఖుడు చంద్రునికి  మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. అంత పరమేశ్వ రుడు చంద్రుని అనుగ్రహించి కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్ల పక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు. 

కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. అత్యల్ప దూరం అమావాస్య. అత్యధిక  దూరం పౌర్ణమి. చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. 16 కళలు అని వీటినే అంటారు. వాటికి పెర్లు ఉన్నాయి .

చంద్రుని పదహారు కళలు: 1. అమృత, 2. మానద, 3. పూష, 4. తుష్టి, 5. పుష్టి, 6. రతి ధృతి, 7. కామదాయిని, 8. శశిని, 9. చంద్రిక, 10. కాంతి, 11. జ్యోత్స్న, 12. శ్రీ, 13. ప్రీతి, 14. అంగద, 15. పూర్ణ, 16. అపూర్ణ. 15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి, పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప  సమయమే ఉంటాయి.

ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు. నిత్యాదేవతలు మొత్తం 16 మంది 15 నిత్యలను త్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి 16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి. జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి. లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది. అవి

బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ విదియ నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ తదియ నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ చవితి నాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ పంచమి  నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ సప్తమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ నవమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం  ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ దశమి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం  ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

అమావాస్య నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల పాడ్యమి  నాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల విదియ నాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల తదియ నాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల చవితి నాడు పుట్టిన వారు “విజయా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల పంచమి నాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల షష్ఠి నాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం  ౡం “నిత్యా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల సప్తమి నాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం  ఌం “కులసుందరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల అష్టమి నాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల నవమి నాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల దశమి నాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల ఏకాదశి  నాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల ద్వాదశి నాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల త్రయోదశి నాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

శుక్ల చతుర్ధశి నాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

పౌర్ణమి నాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని “ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

చంద్రకళల, నిత్య దేవతారాధన, chandrakala, nitya devataradhana, nitya pooja, daily pooja, slokas telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS