Drop Down Menus

శ్రీ సుబ్రహ్మణ్యుని వ్రతం ఆచరించడం వలన కుజ గ్రహ దోషాలు తొలగి అత్యంత ఉన్నతమైన జీవితం లభిస్తుంది.| Sri Subrahmanya Vratam

శ్రీ సుబ్రహ్మణ్యుని వ్రతం ఆచరించడం వలన కుజ గ్రహ దోషాలు తొలగి అత్యంత ఉన్నతమైన జీవితం లభిస్తుంది.

అశాంతికి మార్గాలు కామక్రోధ లోభాలు. క్రోధానికి కుజుడు, కామానికి శుక్రుడు, అతికామానికి కుజుడు,  లోభానికి బుధుడు కారకులౌతారు.

ఈ మువ్వురు వ్యక్తిని బాధించడంలో ప్రధాన పాత్ర వహిస్తారు. వీరిలో బుధ, శుక్రులు భౌతికవాదులు. కుజుడు ఆధ్యాత్మిక వర్గానికి సంబంధించిన వాడే అయినా ఆతనిలో ఉన్న చెడు లక్షణం అశాంతికి కారణం అవుతుంది. ఒక కోణంలో ఈ అశాంతి కోపం వల్ల కలిగినప్పుడు త్వరలో అది భౌతికాంశములకు దూరం చేసి వ్యక్తిని ఆధ్యాత్మిక వాదిగా మార్చే అవకాశం ఉంది. కారణం కోపం వచ్చిన మనిషి, కోపం వచ్చిన తర్వాత ఆ కోపం ఏ కొంచెమూ ప్రయోజనకారి కాదు అనే విషయాన్ని గుర్తించే అవకాశం. లోభ కామాలలో ఆ అవకాశం లేదు.

'ఇచ్చువాని చెంత ఈని వాడుండిన చచ్చు గాని ఈవి సాగనీడు' అన్న రీతిలో తానివ్వకపోవడంతో పాటు ఇతరుల దానగుణాన్ని కూడా సాగనీయనంతటి బలం ఆ లోభానికి ఉంది. ఆ కారణంగా భౌతికవాదులకు సంబంధించినటువంటి కామలోభాలు వ్యక్తిని ఎదగనీయకుండా దానిలో ముంచి ఉంచే లక్షణం ఉన్నట్లు తోస్తోంది. కొన్ని సందర్భాల్లో కోపం వ్యక్తి యొక్క పరిణతికి హేతువవుతూ ఉంటుంది. కొందరు కోపంతో సన్యసించి తరువాతి కాలంలో తప్పనిసరై వేదాంతాన్ని వంట పట్టించుకునే ప్రయత్నం చేయటం గమనించవచ్చు.

ముఖ్యంగా కోపంతో రంభను శపించిన తర్వాత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. ఆ దృక్కోణంలో వ్యర్ధమైన కోపము వ్యక్తి పరిణతికి హేతువు కావడం గోచరిస్తుంది. 'నేనెందుకూరుకోవాలి?' అనే సామాన్య భావననుండి విడివడితేనే లౌకికాలౌకిక మార్గాలలో అభివృద్ధి గోచరిస్తుంది. 'వరం విరోధోరపి సమం మహాత్మభిః' - మహాత్ములతో విరోధం ఏర్పడిన స్థితిలో కూడా కోపమే వ్యక్తి పరిణతికి హేతువైనట్లు అవగతమవుతుంది. అశాంతికి మూల కారణంగా భావించిన కోపము పుణ్యాన్నంతని సమూలంగా తక్షణమే నశింపజేసేదిగా అర్థం చేసుకోవచ్చు. కాని, ఆ అశాంతినుండి బయట పడే త్రోవను కూడా అదే చూపించడం ఇక్కడ విశేషం.

లోభము కూడా వదలలేనిదిగానూ గోచరిస్తూ ఎక్కువ కాలం భౌతిక దృక్పథంలో వ్యక్తి పయనించడానికి సహకరించేదిగా రూపొందుతూ బైట పడనీయని స్థితి కలిగినదిగా గోచరిస్తాయి.

రవి, చంద్ర, కుజ, గురువులు ఊర్ధ్వముఖ త్రికోణానికి చెందినవారు కాగా, శని, బుధ, శుక్రులు అధోముఖ త్రికోణానికి చెందినవారు అవుతున్నారు. లోభానికి సాధర్మ్యం కలిగినది మాత్సర్యం. అది అనారోగ్య జనకం. ఈ మాత్సర్యమూ అనారోగ్యమూ శనికి సంబంధించిన అంశాలే. కాబట్టి ఈ అనారోగ్యము వ్యక్తికి నిర్వేద రూపంలో కొంత వరకు పరిణతిని ఇచ్చే అవకాశం ఉన్నా అనారోగ్య తీవ్రత ధ్యానాదికం పై మనసు నిలబడకుండా చేసే ప్రమాదమే ఎక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే శనికి భౌతికవాదిగా ఉన్న బలమే ఎక్కువ దృఢపడుతుంది.

ఈ దృక్కోణంలో కుజునికి సంబంధించిన చెడు గుణము కూడా కొన్ని సందర్భాలలో పూర్తి పరిణతికి ఉపకరిస్తుంది అని గుర్తించవచ్చు.

ఈ దృక్కోణంలో శుక్రునికి సంబంధించిన కామము అనుభవించిన కొలదీ వృద్ధి చెందే లక్షణం కలదిగానూ, పూర్తి భౌతికవాదమైనా శుక్ర, కుజ, శనుల యొక్క దోష లక్షణాలు కామ, లోభ, మాత్సర్యాలు వ్యక్తిని ఆ భావనల నుండి బయట పడనీయుకుండా లొంగదీసుకుంటాయి. వాటిలో పుణ్యం యొక్క ఖర్చు తీవ్రంగా ఉండదు. ఆ కారణం వల్ల వాటి నుండి బయటపడలేకున్నాడు.

కుజుడు తీవ్ర స్వభావం కలిగినవాడు కావడం వల్ల అతనికి సంబంధించిన కోపం తీవ్ర స్థితిని పొంది, పుణ్యాన్ని సమూలంగా ఖర్చు చేయడం వల్ల మళ్ళీ అనుభవించే అవకాశం ఉండదు. అందువల్ల తాను నడిచే మార్గం నుండి బయట పడక తప్పదు. వాని తీవ్రతను ఏ అంశంలో బయట పెట్టినా ఆ తీవ్రత ఉన్నదాని యొక్క విధ్వంసానికి కారణమవుతుంది. అందువల్ల కుజున్ని వర్ణించేటపుడు 'ఆరోగ్నిః క్రూరదృక్ వక్రీ కుజః పాపఫలప్రదః స్వాధిష్టితం స్వదృష్టంచ భావం నాశయతి ధ్రువం' అని చెప్పారు. ఉన్న మార్గాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తే కొత్త మార్గం తొక్కక తప్పదు కదా! అంటే ఆ కుజుని యొక్క తీవ్రత భౌతికత నుంచి బయటికి గెంటేయటానికి కారణం అవుతుంది. కుజునికి సంబంధించినది అతికామం అది కూడా వారిని దానినుండి బయటపడేయటానికే కారణం అవుతుంది. 'కామిగాక మోక్షగామి కాడు' అనే మాటకూడా ఈ అంశాన్నే దృఢతరం చేస్తుంది.

లగ్నంలోని కుజుడు స్వభావంలో తీవ్రతనిస్తే ఆ తీవ్రత భౌతికవృద్ధిని పూర్తిగా ధ్వంసం చేయడం వల్ల వారు భౌతిక మార్గాన్ని వదలక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి.

ద్వితీయంలో కుజుడుంటే వాక్కును తీవ్రం చేసి కుటుంబాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది.

తృతీయంలో కుజుడుంటే సోదరసౌఖ్యాన్ని ధ్వంసం చేసే అవకాశం ఉంది. కారకో భావనాశాయ అనే అంశాన్ని కూడా ఇక్కడే ప్రస్తావిస్తూ ఉంటారు.

చతుర్థంలో కుజుడుంటే వాహన గృహ విద్యా సౌఖ్యాలను ధ్వంసం చేసి, ఒక నిర్వచనంలో అతి కాముకత్వానికి లోబడే అవకాశం ఉంది. అది కూడా దానినుండి బయటపడేయటానికే.

పంచమంలో కుజుడుంటే తీవ్రమైన ఆలోచనలతో విధ్వంసకుడుగా మారే ప్రమాదం ఉంది.

షష్ఠంలో కుజుడుంటే శత్రువులను సమూలంగా సంహరించే అవకాశం ఉంది. సమూలంగా సంహరించాక ఇంకేం చేయాలో తెలియక పూర్తి వైరాగ్యాన్ని పొందే అవకాశం ఉంది.

సప్తమంలో కుజుడుంటే సామాజిక సంబంధాలను అతిగా పెంచుకుని, రోత పుట్టి ఏకాంత జీవనానికి పయనించే అవకాశం ఉంది. నిజానికి ప్రేమ యొక్క తీవ్రత కూడా ఆకస్మికంగా దూరం చేసే అవకాశాన్నిస్తుంది.

అష్టమంలో కుజుడుంటే ఆకస్మిక లాభాలను అతిగా ప్రేమించి ఇక లేవలేనంతగా, తేరుకోలేనంతగా నష్టాలకు గురై సామాజిక వ్యవస్థకు సమూలంగా దూరమయ్యే అవకాశం ఉంది.

నవమంలో కుజుడుంటే అసంతృప్తితో భౌతికాంశాలను విడనాడే అవకాశం ఉంది.

దశమంలో కుజుడుంటే అందరినీ అతిగా శాసించి మానసికంగా అందరికీ దూరమయ్యే అవకాశం ఉంది.

లాభంలో కుజుడుంటే అతిగా దురాక్రమణలు చేసి చివరికి అన్నింటిని వదులుకొనే అవకాశం ఉంది.

వ్యయంలో కుజుడుంటే వడ్డీడబ్బులకు ఆశపడి, అప్పులిచ్చి - అసలునే కోల్పోయి విశ్రాంతిని, నిద్రను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అసలు కంటే వడ్డీ ముద్దు అనే సామెత ఈ స్వభావం నుండే పుట్టింది.

ఈ కోణంలో ఆలోచిస్తే 1,2,4,7,8, 12 స్థానాలలోని కుజ ఫలితాలు వైవాహిక జీవితానికి భంగకారులు అని కొందరు భావించడం సహజమే. కాని, ఈ రకమైన ఫలితాలు యోగకారకుడు కాని (భౌతిక యోగకారకుడు) కుజుడు అయిన సందర్భాలలో ఆ వ్యక్తి భౌతికంగా దెబ్బతిని తీవ్రమైన ఆధ్యాత్మిక దృక్పథానికి మరలే సావకాశం ఉంది. కుజునికి గల చోరకారకత్వం ఇతరుల యొక్క శక్తియుక్తులను క్రోధాదులచే బెదిరించి తనకుపయోగించుకునే అవకాశాన్ని సూచిస్తుంది.

ఈ దృక్కోణంలో దొంగ ఎక్కడ ఉంటే మంచిది? అని ప్రశ్నించుకుంటే ఎక్కడున్నా మంచిది కాదు కదా! అలాగని 12 భావాల్లోనుండి బయట పడవేయలేము కూడా కదా! కాని కుజుడు తానాశ్రయించిన భావంలో పూర్తిగా ముంచి సంసార సముద్రం నుండి, కోరికల నుండి, బయటపడేస్తాడు అని అర్థం చేసుకోవచ్చు.

మొత్తం పై ఊర్థ్వముఖ త్రికోణంలో చోటు సంపాదించిన కుజునికి సుబ్రహ్మణ్యస్వామి అధిష్టాన దైవం. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర చూసినా త్రాచుపాము కోపం కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికినీ ఆయన సుబ్రహ్మణ్యుడే. కాబట్టి సుఖదుఃఖాల మధ్యలో కొంచెం కొంచెం కొట్టుమిట్టాడేలా చేసే బుధ శుక్ర శనుల కంటే ముంచేదేదో ముంచి బయటపడేసే కుజుడు ఊర్థ్వముఖ త్రికోణానికి తగినవాడే.

శ్రీ సుబ్రహ్మణ్యుని వ్రతం| subrahmanyeswara-vratam.pdf

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

subramanya swamy vratham in telugu pdf, subramanya swamy pooja on tuesday in telugu, naivedyam for subramanya swamy, subramanya swamy abhishekam procedure, subramanya swamy abhishekam benefits, subramanya swamy pooja benefits in telugu, subramanya swamy worship day, subramanya swamy katha in telugu pdf

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.