శివార్చనా విధి విధానాలు
శివ భక్తులుగా ఉన్నవారు శివుడిని ఎప్పుడు ఎలా అర్చించాలి అనే విషయాన్ని గురించి శివపురాణం శివ విజ్ఞాన సర్వస్వం పదకొండో అధ్యాయం వివరిస్తోంది. ఈ వివరణలో ఉదయం నిద్ర లేచింది మొదలు శివ ధ్యానం, శివారాధన ఎలా చెయ్యాలి అనే విషయాలు ప్రస్తావితమయ్యాయి.
శివభక్తుడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. గురువును, శంకరుడిని, పుణ్యతీర్థాలను, నారాయణుడిని, బ్రహ్మదేవుడిని, ఇంద్రాది దేవతలను సనకసనందాది రుషులను, మునులను నందీశ్వరాది శివభక్తులను స్మరించాలి. శివస్తోత్రాలను పఠించాలి. దక్షిణ దిక్కుగా వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకోవటం, దంతధావన, స్నానాదులను పూర్తి చేయాలి. స్నానానికి నదీ తటాకాదులు శ్రేయస్కరం. ఆ సౌకర్యం లేనప్పుడు అందుబాటులో ఉన్న జలాల లోకి గంగాది పవిత్ర నదులను ఆ వాహన చేసి శ్రద్ధాసక్తులతో స్నానం చేయాలి.
అనంతరం భస్మ త్రిపుండ్రాలను ధరించాలి. ఏకాంత ప్రదేశంలో భగవధ్యానానికి ఉపక్రమించాలి. మనస్సును నిలకడగా పెట్టుకొని శివపూజ చెయ్యాలి. ముందుగా గణాధిపతిని, ద్వార దిక్పాలకులను పూజించాలి. భక్తితో శివుడికి పీఠాన్ని ఏర్పాటు చేయాలి. అలా వీలుకాని పక్షంలో ఒక పళ్ళెంలోనైనా శివలింగాన్ని పెట్టి అందులో అయిదు ముఖాలు, పది భుజాలు, మూడు కన్నులు ఉండి స్ఫటికమంత తెల్లని దేహచ్ఛాయతో పులి తోలు వస్త్రాలుగానూ, ఉత్తరీయంగానూ ధరించిన వాడిగా శివుడిని భావించి ధ్యానించాలి. ఆ తర్వాత గురువు వద్ద నుండి ఉపదేశం పొందిన మూలమంత్రంతో అంగన్యాస కరన్యాసాలను చేసి శివుడికి అర్ఘపాద్యాలను సమర్పించాలి. అర్ఘపాద్యాలను సమర్పించాలి. అనంతరం తొమ్మిది కలశాలను ఏర్పాటు చేసి వాటిలో నిర్మల జలాన్ని నింపి వట్టి వేరు, శ్రీగంధం కలపాలి. జాజికాయ, పచ్చ కర్పూరం, మర్రి డలు, తమాల పత్రాలతో చేసిన చూర్ణాన్ని ఆచమనం కోసం ఏర్పాటు చేసుకున్న పాత్రలోనూ, శ్రీ గంధ చూర్ణాన్ని అన్ని పాత్రలలోనూ కలపాలి.
శివుడి సన్నిధానంలో ధూపదీప సుగంధ ద్రవ్యాలను అమర్చి అణిమాది అష్ట సిద్ధులను, శివుడిని తూర్పు తదితర దిశలలో నెలకొల్పాలి. ఓంకారంతో ఆసనాన్ని కల్పించి సోమ సూర్యాదులను, ధర్మాదులను శివుడికి సమర్పించిన పీఠం కింద ఉన్నట్లుగా భావించాలి. సత్వరజస్తమో గుణాలను సోముడికి సమీపంలో ఉన్నట్లుగా భావించాలి. ఆ తర్వాత నందికేశ్వరుడిని పూజించాలి. అనంతరం శివుడికి వాహనాన్ని సమర్పించి పీఠం మీదకు ఆవాహన చెయ్యాలి. రుద్రాధ్యాయాలను పఠించి అభిషేకాలను నిర్వహించాలి. ఆ తర్వాత భస్మాన్ని అద్ది శ్రీ గంధాన్ని శుభాక్షతలను సమర్పించి దర్భలు, ఉత్తరేణి, జాజి, చంపక, తెల్ల గన్నేరు, మల్లెపువ్వులు, తెల్ల కలువలు లాంటి పుష్పాలతో అభిషేకించాలి. మృత్యుంజయాది మంత్రాలను పఠించాలి. మారేడు దళాలను ధూపదీప నైవేద్యాలను, తాంబూల దక్షిణలను సమర్పించాలి. శివుడు సర్వరోగ వైద్యుడని భావించాలి. ఆ తర్వాత మంగళ నీరాజనాది మంత్ర పుష్పాలు, నమస్కారాలను సమర్పించి, స్తోత్రాలను పఠించి శివలింగం పాదాల వద్ద పుష్పాలను ఉంచి నమస్కరించాలి.
ఈ పూజా విధినంతా శివుడి మీద ధ్యాస ఉంచి ఆయనే సర్వస్వం అనుకొని చెయ్యడం ఉత్తమం. విధి విధానంగా పెద్దల సూచనల మేరకు ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు నేర్చుకొని చెయ్యాల్సి ఉంటుంది. ఇలా చేసిన శివపూజ జన్మజన్మలకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక వేళ ఈ క్రమ పద్ధతి అంతా తెలియని పక్షంలో మనస్సు నిండిన భక్తితో ఈ పూజాక్రమంలో ఏ కొద్దిగా చేసినా భక్తవత్సలుడైన శంకరుడు తన భక్తులను అనుగ్రహిస్తాడని శివజ్ఞాన తత్పరులైన మహనీయులు చెబుతున్నారు.
Famous Posts:
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
శివార్చనా, shiva, sivarchana, shiv archana, shiv archana mantra, shiva, shiv mahima, shiva archana telugu pdf, shiv chalisa, shivarchan pooja