తుమ్ములు వాటి యొక్క ఫలితాలు - Sneezes are the results of them

తుమ్ముల ఫలితములు

1. రెండు తుమ్ములు తుమ్మినచో కార్యానుకూలత.

2. ఒక తుమ్ము కీడును సూచించును.

3. ఎక్కువ తుమ్ములు మంచిదికాదు.

4. ఇనుమునుగాని, వెండినిగాని, పట్టుకొన్నవాడు తుమ్మినచో కార్యహాని.

5. కంచుగాని, రాగిగాని చేత ధరించినవాడు తుమ్మినచో కార్యసిద్ధి.

6. ఎవరైననూ తుమ్మినపుడు బంగారం,మొసలి,ఆడవారినాట్యం, తాంబూలం వేసుకొన్నవారి ముఖం చూసినచో ఆ తుమ్ము వలన కలుగు కీడు నశించును.

7. ఉదయాన్నే లేవగానే తుమ్మిన శుభము.

8. నీటివద్ద,విసుగుగొనునపుడు, కలహమాడునపుడు పదుగురిలోనున్నపుడు తుమ్మినచో అవమానం, మరియు భార్యకు కీడుకలుగును.

9. పసిపాపలు, శిశువులు, ఐదుసంవత్సరాలలోపువారు. వేశ్య, బాలింతరాలు తుమ్మినచో లాభము. ధనప్రాప్తి.

10.మాలవాడు, కుంటివాడు, తుమ్మినచో తప్పక కార్యసిద్ధి జరుగును.

11. తుమ్ముచు దగ్గుచు ప్రయాణముచేయరాదు. ప్రయాణము చేయునపుడు, పడకమీద ఉమ్మివేయరాదు. వ్యాధిగ్రస్తుడగును.

12. తుమ్మినవారు నేలను గాని, తలనుగాని, గోకినచో లేక విచారముగా నున్నచో స్తంభముదాటిననూ పలు కష్టములు పడుదురు. ప్రయాణము మానుకొనవలెను.

13. జారస్త్రీ,ముత్తైదువ, విధవ, గ్రుడ్డిది, బిడ్డలు లేని స్త్రీలు తుమ్మినచో అత్యవసర మైనపనియైననూ మానవలెను లేనిచోమరణము సంభవించును.

14. చాకలి కుటిలస్వభాముగల స్త్రీ, మూగది, ఎరుకులది,మొండిది. తెలుకలస్త్రీ, ముక్కులేనిది ఇట్టి అంగవైకల్యము కల్గినవారు తుమ్మిననూ ప్రయాణమును వాయిదావేసుకొనవలెను. లేనిచో కష్టనష్టములు పాలగుదురు.

15. నాలుగు కాళ్ళజీవి ఎదురైననూ, తుమ్మినచోమంచిదికాదు.సాహసించరాదు.

Famous Posts:

Tags: తుమ్ములు ఫలితాలు, Thummulu, Thummulu Phalitalu Telugu, Results of sneezing, Sneezing, Sneezing Results Telugu

Comments