Drop Down Menus

ఏ తిథి నాడు పితరుల అర్చన చేస్తే ఏ ఫలాలు దొరుకుతాయి | What fruits do you get if you perform Pitura Archana on any Tithi?

ఏ తిథి నాడు పితరుల అర్చన చేస్తే ఏ ఫలాలు దొరుకుతాయి.

ధర్మరాజు అడిగిన మీదట  భీష్ముడు ఈ రహస్యాలు చెప్పాడు.

1) ‘‘పితౄన్ పూజ్యదితః పశ్చాత్ దేవతాస్తర్పయంతి వై|

తస్మాత్ తాన్ సర్వయజ్ఞేన పురుషః పూజయేత్ సదా||

ముందుగా పితరులను పూజించి తరువాతే దేవతలను పూజించాలి‘‘ అనే మొదటి రహస్యాన్ని చెప్పారు.

కనుక అన్ని యజ్ఞాలు, పుణ్యకార్యాలలోనూ ముందుగా పితరులను పూజించాలని భీష్ముడు చెప్పాడు.

2) ‘‘ధన్యం యశస్యం పుత్రీయం పితృయజ్ఞం పరంతప‘‘

ఈ పితృయజ్ఞాలు పరమశుభకరం. ధనాన్నీ, కీర్తినీ, పుత్రులనూ కలిగిస్తాయని భీష్ముడు చెప్పాడు.

3) ప్రతి పాడ్యమి నాడు పితరులను అర్చిస్తే మంచి ఇల్లు, అనుకూలవతి, అందమైన భార్య లభిస్తుంది. ఆమెకు బహుసంతానం కలుగుతుంది.

4) కుమార్తెలు కావాలనుకున్నవారు విదియనాడు పితరులను అర్చించాలి.

5)  గుర్రాలు (వాహనాలు) కావాలనుకున్నవారు తమ తల్లితండ్రులను తృతీయనాడు అర్చించాలి.

6) చవితినాడు అమ్మా నాన్నలను అర్చిస్తే ఇంటిలోని కోడి, మేక, గొర్రె వంటి సంపదలు అభివృద్ధి అవుతాయి.

7) పుత్రసంతానం కావాలనుకున్నవారు ప్రతీ పంచమి నాడు పితరులను అర్చించాలి.

8) తేజస్సు, ఆకర్షణీయమైన దేహం కావాలనుకున్నవారు (నటీనటులు, చర్మబాహ్యసౌందర్యం ద్వారా వృత్తులలో ఉన్నవారు) షష్ఠినాడు అమ్మానాన్నలను అర్చించాలి.

9)  వ్యవసాయంలో వృద్ధి కావాలనుకునే వైశ్యశూద్రాదులు సైతం సప్తమి నాడు పితరులను అర్చించాలి.

10) వ్యాపారాలు చేసేవారు అష్టమి నాడు అమ్మానాన్నలను పూజించాలి.

 11) నవమినాడు పశుపాలనం చేసే (యానిమల్ హజ్బెండరీ) వారు తమ తల్లితండ్రులను అర్చిస్తే ఒంటి గిట్టలున్నజంతువులు వృద్ధిపొందుతాయి.

12) దశమినాడు పితృదేవతార్చన వల్ల గోధనం వృద్ధి అవుతుంది.

13) ఏకాదశినాడు అమ్మానాన్నలను అర్చిస్తే బంగారం వెండీ  ధనరాశులు అన్నీ పొందుతారు.

14) ద్వాదశినాడు అమ్మానాన్నలను అర్చించి అనుగ్రహం పొందితే బంగారం వెండి ధనరాశులు సొంతం అవుతాయి.

15) బంధుకోటిలో మేటివారు కావాలనుకొంటే త్రయోదశినాడు పితరుల అర్చన చేయాలి.

16) అమావాస్య నాడు అర్చిస్తే సకల కామితాలూ తీరుతాయి.

17) చతుర్దశినాడు విరామం. ఈ రోజు పితృదేవతార్చనలకు విరామం ఇవ్వాలి. ఈ రోజు తద్దినం తప్ప కామ్య శ్రాద్ధాలు చేయరాదు.

18) శుక్ల పక్షం కన్నా కృష్ణపక్షంలో చేసే పితరుల అర్చన విశేషఫలం ఇస్తుంది. మధ్యాహ్నం చేసే పితరుల అర్చన సర్వశ్రేష్ఠం.

పైవన్నీ భీష్ముడు చెప్పిన పితృదేవతార్చనా రహస్యాలు. ఏ తిథినాడు ఏ రకమైన వరాలు పొందుతారో చెప్పాడు.

ఏ ఏ కోరికలు తీరాలను కుంటే ఆయా వారాలు, నక్షత్రాలు, తిథులలో అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుంటే చాలు. అతి తొందరగా వారికి కావలసిన కోరికలు తీరుతాయి.  వీటిని కామ్యపితృయజ్ఞాలు అంటారు. అంటే కోరికలు తీర్చమని చేసే పూజలు . ఇవి మన కోరికల బలం కొద్దీ ఎన్ని సార్లైనా చేయవచ్చు.

కోరికలు తీవ్రంగా ఉన్నవారు వారాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆరున్నొక్క రోజులకు మనం ఎంచుకున్నది తిరిగి వస్తుంది. తిథి కేవలం 15 రోజులకు వస్తుంది. నక్షత్రం 27 రోజులకు వస్తుంది.

నిజానికి తిథి, వారం, నక్షత్రం కలిసే ఉంటాయి. కనుక  తీరాలనుకున్న కోరికలు తీర్చే తిథి, వార, నక్షత్రాలు కలసి కానీ విడిగాగానీ వస్తే వాటిని వదులుకోరాదు. కేవలం తిథి, వారం, నక్షత్రం వచ్చినా సేవించాలి. లేదా మనకు కావలసిన తిథివారం, వారంనక్షత్రం, నక్షత్రం తిథి వచ్చినా వదలకుండా సేవించాలి. మనకు కావలసిన తిథి, వారం, నక్షత్రం కృష్ణపక్షంలో వస్తే అది మహాపుణ్యకాలంగా భావించి విశేషంగా పితరులను అర్చించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చతుర్దశినాడు కామ్యయజ్ఞాలు చేయరాదు. కేవలం తద్దినాలు మాత్రమే పెట్టాలి.

పైన చెప్పిన కోరికలు తీరాలనుకున్నవారు తమకు అనుకూలమైన తిథి, వార, నక్షత్రాలను ఎన్నుకొని అవి వచ్చిన  ప్రతీ రోజూ  ఈ విధంగా చేయాలి.

1) ముందు రోజు నిషేధపదార్థలు తీసుకోరాదు. తినరాదు. బ్రహ్మచర్యం వహించాలి.

2) ఆ రోజు ఉదయమే తలకు స్నానం చేసి స్వధానామాన్ని ఎన్నిసార్లు మదిలో తలచుకోగలిగితే అన్ని సార్లు తలచుకోవాలి.

3) తల్లి తండ్రులు లేని వారు తూర్పు వైపునకు తిరిగి రెండు చేతులూ పైకి ఎత్తి ‘‘ నాకు ఫలానా కోరిక ఉంది దయచేసి నా వంశంలోని తాతతండ్రులు తీర్చాలని కోరుతున్నాను. నేను నా శక్తి కొలదీ గోసేవ చేస్తాను.‘‘ అనే అర్ధం వచ్చే విధంగా ప్రార్థించాలి.

4) మీకు దగ్గరలో ఉన్న ఆవుకు ఒక రోజు గ్రాసం అంటే ఒక రోజుకు సరిపడా మేతను రెండుపూట్లా వేయాలి. అంటే పచ్చగడ్డి, ప్రత్తిగింజలు, గానుగ నుంచీ వచ్చిన నూపప్పు, పల్లీపప్పు వంటి  పప్పుచెక్కలు, (తెలగపిండి), చిట్టూ తవుడూ వంటివి వేయాలి. దూడ ఉంటే దానికి కూడా సరిపడా వేయాలి.

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

Tags: పితృదేవతలు, pitru devata stotram in telugu pdf, pitru devathalu means in telugu, pitru loka, పితృ దేవత స్తోత్రం pdf, pitru thidhi, pitru amavasya

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON