Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ | Why is Gaya famous for Pind Daan?

గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ

గయలో పిండదాన మొనరించువారు ప్రేత శిలాది తీర్థాలలోస్నానం చేసి అస్మత్కులే మృతాయేచ (ఈ మంత్రాలు సంపూర్ణంగా అనుబంధం-9లో ఇవ్వబడ్డాయి). మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ట పితరులను ఆవాహనంచేసి వరుణానది యొక్క అమృత మయ జలాలతో పిండదానం చేయాలి.

ఆ మంత్రాల భావం ఇలా వుంటుంది.

నా పితృ వంశంలో గాని మాతృవంశంలో గాని మరణానంతర సద్గతులు పొందని వారిని ఈ దర్భపృష్ఠంపై తిలోదకం ద్వారా ఆ నా పితరులందరినీ ఆవాహన చేస్తున్నాను. వారందరికీ సద్గతులు కలగడానికే నేనీ పిండ ప్రదానం చేస్తున్నాను. నా 'పై' రెండు వంశాలలో మృతి నొందిన సర్వులకూ సద్గతికై నేనిపుడు పిండప్రదానం చేస్తున్నాను. వీరంతా ఉద్ధరింపబడాలనేదే నా ఆశయము. సహజ మరణం పొందినవారికీ, బలవన్మరణం పొందినవారికీ కూడా నేనీ పరమ పుణ్యక్షేత్రమైన గయలో పిండప్రదానం చేస్తున్నాను.

రౌరవ, అసిపత్ర, కుంభీపాక నరకాలలో... పడివున్న నా ఇరువంశాల మృతులనూ ఉద్ధరించి ఉత్తమగతులకు పంపడం కోసం నేను వారందరినీ ఆవాహన చేసి పిండప్రదానం చేస్తున్నాను. అలాగే అంధతామిస్ర, కాలసూత్ర నామక నరకాలలోనూ, ప్రేతలోకంలోనూ పడియున్న నా పితరులందరినీ ఉద్ధరించడానికి నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. మానవజన్మ దుర్లభమై, మానవేతర యోనుల్లో జనించి జీవిస్తున్న నా పితరులందరికీ నేనిక్కడ పిండప్రదానం చేస్తున్నాను.

పుత్ర, పత్నీ రహితులుగా మరణించిన నా ఈ జన్మ బాంధవులకూ, నా పూర్వజన్మ బంధువులకూ కూడా ముక్తి కలగడం కోసం నేనిక్కడ పిండప్రదానం చేస్తున్నాను.

నా పితరులలో ఇతర జంతు, వృక్షయోనులలో జనించిన వారికి ఉత్తమ గతులను కలిగించడం కోసం కూడా నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. ప్రేతరూపంలో శాపవశాత్తూ ఉండిపోయిన నా వారికి కూడా నేనీ అద్భుత పుణ్యక్షేత్రంలో పిండప్రదానం చేస్తున్నాను. ఇంకా గర్భస్రావితాత్మత లతో సహా నా పితరులందరికీ ఉత్తమగతులకై నేనిక్కడ పిండ ప్రదానాలను గావిస్తున్నాను.

బ్రహ్మేశానాది దేవతలారా! మీరంతా నా ప్రయత్నానికి సాక్షులుగా వుండాలని ప్రార్థిస్తున్నాను. నేను గయా క్షేత్రానికి వచ్చి నా వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా శ్రాద్ధ కర్మలను నిర్వహించి పిండప్రదాలను సంపన్నం చేశాను.

హే భగవాన్! గదాధర విష్ణుదేవా! నేను పితృకార్యాలను సంపన్నం చేయడానికై గయాతీర్థాలకు వచ్చియున్నాను. నా ద్వారా జరిగిన ఈ కర్మలన్నిటికీ తమరే సాక్షి. మీ దయవల్ల నేను దేవ, గురు, పితృ అను మూడు రకాల ఋణాల నుండీ నేటితో విముక్తుడనైనాను’.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

Tags: గయా తీర్థం, పిండ ప్రదానం, best day for pind daan, gaya pind daan cost, Pitru Paksha, gaya pinda dan, gaya pinda pradanam telugu, gaya temple, bhihar

Comments

Popular Posts