Drop Down Menus

అత్తవారింట్లో క్రొత్త కోడలు పాటించవలసిన విధులు | Duties to be followed by a new daughter-in-law

క్రొత్త కోడలు పాటించవలసిన విధులు

అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆరునెలల వరకు ఆ యింటిలోని వారి ప్రవర్తన గురించి భర్తకు ఫిర్యాదు చేయరాదు. ఆ కుటుంబసభ్యులు ఎంత పరుషంగా మాట్లాడినా ఈ ఆరునెలలకాలంలో కంట తడి పెట్టరాదు. మాటకు మాట జవాబు చెప్పరాదు.

క్రొత్తకోడలు ఆరునెలలవరకు అత్తవారింట్లో తన భర్తవి తప్ప అన్యుల బట్టలుతుకుట వలన ఆ కుటుంబములో అనేక అరిష్టములు కలుగును. వీధి' వాకిళ్ళు ఊడ్చరాదు. పగటి వేళలందు నిద్రించరాదు. భర్త తప్ప అన్యులు భుజించిన పళ్ళెరములలో భోజనము చేయరాదు. ఇతరుల మంచములపై కూర్చుండరాదు.

అత్తమామలు తప్ప అన్యులవద్దనుండి కాన్కలు స్వీకరించరాదు. ఒంటరిగా దేవాలయములను సందర్శించరాదు. ఆ కుటుంబసభ్యులలో ఒకరైనా తోడులేనిదే శుభకార్యములకు హాజరు కారాదు.

పూర్తి నల్లని వస్త్రముగాని, పూర్తి తెల్లని వస్త్రముగాని ధరించరాదు. బిగ్గరగా ఆవులించరాదు. పాదరక్షలు ధరించి యింటియందు సంచరించరాదు.

ప్రతి శుక్రవారము తలస్నానము చేసి, పాయసమును నెవేద్యముగా తన యిష్ట దైవమునకు అర్పించుకొని, ప్రసాదమును తన చేతులతో కుటుంబ సభ్యులకు పెట్టవలెను.

పౌర్ణమి రోజు పసిడి వర్ణపు వస్త్రములను ధరించి చంద్రుని ఆరాధించిన తరువాత వెన్నెలలో కూర్చొని భర్తతో కలిసి భోజనము చేయవలెను.

ఆడపడుచుల కంటే మిన్నగా ఆభరణములు ధరించరాదు.

వివాహానంతరం వచ్చే మొదటి అమావాస్యను పుట్టింటి యందు ఒంటరిగా గడుపవలెను. నెలపొడుపు చంద్రుని చూసేంత వరకు భర్తను చూడరాదు. నెల పొడుపు తర్వాత ఆడపడుచులకు నూతన వస్త్రములు కానుకగా సమర్పించుకొని అత్తవారింట ప్రవేశించవలెను. పుట్టింట స్వచ్ఛమైన నేతితో తయారు చేయబడిన తీపి పదార్దములను వెంటతీసుకెళ్ళి పొరుగునున్న ఐదిళ్ళవారికి పంచవలెను.

వివాహమైన ఆరునెలలలోగా అత్తవారింట్లో ఎవరైనా మృతి చెందిన యెడల శవదహనం తర్వాత 21 రోజులు పుట్టింట్లో గడుపవలెను.

కుమారుని వివాహం జరిగిన తర్వాత 6 నెలల వరకు గృహ నిర్మాణం చేపట్టరాదు. ఉన్న యింటికి మరమ్మత్తులు చేయడం అనివార్యమైన యెడల కోడలిని పుట్టి నింటికి పంపి, మరమ్మతులు పూర్తయినతర్వాత అత్తగారు వెళ్ళి స్వయముగా కోడలిని వెంట బెట్టుకుని రావలెను. కుమార్తె వివాహము నిశ్చయమైన రోజునుండి సంవత్సరకాలం వరకు నూతన గృహనిర్మాణము చేపట్టరాదు.

సంతానంలో ఇరువురికి ఒకే మాసంలో పెళ్ళి చేయరాదు. మగపిల్లల వివాహములకు మధ్య ఆరు మాసములు, ఆడపిల్లల వివాహములకు మధ్య తొమ్మిది మాసములు ఖాళీ ఉండాలి. కుటుంబంలో ఎవరైనా మరణించిన యెడల సంవత్సరకాలం వరకు ఆ యింట వివాహములు జరుగకూడదు.

కాపురం మొదలైనాక మూడుమాసములలోపు అత్తవారింట్లో ఎవరైనా తనను శారీరకంగా హింసించిన యెడల తన వివాహాన్ని యితరులు అనుమతితో నిమిత్తం లేకుండా రద్దు చేసుకునే హక్కు స్త్రీకి గలదు. ఈ హక్కును తొలగించే అధికారం సమాజానికి లేదు.

భర్త యొక్క లైంగిక అసమర్థత కారణంగా శోభనం తర్వాత ఆరునెలలలోగా ఎప్పుడైనా తన వివాహమును రద్దు చేసుకునే హక్కు స్త్రీకి గలదు. వివాహమును రద్దు చేసుకొనడానికి ముందు ఆమె మరో పురుషునితో శారీరక సంబంధం కలిగి యుండరాదు.

వివాహమైన తర్వాత ఆరునెలలలోగా స్త్రీ పర పురుషునితో శారీరక సంబంధం కలిగియున్న యెడల ఆ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు భర్తకుంది. అటుల వివాహము రద్దైన యెడల స్త్రీని పుట్టింటి వారు స్వీకరించరాదు. ఏ పురుషుడైతే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొనినాడో అతడామెను భార్యగా స్వీకరించ వలెను.

ఆ పురుషునికి అంతకు పూర్వము వివాహమైనప్పటికీ అతడామెను భార్యగా స్వీకరించవలెను. ఆ పురుషుని ఆస్తిలో తర్వాత వచ్చిన భార్యకు హక్కు ఉండదు. అతని ద్వారా ఈమెకు కలిగిన సంతానానికి మాత్రం అతని తొలి భార్య సంతానంతో సమానముగా ఆస్తిలో హక్కు కలదు.

వివాహమైన తర్వాత ఆరు మాసములలోగా ఒకరికంటే ఎక్కువ మంది పరపురుషులతో సంబంధం కలిగిన స్త్రీని గ్రామమునుండి బహిష్కరించ వలెను. ఆమెను శారీరకంగా గాని, మానసికంగా గాని దండించే అధికారం సమాజానికి లేదు.

వివాహమైన తర్వాత ఆరునెలలలోపు భర్త సోదరునితో శారీరక సంబంధము కలిగి యున్నచో, ఆమె ఆ సోదరులకు ఉమ్మడి భార్యగాను, ఆ కుటుంబ సభ్యురాలిగాను పరిగణింప బడుతుంది. ఆమె సంతానానికి తండ్రి మొదటగా వివాహమాడిన వ్యక్తి. ఆమె యిష్టంతో నిమిత్తం లేకుండా ఆమె భర్తకు మరొక స్త్రీని వివాహమాడే స్వేచ్ఛ కలుగుతుంది.

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

Tags: క్రొత్త కోడలు, కోడలు, Kodalu, Atta, New Kodalu, Daughter-in-law Definition, Daughter-in-law, New Marriage

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.