Drop Down Menus

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం | Sri Lakshmi Narasimha Swamy Temple Antharvedi

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామములో ఉంది. బంగాళాఖాతం మరియు గోదావరి నది, ఉపనది అయిన వశిష్ఠ గోదావరి కలిసే ప్రాంతములో 15వ మరియు 16వ శతాబ్దాలలో ఈ ఆలయమును చాలా పవిత్రముగా నిర్మించారు.

ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశికి ముందు రోజున అనగా మాఘ మాసములో (ఫిబ్రవరి) 11 వ రోజున మాఘ శుక్ల ఏకాదశి నాడు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం (శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు లక్ష్మీ దేవి యొక్క దైవ వివాహం) చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. భీష్మ ఏకాదశి నాడు, రథయాత్ర జరుపుకుంటారు. భక్తులు భారీ సంఖ్యలో ఈ వివాహాన్ని చూడడానికి హాజరవుతారు మరియు సప్తసాగరంలో పవిత్ర స్నానమాచరిస్తారు.

నవంబర్ నెలలో, భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో శ్రీ నరసింహ స్వామి వారు ఎటువంటి ఆభరణాలు, అలంకరణ మరియు చందనం లేకుండా దర్శనమిస్తారు. ఫాల్గుణ మాసంలో (జనవరి), స్వామి వారి రధోత్సవం జరుగుతుంది. పంచామృత అభిషేకం జరిగేటప్పుడు, డోల పౌర్ణమి వేడుకలు కూడా జరుపుతారు.

దేవాలయ చరిత్ర:

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచన, వశిష్ట నది ఒడ్డున శివునికి పదివేల సంవత్సరాలు విపరీతమైన తపస్సు చేశాడు. శంకరుడు అతని తపస్సుతో ఎంతో సంతోష పడి ప్రత్యక్షమైతాడు. అప్పుడు రక్తవిలోచన అడిగిన వరమును ప్రసాదిస్తాడు, తన శరీరం నుండి యుద్ధంలో తన రక్తముతో తడిచే ఇసుక రేణువుల సంఖ్యకు సమానముగా అతని కంటే బలంగా మరియు శక్తివంతుడైన రాక్షసులు తయారవ్వాలని కోరాడు మరియు వారు అతనికి యుద్ధంలో శత్రువులను చంపేవారికి సాయంగా ఉండాలని కోరాడు.

తన మానవాతీత శక్తులతో, అతను భూతకాలంలో మునులను, దేవతలను మరియు అమాయకులైన ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. వశిష్ట మహర్షి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న విశ్వామిత్ర మహర్షి ఇదే అదునుగా భావించి తన 100 కుమారులను రెచ్చగొడుతాడు. గౌతమీ నదిని సముద్రంలో కలిపిన తర్వాత వశిష్ట మహర్షి కఠినమైన తపస్సును చేస్తారు. అరుంధతి తన పిల్లలను కాపాడమని వశిష్ట మహర్షిని కోరుతుంది. అప్పుడు నరసింహ స్వామి గరుడ వాహనం తో మహర్షి వద్ద ప్రత్యక్షమవుతారు. ఈ భీకర యుద్ధంలో రాక్షసుడైన రక్తవిలోచన యొక్క శక్తి పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు శ్రీ నరసింహ స్వామి తన దివ్య దృష్టితో రక్తవిలోచనునికి ఉన్న వరాన్ని కనిపెడతారు. స్వామి వారు అప్పుడు ఒక మాయా శక్తిని సృష్టిస్తారు.

ఆ శక్తి యొక్క రక్తపు చుక్క భూమిని తాకకుండా తన నాలుకతో భూమినంత పరచమని కోరుతారు. తరువాత స్వామి వారు ఆ రాక్షసుణ్ణి తన చక్రం తో వధించేస్తారు, మరియు చక్రాన్ని, ఆయన చేతులను ఒక కొలనును సృష్టించి అందులో కడిగివేసుకుంటారు. దానినే ఇప్పుడు "చక్ర తీర్థం" అంటారు. ఈ తీర్థంలో స్నానం చేసినవారు ప్రస్తుత జీవితంలో చేసిన పాపముల నుండి ఉపశమనం పొందవచ్చని నమ్ముతారు. వశిష్ట మహర్షి కోరిక మేరకు స్వామి వారు తన భార్య అయిన లక్ష్మి దేవితో ఇక్కడే పశ్చిమ దిశగా కొలువై వుంటారు. మాయ శక్తి గుర్రముపై రావడం వలన ఆమెను అశ్వరుడాంబిక అని పిలుస్తారు. ఈమెను గురక్క అని కూడా పిలుస్తారు. యుద్ధాల నుండి సృష్టించబడిన రక్తపు కొలనును రక్తకుల్య అని పిలుస్తారు.

వసతి వసతి సదుపాయం

ఆలయ అధికారులు ప్రస్తుతం 31 గదులను అందజేస్తున్నారు, వీటిలో 10 A/C గదులు మరియు 21 నాన్ A/C గదులు TTD గెస్ట్ హౌస్ మరియు టూరిస్ట్ గైస్ట్ హౌస్ (ఆలయానికి ఎదురుగా) ఉన్నాయి.

రవాణా

By Road:

ప్రైవేట్ మరియు పబ్లిక్ సంస్థలు రాష్ట్రంలోని అన్ని ప్రధాన మరియు చిన్న నగరాలు నుండి నర్సాపురం వరకు బస్సులను నడుపుతున్నారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం(అంతర్వేది) నర్సాపురం నుండి 20 కి.మీ. దూరములో ఉంటుంది. నర్సాపురం నుండి దేవాలయానికి పడవలో వెళ్లాల్సి ఉంటుంది.

By Train:

దేవాలయానికి సమీపములో 20 కి.మీ. దూరములో నర్సాపురం రైల్వే స్టేషన్ ఉంది.

By Air:

దేవాలయానికి సమీపములో 109 కి.మీ. దూరములో రాజమండ్రి జాతీయ విమానాశ్రయము ఉంది.

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం, అంతర్వేది, సఖినేటిపల్లి మండలం, తూర్పు గోదావరి, పిన్ కోడ్ – 533 252,

5: 9491000719 & 8978635879 & 9492260629

ఈ-మెయిల్:antarveditemple@rediffmail.com

సందర్శించవలసిన ప్రదేశాలు

> Sri Bala Balaji Swamy Vari Devasthanam, Appanapalli(శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం, అప్పనపల్లి)

> Sri Bhimeswara swamy vari devasthanam,Draksharamam(శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, ద్రాక్షారామం)

> Samalkot Kumararama Bhimeswara Swamy Temple(పంచరామక్షేత్రం సామర్లకోట దేవాలయం)

> Sri Ksheera Ramalingeswara Swamy vari Devasthanam,Palakollu(శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. పాలకొల్లు)

Tags: అంతర్వేది, లక్ష్మీ నరసింహస్వామి, Lakshmi Narasimha Temple, Antarvedi, Antarvedi Beach, Antarvedi temple, East Godavari, Narasimha Swamy Temple

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.