ఆలయ దర్శనం పాటించవలసిన నియమాలు:
ప్రజలు నిరాడంబరంగా దేవాలయాలను సందర్శించిన నాడే దేవాలయాలకు సార్ధకత.
నీవు ఆలయాన్ని దర్శించే సమయంలో నీ వస్త్రముల వలన నీకు యిబ్బంది కలుగకూడదు. ఇతరులకు యిబ్బందికరంగా ఉండరాదు. దైవం పైనుండి ఇతరుల దృష్టి నీపై పడేలా నీవు వస్త్రధారణ చేయరాదు. ఇతరుల దృక్కులు నీ శరీరాన్ని పదే పదే తాకితే అవి నీ ఏకాగ్రతను భంగం చేస్తాయి.
దేవాలయములను సందర్శించే సమయమున నీ దేహము, బట్టలు శుభ్రముగా యుండవలెను. ఎటువంటి దుర్గంధము వెదజల్లబడరాదు. అటులని సువాసనలు వెదజల్లరాదు. స్త్రీలు తమ హోదాను వ్యక్తపరచే విధంగా ఆభరణములు ధరించరాదు.
కాళ్ళూ చేతులు కడుక్కోకుండా ఆలయంలో ప్రవేశించరాదు. గర్భగుడిలో ప్రవేశించ దలచుకున్నచో పసుపు నీటితో కాళ్ళు కడుక్కోవలెను. పాదముల తడి ఆరునంత వరకు ద్వారం వెలుపల వేచి యుండవలెను.
పట్టువస్త్రము ధరించి స్త్రీలు గర్భగుడిలో ప్రవేశించరాదు. గర్భగుడిలో ప్రవేశించే పురుషులకు నాభి పై భాగమున వస్త్రములు ఉండరాదు. ఉత్తరీయమును నడుముకు బిగించవలెను. కట్టుపంచె చెంగులు నేలను తాకరాదు.
గర్భగుడిలో ప్రదక్షిణ చేయరాదు. దేవతా విగ్రహానికి వెన్ను చూపుతు గర్భగుడి నుండి నిష్క్రమించ రాదు.
రద్దీగా నున్న సమయంలో వరుసలో నిలబడి దైవ దర్శనం చేసుకోవలెను. త్రొక్కిసలాటకు పాల్పడి దైవాన్ని దర్శించడం నిష్ప్రయోజనం.
ఎక్కువ సమయం వేచియుండవలసి వచ్చినప్పుడు అసమ్మతి, అసహనం వ్యక్తం చేయరాదు. పూజారులకు, అర్చకులకు కానుకలు ఆశచూపి నీకు ఎక్కువ సమయం కేటాయించేలా చేసుకోవడం వల్ల నీ అహం మాత్రమే తృప్తి పడుతుంది. దైవకృప దక్కదు. నీ కారణంగా యితర భక్తులు వేచియుండవలసి వస్తే నీవు దైవకృపను కోల్పోతున్నావని గుర్తించు.
దైవదర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో కొద్ది సమయం ప్రశాంతంగా కూర్చో. ఆసమయంలో నీ మనసులో వేరు ఆలోచనలు ఉండరాదు. త్వరగా యిల్లు చేరాలన్న ఆరాటము ఉండరాదు.
పసిపిల్లలను ఆలయ ప్రాంగణంలో శిక్షించరాదు. దూషించరాదు. ఆలయ ప్రాంగణంలో పసివాని రోదన విన్పించగానే అర్చకుడు కార్యక్రమాలను తక్షణమే నిలుపు చేయాలి. రోదిస్తున్న పసివారిని సముదాయించిన తర్వాతనే పుజాకార్యక్రమం కొనసాగించాలి.
Famous Posts:
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
Tags: ఆలయ దర్శనం, temple darshan rules, temple, darshnam rules in telugu, alayala darshnam,