Drop Down Menus

శ్రావణ మాసం వరకు వివాహ గృహ ప్రవేశ ముహూర్తములు - marriage and house opening muhurthams

శ్రావణ మాసం వరకు వివాహ గృహ ప్రవేశ ముహూర్తములు నిర్ణయం

👉 ప్రస్తుతము మార్చ్ నెల లో వివాహ, గృహ ప్రవేశ ముహూర్తములు  18 వ తేదీ వరకు ఉన్నాయి. 

👉 మార్చ్ 22 వ తేదీ ఉగాది తో చైత్ర మాసం ప్రారంభం అవుతుంది.

ఉగాది కాగానే, 23, 24, 25, 27, 30 తేదీలలో కూడా ముహూర్తము లు ఉన్నాయి. 

కానీ 30 వ తేదీ శ్రీ రామ నవమి అవుతుంది.

సీతా రాముల కళ్యాణం కానిది మన ఇంట్లో కల్యాణం చేయరాదు అని, పందిర్లు వేయరాదు అనే భావనతో ....

మన వైపు ఉగాది నుండి రామ నవమి వరకు గల ముహూర్తాలు పాటించరు.

👉 తేదీ 30-03-2023 నుండి 30-04-2023 వరకు అనగా ఏప్రిల్ నెల మొత్తం గురు మౌడ్యమి ఉన్నది. 

కాబట్టి ఏప్రిల్ నెల మొత్తం ఎలాంటి వివాహ , గృహ ప్రవేశ ముహూర్తాలు లేవు.

అయితే మౌడ్యమి (ఏప్రిల్) లో నామకరణం, అక్షరాభ్యాసం, పుట్టువెంట్రుకలు తీయడం, వివాహ ఒప్పందాలు, భూముల రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చు. తప్పు లేదు.

👉 మళ్ళీ మే , మరియు జూన్ లలో  శుభ ముహూర్తాలు ఉన్నాయి.

👉 మే లో వివాహాలు పెట్టుకునే వారు ఏప్రిల్, 23, 24, 25, 27, 30 తేదీలలో పత్రికలు రాసుకోవడం, సున్నాలు వేయడం, పూలు పండ్లు చేసుకోవాలి.

👉 అయితే మే నెలలో తేదీ 05-05-2023 నుండి 25 -05- 2023 వరకు వాస్తు కర్తరి (కత్తెర్లు) ఉన్నాయి. ముందుగా డొల్లు కర్తరి, తర్వాత నిజ కర్తరి ఉంటుంది.

👉 మే లో తేదీ 11-05-2023 నుండి 25-05-2023 వరకు నిజ కర్తరి (కత్తెర్లు) సమయం లో భూమి తవ్వకం, బోర్లు వేయడం , శంఖుస్థాపన, గృహప్రవేశాలు చేయకూడదు.

*వివాహాలు చేసుకోవచ్చు.

👉 మళ్ళీ ఈసారి తేదీ 19-06-2023 నుండి 18-08-2023 మద్య ఆషాఢ మాసం మరియు అధిక శ్రావణ మాసము లలో ముహూర్తాలు ఉండవు. అందులోనే శుక్ర మౌడ్యమి కూడా వచ్చి పోతుంది.

నిజ శ్రావణ మాసం లో ఆగస్ట్ 19 వ తేదీ నుండి సెప్టెంబర్ 11 వరకు ముహూర్తాలు ఉన్నాయి.

మొత్తం మీద....

👉 ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఎలాంటి ముహూర్తాలు లేవు.

మే 11 నుండి 25 వరకు గృహ ప్రవేశ ముహూర్తాలు లేవు.

జూన్ 19 నుండి ఆగస్ట్ 18 వరకు ముహూర్తాలు లేవు.

తెలుగు రాశిఫలాలు 2023-2024

Tags: శ్రావణ మాసం, Sravana Masam, Marriage Dates, Pelli Muhurthalu, Grihapravesam, March Month best Dates,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON