ఉద్యోగ ప్రాప్తి కొరకు సంపాదన కొరకు శివుడిని ఎలా పూజించాలి? What is the best way to worship Lord Shiva?

ఉద్యోగ ప్రాప్తి కొరకు సంపాదన కొరకు శివుడిని ఎలా పూజించాలి

కోటి విద్యలు కూటి కొరకే. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి జీవితంలో సంపాదనకు నాంది పలుకుతాడు.

ఉద్యగం అనేటటువంటి విషయాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనుకున్నపుడు. శివ కుటుంభం అనగా పార్వతీ పరమేశ్వరులు వినాయక కుమారస్వాములు నలుగురూ కుటుంబ సమేతంగా ఉన్న ఒక చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచి.

మారేడు దళాన్ని చేతిలో తీసుకొని ఆ మారేడు దళంపై గంధాన్ని రాసి ఆ తల్లి పార్వతీ దేవికి తమ కోరికను తెలియజేయాలి అమ్మా నాకు ఉద్యోగాన్ని పొందే యోగాన్ని కలిపించు తల్లి అని తమ కోరికను అమ్మవారికి తెలియజేయాలి.

ఎందుకంటే అమ్మ యొక్క మనసు వెన్న కనుక మన కోరికను అమ్మవారికి చెప్పినట్లయితే అమ్మవారు అయ్యవారికి చెబుతుంది. ఇందులో మారేడు దళం అనేది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అది జన్మ జన్మాంతర పాపాలను పటా పంచలు చేస్తుంది.

దానిపైన గంధం అనేది అమ్మవారికి ప్రీతి పాత్రమైనది పైగా శాంతిని కలిగించునది కనుక వీటిని చేతిలో ఉంచి " యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః " అని 108 సార్లు జపించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంభం వద్ద పెట్టి నమస్కరించుకుంటే జన్మాంతర పాపములు తొలగి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది.

Famous Posts:

శాస్త్రం ప్రకారం.. శివ దర్శనం ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఫలితం..!!

పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు..!!

అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా చదవాల్సిన శివ నామాలు..

ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం శివుణ్ణి ఈ విధంగా పూజించండి.

శ్రీ పార్వతీ కల్యాణం పారాయణచేయువారికి సకల శుభాలు కలుగుతాయి.

Tags: శివుడిని, శ్రీ పార్వతీ కల్యాణం, Shiva Puja, shiva pooja mantras, shiva puja benefits, Lord Shiva, Siva Family, Shiva Stotram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS