Drop Down Menus

శివుడు అర్థమైతే సత్యం బోధపడుతుంది - If Shiva is understood then truth will be taught

శివుడు అర్థమైతే సత్యం బోధపడుతుంది.

గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనందమూర్తి. ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.

'ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ - చిన్న గానీ - సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు - అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే!

1. జ్యోతిర్లింగాలు: శివుడిని 12 జ్యోతిర్లింగ రూపాలలో వున్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగ అంటే చీకటిని (అజ్ఞానాన్ని) చీల్చి వెలుగు…(జ్ఞానాన్ని) ప్రసాదించేది.

2.లింగాకారం: శివ లింగం పైకి లింగం కింద పానవట్టం యోని రూపంలో వుంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు.అవినాభావ సంబంధం.

3. ప్రళయం: శివుడ్ని ప్రళయ కారకుడుగా నమ్ముతారు. ప్రళయ కారకుడని తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? శివుడు మూడు ప్రళయములకు కారణం. ఒకటి రాత్రి నిద్ర. అన్ని ప్రాపంచిక మాయల నుండి మరపు నిచ్చేది. రెండు శారీరక మరణం. స్థూల (అంగ శరీరం) , సూక్ష్మ (మనసు), కారణ (అజ్ఞానం) శరీరాలనుంచి విముక్తి కలుగచేసేది. మూడు : మహాప్రళయం : సమస్తం శివునిలో కలిసిపోవడం. అంతరార్ధం: ఈ మూడు శరీరాలు మాయకల్పితం, అశాశ్వతం కావటం వలన, శివుడు వాటినుంచి విముక్తి కల్పించడం.

4. శివ, విష్ణు, బ్రహ్మ: శివుడి నించి విష్ణువు, విష్ణువు నించి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయటం అనేవి లోకోక్తి. అంతరార్ధం : సృష్టి, స్థితి,లయ ఒకచోట నుంచి రావటం, మరలా అందులోకి పోవటం.

5. మరణం ఒక వేడుక: వారణాసిలో ఘాట్లను చూస్తే, ప్రపంచంలో అదొక్కటే స్థలంలో జీవిత చక్రంలోని అన్ని దశలు : జన్మ , పెరగటం, మరణం అన్నీ నది ఒక చివరనుంచి ఇంకో చివరలోపు కనిపిస్తాయి. ఉజ్జయిన్ లో శివునికి జరిగే భస్మ హరతికి…. ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటాడు.

6. పంచభూత లింగాలు: దక్షిణ భారతంలోనున్న పంచ భూత లింగాలు ( అగ్ని, వాయు, భూమి, ఆకాశం, జలం ) ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువులలో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కాని దింకేమైనా ఉందా ?

7. శక్తి సూత్రం: శక్తి ఒక రూపంనుంచి ఇంకో రూపానికి మారవచ్చు కానీ శక్తి తయారు కాబడదు. నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలం లోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం.

8. రుద్రం : శివుని పూజించే పద్దతులలో రుద్రం మొదటిది. రుద్రం లో ఏం వుంది ? మహాన్యాసం, నమకం ,చమకం. మహాన్యాసం అంటే: చేసేది శివుడే , నీవు శివుడవేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరవాతే మిగతావన్నీ. చమకమ్ లో ఏం వుంది? సమస్తమూ శివమే - దొంగ, నురుగు, జీవులు అంతా ( అద్వైతం )

9. శివుని ధ్యానముద్ర: నీ నిజస్థితి తెలుసుకోవటానికి సాధనం - శ్రవణ, మనన, నిధి, ధ్యాసాలు (ధ్యానం) .

10. అద్వైతం: అద్వైతం తెలిపిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్చికమా ? జన్మ, స్థితి, మరణం - ఈ చక్రం మాయలో భాగం, అసత్యం. ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి, శివోహం, అహం బ్రహ్మాస్మి అనే తత్వ వాక్యాలు చెప్పే సత్యం ఇదే.

Tags: lord shiva, devotion, siva, om namasivaya

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.