Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గోధూళికా ముహూర్తము అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏమిటి? What is the time of Godhuli Muhurta?

గోధూళికా ముహూర్తము

సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోధూలికా ముహూర్తమని అనబడును.విపులంగా చెప్పాలి అని అంటే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి.

ఉదయాన్నే  ఊరి బయటకు మేత కొరకు పశువులను తోలుకుపోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు.

అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది. అలాంటి సమయమును గోధూలికా ముహూర్తముగా వివరించారు.

క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4.30 నిమిషముల నుండి సుమారు 6 గంటల వరకు ఈసమయము ఉండును. దీనినే గోధూలికా ముహూర్తము అని అంటారు.

ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించవచ్చును. వర్జ్యము దుర్ముహూర్తములతో పనిలేదు. హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.

దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్యఅని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం.

సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుడిని ప్రార్ధించాలి.

భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు.

కైలాసమందలి ప్రమథ గణములు, భూతకోటి శివ నామాన్ని ఉచ్ఛరిస్తూ శివ తాండవాన్ని వీక్షిస్తూ మైమరచి ఉంటారు.

ముప్పది మూడు కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణువులు సైతం మంగళ వాయిద్యాలను వాయిస్తూ ఆనంద తన్మయత్వంతో శివ నర్తనమునకు సహకరిస్తూ ఉంటారు.

సమస్తమగు ఋషిదైవ కోటి కైలాసంలో శివ తాండవ వీక్షణా నందజనిత తన్మయత్వంతో ఉన్న ఈ సమయంలో అసురశక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి.

అందుకే అసుర సంధ్యలో వేళ కాని వేళ ఆకలి నిద్ర బద్ధకం వంటివి బాధిస్తాయి. ఈ వికారాలకు లోనైతే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.

అలాగాక పరమేశ్వర ధ్యానంతో సంధ్యా సమయం గడపడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి..

Tags: Godhuli Muhurta, Godhuli, cow, Muhurtham, Evening

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు