Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

స్త్రీ ధరించే గాజుల మహత్యం.. | Importance of glasses worn by women

స్త్రీ ధరించే గాజుల మహత్యం..

ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా.. ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది.

అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.

ఎంత పేదింటి అన్నయినా.. చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..గాజులేయించుకోమ్మా’ అంటాడు.

ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము పగలకుండా, మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.

గాజులు ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. గాజులు ఒక్క స్త్రీ కే కాదు, పూర్వ కాలంలో పురుషులు కూడా ధరించేవారట. రాను, రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది.

స్త్రీ మంచి చీరకట్టుకొని , ఎన్ని నగలు మెడలో ధరించినా, చేతులకు గాజులు లేవంటే అందమనేది రాదు కదా ? గాజులు ధరించడం అనే సాంప్రదాయం, పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా ? ఎలా అంటారా ?    పుట్టిన బిడ్డలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు.

అది కేవలం దిష్టి కోసమే కాదు , ఆ గాజులనుండి వచ్చే సవ్వడులు, పసిపిల్లలను పలకరించి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట.

గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట. ఎలా అంటే గాజులు ఎంత సున్నితం గా ఉంటాయో, గాజులు ధరించిన స్త్రీ అవి పగల కుండా సున్నితం గా నడుస్తుంది , అలాంటి నడకవలన , నడవడిక మారుతుందట.

అంతే కాదు జీవితం చాలా సున్నితమైనది, జాగ్రత్తగా, పదిలంగా చూసుకోకపోతే గాజుపగిలితే ఎలా అతకదో, అలానే జీవితం కూడా సక్రమంగా ఉండదు అని అర్దమట.

చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్ష్యాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట.

గాజులు అందంతో పాటుగా స్త్రీ సౌభాగ్యం ప్రతిబింబిస్తుంది. అందుకే గాజులు పగులకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

శ్రీమంతం లో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు.. అనే దానికి మరో అద్బుతమయిన కారణాలు ఉన్నాయి.

అయిదవ నెలలో స్త్రీ గర్భం లో వుండే పిండానికి ప్రాణం వస్తుంది, శిశువు ఎంత సున్నితంగా వుంటుందో, తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, గాజుల రూపం లో (గాజులు సున్నితమైనవే కదా ) తెలిజేస్తారట. మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతం లో వుండే నాడులు గర్బాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయట. స్వల్ప వత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమయి, గర్బం లోని కండరాలు సరిగా పనిచేసే దానికి దోహదపడుతాయట.

అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్బం లో వుండే శిశువు కు గాజుల సవ్వడి స్పష్టం గా వినబడి , శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయి.

Tags: స్త్రీలు, గాజులు, Stree, Ladies, bangles, Gajulu, Women's bangles

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు