Drop Down Menus

గొప్ప ధనవంతులు కావాలనే కోరిక గలవారు ఇలా చేయాలి - Chandra Puja | Moon Pooja

చంద్రునికి నైవేద్యం - ధనలాభం

గొప్ప ధనవంతులు కావాలనే కోరిక గలవారు అష్టమి నుండి పౌర్ణమి దాకా ప్రతిరోజు రాత్రి పెరుగు అన్నం చంద్రునికి నైవేద్యంగా పెట్టాలి. వీలైనంతవరకు అరటిఆకులో పెట్టాలి.

అది లభించకపోతే చిన్న వెండిగిన్నెలో పెట్టవచ్చు. కాని, అంత ప్రధాన విషయాలు కావు. ముఖ్యమైంది వస్త్రదానం. ఈ తొమ్మిది రోజుల్లో ఒక పేదవానికి వస్త్రదానం చేయాలి. అది అతను ధరించడానికి పనికొచ్చేట్టు పెద్దదిగా ఉండాలి. అలా వీలు కాకపోతే ఒక తువ్వాలు లేదా ఉత్తరీయం లేదా నీలం రంగు రుమాలు దానం చేయాలి.

పౌర్ణమి రోజున మహానైవేద్యం చంద్రునికి పళ్ళెంలో పెట్టి, దానిని స్వయంగా భుజించాలి. ఎంత నైవేద్యం పెట్టారో అది మాత్రమే తినాలి. ఇతర పదార్థాలు తీసుకోకూడదు. ఈ ప్రయోగం ఒక్కసారే చేయాలి.

చంద్రుడు ప్రారబ్ధానికి దేవత. ఆయనకి నైవేద్యం పెట్టడం చేత సంతృప్తి చెందుతాడు. భక్తునికి హఠాత్తుగా ధనలాభం కలిగిస్తాడు. నైవేద్యం పెట్టేటప్పుడు స్వచ్ఛమైన నేతిదీపం వెలిగించాలి. కిటికీ నుండి లేదా ఇంటి పైకప్పు పైకి వెళ్ళి చంద్రుణ్ణి చూసి, నైవేద్యం సమర్పించాలి.

ఇది సులభమైన, అద్భుత ప్రయోగం. చంద్రుని కళలు వృద్ధి చెందినట్లే సంపద వృద్ధి చెందుతుంది. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వర్తించక ఇంట్లో కూర్చొన్నా ధనప్రాప్తి కలుగుతుందని తలచకూడదు. సాధకుడు చేసే వృత్తి లేదా పరిశ్రమలోనే అధికంగా ఆదాయం కలిసొస్తుంది.

Tags: చంద్రుడు, Chandra Puja, Moon Pooja, Moon Pooja Telugu, Moon Pooja and Mantra, Importance of Moon Puja, Benefits Moon pooja, Chandrudu, Purnima

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.