Drop Down Menus

భగవద్గీత లోని ఒక్క శ్లోకం మనం పాటించగలిగితే మన జీవితం సాఫీగా జరిగిపోతుంది. Life Changing Learning Facts of Bhagavad gita

భగవద్గీత లోని ఒక్క శ్లోకం మనం పాటించగలిగితే  మన జీవితం సాఫీగా జరిగిపోతుంది.

" అనన్యాశ్చింత ఎంతో మాం

ఏజనాః పర్యుపాసతే.

తేషాం నిత్యా భి యుక్తానామ్

యోగ క్షేమం వహామ్యాహం"

ఎవరైతే సర్వకాల సర్వావస్థల యందు వేరే చింతలు ఏమీ లేకుండా నన్ను స్మరిస్తాడో వాని యోగ క్షేమాలు నేను వహిస్తున్నాను.

ఎప్పుడైతే మనం భగవంతుడితో అనుసంధానం అవుతామో మన విషయాలు ఆయనే చూసుకుంటాడు.

భగవంతుడితో అనుసంధానం ఎట్లా అవ్వాలి, మనం బయటకు వెళ్ళేటప్పుడు అమ్మా వెళ్ళొస్తా, నాన్న వెళ్ళొస్తా అని ఇంట్లో చెబుతాం. అప్పుడు అమ్మ ఏమంటుంది నాన్నా జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది, అదే నాన్న ఒరేయ్ రోడ్డు మీద వాహనాలు వస్తుంటాయి చూసుకుని జాగ్రత్తగా వెళ్ళిరా అంటాడు. అట్లాగే మనం ప్రతి విషయాన్ని భగవంతునికి చెప్పుకుని బయటకు రావాలి.

ఆ పని పూర్తి అయ్యాక భగవంతునికి ధన్యవాదములు చెప్పాలి. అందులో తప్పు లేదు. ఎవరైనా చిన్న సహాయం చేస్తేనే thank you very much, so kind of you, I can't forget you అని ఇన్ని మాటలు చెబుతామే అదే భగవంతునికి చెప్పాలి, తండ్రీ నీ దయతో ఈ పని పూర్తి చేయగలిగాను. ఒక వేళ పని కాలేదు అనుకోండి అది కూడా ఆయనకే చెప్పాలి, తండ్రీ ఈ పని త్వరగా పూర్తి అయ్యేటట్లు చెయ్యండి .. ఈ విధంగా భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకోవాలి.

అప్పుడు ఆయనే మనకు డైరెక్ట్ చేస్తాడు ఏవి మంచి పనులు, ఏవి చెయ్యకూడని పనులు అనేది మన అంతరాత్మ ద్వారా తెలియ పరుస్తాడు. ఏదైనా ఒక చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు అంతరాత్మ తప్పకుండా చెబుతుంది ఇది తప్పు అని. కానీ మనిషి పరిస్థితుల ప్రభావం వలన అంతరాత్మ గొంతు నొక్కి ఆ పని చేస్తాడు. దానికి ఫలితం అనుభవించాల్సిందే.

" న భుక్తం క్షీయతే కర్మ

కల్పకోటి శతైరపి

అవస్య మను భోక్తవ్యమ్

కృతం కర్మ శుభా శుభం"

మనం అనుభవించ వలసిన శుభ కర్మ ఫలితాలు గాని, అశుభ కర్మ ఫలితాలు గాని ఎన్ని కోట్ల కల్పాంతరాలు అయినా నశించవు, వాటిని అనుభవించ వలసినదే.

Tags: భగవద్గీత, Bhagavad Gita, Bhagavad Gita Slokas, Bhagavad Gita Telugu, Srimad Bhagavad Gita, Bhagavad gita Quotes, Bhagavad gita book, Bhagavad Gita Pdf

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.