యిండిగ ట్రావెల్స్ 2024 చార్ ధామ్ యాత్ర స్పెషల్ ప్యాకేజీ వివరాలు | Indiga Tours Chardham Yatra Special

Chardham Tours
హిందూ టెంపుల్స్ గైడ్ కు యిండిగ ట్రావెల్స్ ప్రొప్రయిటర్ యిండిగ రాజు గురుస్వామి గారు 2024 చార్ ధామ్ యాత్ర స్పెషల్ ప్యాకేజీ వివరాలు తెలియచేసారు, వారు తెలియచేసిన దాని ప్రకారం ఈ యాత్ర మే 27వ తేదీ 2024 న ప్రారంభం కాబోతుంది. ఈ యాత్ర 15 రోజుల్లో 17 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేసారు. ఈ యాత్ర ప్యాకేజీ గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. 

యాత్ర లో దర్శించే క్షేత్రాలు :

ఆగ్రా ( తాజ్ మహల్ ), హరిద్వార్ ( మానసాదేవి ఆలయం , చంఢీదేవి ఆలయం , గంగా హారతి , హర్ కి పౌరి ) ఋషికేష్ ( రామ్ జ్వాల, లక్ష్మణ్ జ్వాల,రమణ ముని ఆశ్రమం) యమునోత్రి (యమునా నది పుట్టిన ప్రదేశం ) ఉత్తర కాశీ ( విశ్వనాధ స్వామి ఆలయం ), గంగోత్రి ( గంగానది పుట్టిన ప్రదేశం), కేదార్నాద్ ( గౌరీ కుండ్ , కేదార్నాద్ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6వ క్షేత్రం ), బద్రీనాధ్ ( విష్ణుమూర్తి మొదట పాదం మోపిన స్థలం ), బ్రహ్మకపాలం ( పితృదేవతులకు పిండ ప్రదానం చేయు స్థలం , బ్రహ్మదేవుని 5వ శిరస్సు పడిన స్థలం )ధారీదేవి అమ్మవారి గుడి

టికెట్ ధర వీటితో కలిపి : 

విజయవాడ , విశాఖపట్టణం , హైదరాబాదు , వరంగల్ నుంచి ఆగ్రా వరకు రాను పోను రైలు లో పూర్తి బెర్త్ సౌకర్యం , ఆగ్రా నుంచి ఆగ్రా వరకు యాత్ర 27 సీట్లు గల పుష్ బ్యాక్ బస్సు లో ప్రయాణం . 

ఉదయం కాఫీ , టిఫిన్ , మధ్యాహ్నం శాఖాహార భోజనం , రాత్రికి టిఫిన్ , రూమ్ అద్దెలతో సహా 

👉స్లీపర్ క్లాస్ టికెట్ ఒక్కరికి 35000/-

👉3rd A/C టికెట్ ఒక్కరికి 38000/-

ఈ ఖర్చులు మీవే : 

  • బస్సు వెళ్ళనిచోట అక్కడక్కడ అయ్యే ఆటో చార్జీలు మరియు ప్రవేశ రుసుములు యాత్రికులే భరించవలెను . 
  • కేదార్నాథ్ , యమునోత్రి యాత్రకు అయ్యే గుఱ్ఱం లేక డోలీ ఛార్జీలు యాత్రికులే భరించవలెను . 
  • కేదార్నాథ్ యాత్రకు హెలికాఫ్టర్ టికెట్స్ కావాల్సినవారు ముందుగా మేనేజ్ మెంట్ వారితో సంప్రదించవలెను . 

గమనిక : 

ఈ యాత్ర యందు ఆగ్రా , హరిద్వార్ , హృషికేష్ నందు ముగ్గురికి కలిపి ఒక రూమ్ కేటాయించబడును . చార్ధామ్ యాత్ర నందు పూర్తీ బెడ్ సదుపాయం గల డార్మిటరీ నందు రూమ్ కేటాయించబడును . యాత్ర పూర్తీ అయ్యాక డ్రైవర్ కు వంట మేస్త్రికి కలిపి 600/- లు మాములు ఇవ్వవలెను. 

అడ్వాన్సు : యాత్రకు వచ్చే వారు ముందు గా 10,000 రూపాయలు ఇచ్చి మీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకోగలరు 

ఫోన్ నెంబర్ లు : 9440328768, 9392328768

ఆపీసు : కుమ్మరరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు -5. 

keywords : Chardham Tour Package , indiga tours chardham tour package details, 2024 chardham packages,   

Comments