Drop Down Menus

తిరుమలలో క్యూలైన్ లో ఉన్నప్పుడు స్త్రీలకు నెలసరి వస్తే ఎలా..? దర్శనం చేసుకోవచ్చా? Tirumala Tirupati Devasthanams

తిరుమలలో క్యూలైన్ లో ఉన్నప్పుడు స్త్రీలకు నెలసరి వస్తే ఎలా..? దర్శనం చేసుకోవచ్చా?

కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల, తిరుపతి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు.

ఇక్కడ శ్రీవారిని దర్శించుకునేందుకు  చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేలాదిగా అక్కడికి తరలి వస్తుంటారు.

అయితే ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామివారి దర్శనానికి ఒక్కసారి 24 గంటల నుండి 48 గంటల వరకు సమయం పడుతూ ఉంటుంది.అయితే ఆ విధంగా క్యూ లైన్ లో వేచి చూస్తున్న సమయంలో స్త్రీలకు నెలసరి వస్తే ఏం చేయాలి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది.తిరుపతిలో మాత్రమే కాకుండా సాధారణంగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నెలసరి వస్తే ఏం చేయాలి? అన్నది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది.అయితే సాధారణంగా ఇంటిలో అంటుముట్టు అంటూ నెలసరి సమయంలో పూజా కార్యక్రమాలకు మహిళలు దూరంగా ఉంటారు.

అలాగే స్త్రీలు వెలుపల ఉన్న సమయంలో గుడికి వెళ్లకూడదు, దీపం పెట్టకూడదు, ముట్టుకోకూడదు అంటూ చెబుతూ ఉంటారు మన పెద్దలు.

అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో దేవాలయాల్లోకి వెళ్లడానికి కూడా చాలామంది అపవిత్రమని భావిస్తూ ఉంటారు.కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా వెళ్లకూడదని చెబుతూ ఉంటారు.కానీ అదే గుడిలో ఉన్న సమయంలో కనుక నెలసరి వస్తే ఏం చేయాలి? దాని వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.నెలసరి అనేది ప్రతి స్త్రీకి సాధారణంగా వచ్చేదే.

అయితే గుడిలో పీరియడ్స్ రావడం వలన ఎటువంటి దోషాలు కలగవని చెబుతున్నారు.

దేవాలయాల్లో ఉన్న సమయంలో కనుక స్త్రీలకు పీరియడ్స్ వస్తే వెంటనే లోపల నుండి బయటకు వచ్చేయాలి.అలాగే దర్శనానికి వెళ్లకుండా, వెళ్లే వారిని ముట్టుకోకుండా వచ్చేయడమే సరైన మార్గం.అంతేకానీ దేవాలయంలో ఇలా జరిగింది ఏంటి అని బాధపడాల్సిన అవసరం లేదు.

గుడిలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చాయి.ఇది పాపం, దోషం అనిపించడంతో ఏమైనా చెడు జరుగుతుంది ఏమోననే ఆలోచన కూడా అవసరం లేదు.

ఎందుకంటే నెలసరి అనేది ప్రతి స్త్రీకి సాధారణమైన విషయమని చెబుతున్నారు.

Click hereతిరుమల సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags: తిరుమల, Tirumala, Tirumala News, TTD, Tirupati, Women, Stree, Periods, Tirumala Darshnam, Srivari Mettu, Alipiri

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.