వారాహి అమ్మవారి 9 రోజుల అలంకారాలు పూజ విధానం & శ్లోకాలు - Varahi Navaratri 2024: Significance and Dates

ఈసారి వారాహీ నవరాత్రులు.. ఆషాడ మాస ప్రారంభం నుండి అనగా... జులై 6 శనివారం 2024న ప్రారంభమై జులై 15 సోమవారం 2024న ముగుస్తాయి

ఆషాడ మాస పాడ్యమి నుంచి నవమి వరకూ వచ్చే నవరాత్రులను  "శ్రీ వారాహీ నవరాత్రులు" అని పిలుస్తారు. శ్రీ లలితా దేవి యొక్క దండనాయిక (సేనానాయిక) శ్రీ వారాహీ మాత.

ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్దరింపబడతారని శాస్త్ర వచనం.

ఆషాడ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి.

ఆమె  భూదేవికి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం.

లలితా దేవి యొక్క దండిని రూపం వారాహి మాత.

ఈమె అన్యాయాన్ని ఎదిరించి, చెడును శిక్షించి ఆశ్రితులకు రక్షణ ఇచ్చే దేవత.

ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు.

శత్రు సంహారం జరుగుతుంది.

రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడిపంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. 

ఈ తల్లి మంత్రం సిద్దిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది.

వారాహి దేవత మాతృకా దేవత. సముద్రపు లోతులలో దాచి పెట్ట బడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్ళతో పెకలించి పారేయగలదు.

ఈ తల్లిని  రాత్రివేళల్లో పూజించాలి 

శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి దేవత వరాహుని స్త్రీతత్వం.

వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో..

శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది.

వారణాసి లో ఉన్న ఈమె ఆలయానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈమే వారణాశికి గ్రామదేవత కూడా.  

లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ, తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం.

ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.

బౌద్ధ మతం వారు   వజ్ర వారాహి ..   

మాతగా  పూజిస్తారు   .. 

ఈమె  ఉత్తర దిక్కుకు  అధిదేవత   ..  

ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది. నాగలి  భూమిని  దున్నిసేద్యానికి  సంకేతం ఈ తల్లి.

రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం.

ఇది బాహ్యార్ధం. అంతరార్థం ఏమిటంటే అహంకార స్వరూప  దండనాధ సంసేవితే బుద్ధి స్వరూప  మంత్రిణ్యు పసేవితే .

ప్రతీ మనిషిలోనూ వారాహీ శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. క్రియా శక్తి వారాహి దేవి. 

ఆషాఢ   పాడ్యమి నుంచి ఈ  వారాహీ నవరాత్రులలో వారాహీ దేవిని కొలుస్తుంటారు.  పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా, ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని అన్న ఈ పదకొండు నామాలు చదువుకున్నా చాలు ఈ తొమ్మిది రోజులు. 

లేదా 

“కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా 

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా 

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా 

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |” అన్న లలితా నామాలలో కాని, అమ్మవారి స్తోత్రం చేస్తే ఫలితాలు ఉంటాయి. 

అందరూ ఆ జగదంబను వారాహీ రూపములో సేవించి ఉత్తమఫలితాలు పొందటానికి అనువైన ఈ కాలమును అమ్మను సేవించి అనుగ్రహము పొందవచ్చును.

Click Here: వారాహీ అమ్మవారి 9 రోజుల పూజ విధానం

Tags: వారాహీ, Varahi Navaratri 2024, Varahi Navaratri, Ashadha Varahi Navratri, Varahi Navaratri Dates 2024 , Varahi Navratri 2024 telugu, Varahi Navratri benefits, Varahi navaratri pooja vidhanam in telugu, Varahi Navratri 2024 date and time

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS