Drop Down Menus

ఈ వైకుంఠ_దేవాలయం_సందర్శిస్తే_మన_తల_రాత_తిరిగి_మార్చే_బ్రహ్మ - Thirunelli Temple Wayanad Timings, History, Information Telugu

వైకుంఠ_దేవాలయం_సందర్శిస్తే_మన_తల_రాత_తిరిగి_మార్చే_బ్రహ్మ.

కేరళలోని తిరునెల్లి దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణువు. ఈ తిరునెల్లి దేవాలయాన్ని స్వయంగా బ్రహ్మ దేవుడు కట్టించాడని చెబుతారు. అంతే కాకుండా ఈ తిరునెల్లి దేవాలయం నుంచి నేరుగా వైకుంఠానికి వెళ్లడానికి దారి ఉందని చెబుతారు.

ఇక్కడకు ప్రతి రోజు బ్రహ్మ విష్ణువును పూజించడానికి వస్తాడని ఇందుకు తగిన ఆధారాలు కూడా పూజారులు చూపిస్తారు. అందువల్లే ఈ దేవాలయం సందర్శిస్తే మన తల రాత రాసే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే బ్రహ్మమారుస్తాడని చెబుతారు. ఈ దేవాలయంలో నారాయణ బలి పూజలు చేయడానికి విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. చుట్టూ కొండ కోనల మధ్య ఉన్న ఈ దేవాలయం సముద్ర మట్టానికి దాదాపు 3వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.తిరునెల్లి దేవాలయం కేరళలోని వయనాడ్ జిల్లాలో వయనాడ్ వ్యాలీలో ఉందిఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణు భగవానుడు.

ఈ దేవాలయం చుట్టూ పరిసరాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ దేవాలయం ద్వారా వైకుంఠాన్ని చేరుకోవచ్చని చెబుతారు.సృష్టి కర్త బ్రహ్మ ఒక రోజు తన వాహనమైన హంసపై లోక సంచారం బయలుదేరాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళలోని బ్రహ్మగిరులు ఉన్న ప్రాంతం పై విహరిస్తుండగా అక్కడి ప్రకృతికి ముగ్దుడై పోయాడు.పచ్చటి చెట్లు, లోతైన నదీలోయలు, జలజల పారే సెలయేళ్లు వంటి వాటిని చూస్తూ చాలా సేపు మైమరిచి పోయాడు. ఈ క్రమంలో ఒక ఉసిరి చెట్టు కింద ఒక విష్ణువు విగ్రహం కనబడింది.

దాని చుట్టూ ఒక విచిత్రమైన వెలుగును చూసాడు. అంతే కాకుండా ఆ విష్ణువు విగ్రహం చుట్టూ జింకలు, కుందేళ్లు వంటి సాదు జంతువులే కాకుండా పులులు, సింహాలు వంటి క్రూర మృగాలు కూడా జాతి వైర్యం మరిచి ఒక దానితో ఒకటి ఆటలాడుకోవడం కనిపించింది.దీంతో కిందికి దిగిన బ్రహ్మకు మరింత ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. చుట్టు పక్కల ఉన్న జలపాతాలు, సెలయేరుల నుంచి ఒక రకమైన సుగంధ పరిమళాలు వీచాయి.ఇక దేవగణాలు అన్నీ అక్కడే ఉన్నట్లు తోచింది. 

దీంతో బ్రహ్మ ఇహలోకంలో ఉండే వైకుంఠమే భూలోకంలో ఉన్నట్లనిపించింది. దీంతో దేవతలను, యక్షులను తనకు తోడుగా తీసుకువచ్చి అప్పటికప్పుడు అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మింపజేసాడు.అటు పై ఉసిరి చెట్టు కాండంలో కనిపించిన విష్ణువు విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాడు. అంతే కాకుండా చుట్టూ ఉన్న సరస్సులు, తీర్థాల్లో ముఖ్యంగా గుడి ముందు భాగంలో ఉన్న పంచతీర్థంలో స్నానం చేస్తారు.

తిరునెల్లికి ఎలా చేరుకోవాలి?

దట్టమైన అడవులు, ఏనుగుల అభయారణ్యం మరియు వెదురు అడవుల గుండా వెళుతున్న మనంతవాడి నుండి తిరునెల్లికి డ్రైవ్ చేయడం ఒక అనుభూతిని కలిగిస్తుంది. మైళ్ల కొద్దీ వరి పొలాలు తప్ప నివాసం ఉండే సూచనలు కనిపించవు.

మైసూరు రహదారిలో మనంతవాడి నుండి తిరునెల్లికి డ్రైవ్ చేసి, కట్టికులం నుండి మలుపు తీసుకుని తిరునెల్లి అనే చిన్న కుగ్రామానికి చేరుకోండి. ఈ గ్రామం కేరళ - కర్ణాటక సరిహద్దులో ఉన్నందున, కర్నాటకలోని కుట్ట నుండి కూడా సులభంగా చేరుకోవచ్చు.

Thirunelli Temple Wayanad Timings

5:30 am – 12:00 pm

5:30 pm – 8:00 pm

Thirunelli Temple Wayanad Address:

North Wayanad, Thirunelly Road, Thirunelly,

Kerala, 670646, India

Thirunelli Temple Wayanad Phone

04935 210 201

Tags: తిరునెల్లి దేవాలయం, Thirunelli temple, Kerala, Thirunelly, Thirunelli Temple Wayanad, Thirunelli temple, Thirunelli Temple timings, Thirunelli temple history, Thirunelli temple photos, Thirunelli temple online Booking

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments