Varanasi Local Temples Information in Telugu
మనం కాశిలో అడుగుపెట్టిన తరువాత ముందుగా ఒక రూం కావాలి :) నేను ఇంతకముందే ఒక పోస్ట్ చేశాను . క్రింద ఆ లింక్ కూడా ఇస్తాను మీరు చూడండి . రూమ్స్ కోసం ఇబ్బంది పడనావసరం లేదు .
వారణాసి లో ఆశ్రమాలు సత్రాలు మఠాలు హోటల్స్ నెంబర్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
వారణాసిలో తమిళనాడు లో ఉన్నట్టు ఆకాశాన్ని తాకేలా గోపురాలు ఉండవు .ఆది భిక్షువు అని కాబోలు ఆయనే చిన్న గుడిలో ఉన్నాడు . తంజావూరు లో ఉన్నట్టు పెద్ద శివలింగము ఉండదు ఇక్కడ .
మనం గుడిలోపలకి అడుగుపెడుతున్నాం అనగా సెక్యురిటి వారు చెక్ చేసి లోపాలకి పంపుతూ ఉండగానే మన గుండెలు బరువైతాయి . ఎప్పుడు ఎరుగని ఆఅనుభూతి ఎవరికీ చెప్పలేము .. కాళ్ళు వనుకుతున్నాట్టు .. కళ్ళు రెండు ఎక్కడ నా స్వామి ఎక్కడ నిజామా నేనే నా విశ్వనాధున్ని చూస్తున్నానా అని కళ్ళు వెతుకుతుంటే .. నిజమే ఇది నిజమే . స్వామి దగ్గరకు వెళ్లి మనం ఆశ్చర్యకంగా కళ్ళు రెండు పెద్దవి చేస్తూ చూస్తూ ... మనం తెచ్చుకున్న పాలను గంగను స్వామి వారికి అభిషేకం చేస్తుంటే .. స్వామి ఇక చాలు ఈ జన్మకి ఇక చాలు . ఇంతకన్నా నాకేమి కావాలి . నీ దర్శనం చెయ్యగలిగాను .. నేను చెయ్యడం ఏమిటి ఆ భాగ్యం కలిగించావు అనుకుంటూ స్వామి దర్శనం చేస్కుంటూ బయటకొచ్చకా ..
పార్వతి అమ్మవారు కాశి అన్నపూర్ణ దేవి దర్శనం ఇస్తారు . ఐతే కాశి విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి వేరేగా గుళ్ళూన్నాయి . అన్నపూర్ణాదేవి కి వేరుగా స్వామి వారి ఆలయం కంటే ముందుగా ఆలయం ఉంది ( గేట్ ఒకటి నుంచి వచ్చేవాళ్ళకి ) , అవును స్వామి వారి దర్శనానికి 4 గేట్లు ( దారులు ) ఉంటాయి .
మొదటి సారి వెళ్ళేవారు ఎన్నో నెంబర్ గెట్ దగ్గర నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోండి . నిజానికి స్వామి వారి ఆలయ ప్రవేశానికి టికెట్స్ ఏమి లేవు . మనం దర్శనానికి లైన్ లో నిలబడతాం కదా ..
అక్కడ వీధులు చాల ఇరుకైనవి ముగ్గురు పక్కపక్కన నిలబడితే మరో మనిషి వెళ్ళడానికి దారి ఉండదు . ఆలయం లోపాలకి చెప్పులు , కొబ్బరికాయలు , పెన్నులు , సెల్ ఫోన్ లు , కెమెరాలు తీస్కుని వెళ్ళనివ్వరు. దర్శనానికి లైన్ లో నిలబడి ఉండగా ..పక్కనున్న షాప్ ల వాళ్ళు మీ సామాన్లు మా దగ్గర ఫ్రీ గా బద్రపరుచుకోండి అని సామన్లకు ఫ్రీ కాని మీ చేతిలో ఒక స్వీట్ బాక్స్, పాలు, రెండు దండలు పెట్టి వేల్లమంటారు ..
నాకొద్దు అంటే మీ సామాన్లు తీస్కుని వెళ్ళమని చెప్తారు .. ఇంతకీ మీ చేతిలో పెట్టిన వాటి ఖరీదు 170/- . హా అంతే . సరే అని తీస్కుని వెళ్ళాలి తక్కువలో ఇవ్వమంటే ఓ 70 - 90 /- మద్యలో చేతిలో పెడతారు .సామాన్లు భద్రంగానే ఉంటాయి .. లేకపోయినా మన గోడు పట్టించుకునే వాడే ఉండడు .
ఇక్కడ కూడా దర్శనానికి చాల పెద్ద లైన్ ఉంది నాతో రండి 20 నిమిషాల్లో దర్శనం చేయిస్తాను 150 ఒక్కో తలకి అని బేరమడేవాళ్ళు ఉంటారు . అదేమిటో దేవాలయం లోపల కూడా వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ ( పాలు , పువ్వులు అమ్మడం ) మనకి కొత్తగా కనిపిస్తాయి . ఇవన్ని ఎందుకు చెప్తున్నాను అంటే .. మీకు అన్ని తెలియాలి గనుక .. ఇవన్ని అందరు రాయరుగా .
దర్శనాలతో పాటు హారతి టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు . ప్రధానం గా నాలుగురకాల హారతులు ఉంటాయి.
> తెల్లవారు జామున ఇచ్చే మంగళ హారతి :
ఈ హారతి ప్రతి రోజు 3-4 మధ్యలో ఇస్తారు. టికెట్ తీసుకున్న వారిని ఆలయం లోకి 2:30-3 మధ్యలో పంపిస్తారు. టికెట్ ధర 500/-.
> మధ్యాహ్నం ఇచ్చే భోగ హారతి :
ఈ హారతి ప్రతి రోజు ఉంటుంది. 11:15 AM -12:20 మధ్యలో ఇస్తారు టికెట్ తీసుకున్న వారు 10:45 కు లైన్ లో ఉండాలి. టికెట్ ధర 300/-.
> సప్తఋషి హారతి :
ఈ హారతి ప్రతి రోజు 7-8:15 మధ్యలో ఇస్తారు. టికెట్ తీసుకున్నవారు 6:30 కు లైన్ లో ఉండాలి. టికెట్ ధర 300/-.
> శృంగార హారతి
ఈ హారతి ప్రతి రోజు 9 -10 మధ్యలో ఇస్తారు. టికెట్ తీసుకున్నవారు 8:30 కు లైన్ లో ఉండాలి. టికెట్ ధర 300.
>> 12 సంవత్సరాల లోపు వారికి టికెట్ అవసరం లేదు.
తిరుమలలో 300/- స్పెషల్ దర్శనం ల ఇక్కడ కూడా ఉన్నాయి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. పర్వదినాల్లో తప్పించి మిగిలిన రోజుల్లో దర్శనం 3 గంటల లోపే అవుతుంది.
టికెట్ బుకింగ్ వెబ్సైటు : https://shrikashivishwanath.org/
కాశి లో నడిచి వెళ్లి చూడవలసినవి :
విశ్వనాధ గుడి , అన్నపూర్ణ దేవి గుడి ,విశాలాక్షి అమ్మవారి గుడి, కోటి లింగం ( జంగంవాడి ),సాక్షి వినాయక, దండపాణి గుడి, కేదారేశ్వర గుడి, హరిశ్చంద్ర ఘాట్ ,దశాశ్వమేద ఘాట్ , మణికర్ణిక ఘాట్
అక్కడ తెలుగు తెల్సిన బ్రాహ్మణులు ఉన్నారు. మాక్కూడా ఒక తెలుగు బ్రాహ్మణుడు మమల్ని పలకరించారు.. అప్పుడు మేము అన్నపూర్ణాదేవి ఆలయం లో ఉన్నాం. మీకు చుట్టుప్రక్కల దేవాలయాలు చూపిస్తాం ఒక్కొక్కరికి 50/- అవుతుంది అన్నారు. మేము సరే అన్నాం.. "ఇంతకుముందే తెల్సిన పెద్దలు చెప్పారు అక్కడ మిమ్మల్ని ధానం చెయ్యండనో.. మీ పేరున పూజలు చేస్తాం అనో .. లేదా రెండు నాణేలు ఇచ్చి ఇంటికి తీస్కుని వెళ్లండనో డబ్బులు కాజేస్తారు అని జాగ్రత్తలు చెప్పారు. "
మేము ఆ బ్రాహ్మణుని అనుసరించాం ఆయన ఒక్కోక్క ఆలయానికి తీస్కుని వెళ్తున్నారు.. అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి... ఆయన మాతో పాటు వచ్చి ప్రతిచోటా ఆయా దేవుళ్లకు సంబందించిన మంత్రాలు చెప్పించారు. నిజానికి ఆయన లేకపోతే దగ్గరే ఉన్న అన్ని చూడకపోదుమేమో. ఇంతక ముందు పెద్దాయన చెప్పినట్టు ఈయన కూడా మమ్మల్ని పైన చెప్పిన విధంగా ప్రతిదేవాలయం లోను అది తీస్కోండి.. ఇది తీస్కోండి అంటూనే ఉండేవారు. మాకు అన్ని దేవాలయాలు చూపించి కాశి అన్నపూర్ణాదేవి సత్రం దగ్గర వదిలిపెట్టడంతో అన్నపూర్ణ దేవి సత్రం లో భోజనం చేయగలిగాము.. నిజంగా అన్నపూర్ణాదేవి వడ్డిస్తున్నట్టు అక్కడివారు చాలాబాగా వడ్డించారు. మీరు తప్పకుండా అన్నపూర్ణాదేవి సత్రం లో భోజనం చెయ్యండి.
మీరు కొత్తగా వెళ్తే కనుక పై జాగ్రత్తలు పాటించండి.
కాశి లో వాహనాలు పై వెళ్లి చూడవలసినవి :
సంకట మోచన్ హనుమాన్ గుడి, తులసీ మానస గుడి, దుర్గ గుడి , గవ్వలమ్మ గుడి ,సారనాధ,వ్యాస కాశీ, కాలభైరవ మందిరం, బిర్లమందిరం.
మీరు దిగిన రూమ్స్ దగ్గర్లోనే లోకల్ టెంపుల్స్ చూపించడానికి ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు. వారిని సంప్రదించి లోకల్ టెంపుల్స్ చూసిరండి.
అసలైన విషయం కాశి లో ఇప్పుడు ప్రత్యేకంగా స్పర్శదర్శనం సమయం పెట్టారు తెల్లవారు జామున 3 గంటలకు ఆలయం దగ్గర ఉండండి . 3-4 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది అదేవిధంగా సాయంత్రం కూడా ఉంటుంది.
కాస్త దూరంగా ఉన్న ప్రసిద్ధ ఆలయాలకోసం రాసిఉన్నాను. మీరు ఆ పోస్ట్ కూడా చదివితే కాశి లో ఎన్నిరోజులుండాలి అనే దానిపై మీకు అవగాహన వస్తుంది. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Place to See by Walk:
1.Kashi Visweswara Temple 2.Kashi Visalakshi Temple 3. Kashi Annapurna Temple 4. Sakshi Ganapathi Temple 5. Doondi Ganapati Temple 6. Jangambadi Temple 7. Kedareswara Temple 8. Tilabhandeswara Temple 9. Varahini Temple
Kashi Viswanadha Temple
Places to see by Vehicle Varanasi :
1. Kaala Bhairav Temple 2. Saranth ( Budh Temple ) 3. Vyasa Kashi ( Kashiraju Kota ) 4. Birla Temple 5. Santaka Vimochana Hanuman Temple 6. Tulasi Manasa Mandir 7. Durga Devi Temple 8. Gavalamma Temple
Click Here For :
Accommodation in Varanasi
Varanasi Yatra Video
Varanasi Local Temples
Varanasi Surrounding Temples
Accommodation in Varanasi
Varanasi Yatra Video
Varanasi Local Temples
Varanasi Surrounding Temples
varanasi tour information in telugu, kashi information, kasi information in telugu, kasi local temple details, kashi inforamtion ,


MANCHI VISHAYALU CHEPPARU, KOTTAGA VELLEVARIKI CHAALA OOPAYOGAM!
ReplyDeleteగొప్ప సైటు. ఇంతకాలం ఇది నా దృష్టిలో ఎందుకు పడలేదో ఆశ్చర్యంగా ఉంది. మొన్న కాశీకి వెళ్లే ముందు ఈ సైటును చూసి ఉంటే బాగుండేది. అభినందనలు.
ReplyDeleteNice post!!!
ReplyDeleteGANGA harathi chaala baagu untundi!!!
sit bagundi kani modatisari velley varikosham video post cheste baguntundi miru chepparu telugu bramanulu miku akkadi gudlu anni chupincharu ani ayana ekkada untaru ella kalusukovali chepandi ninu kashi velthunnanu cheppagalaru
ReplyDelete8183834567 naga chary
DeleteOur telugu person contact him
చాలా బాగా వివరించారు..
ReplyDeletecan we visit kasi in march? please advise.
ReplyDeleteNagachary
DeleteTelugu person
8183834567
Contact him
చాలా ఉపయోగకరమైనది ఈ సైట్
ReplyDeleteజాగ్రత్తల గురించి వ్రాసింది అక్షరాల నిజం. దోచుకుంటారు. ఇదేమి అని అడిగితే మీకు సపోర్ట్ చేసేవారు ఎవ్వరు ఉండరు. నేను చాలా సార్లు వెళ్లాను. మనమే స్వయంగా దర్శించుకుంటే మంచిది. గైడ్స్ జోలికి వెల్లద్దు.
ReplyDeleteVery interesting, good job and thanks for sharing such a good article. keep it up!
ReplyDeleteFor more details, Please visit our site: http://mandirmandir.com/
Jyotirling/Shakti Peeth/Nepal
ReplyDeleteYatra Package available
Call/whatsapp 9198595775
మీ కృషి కి ధన్యవాదములు ఇంకా కొత్త ఫ్యూచర్స్ ఆడ్ cheyandi
ReplyDeleteచాలా బాగా చెప్పారు
ReplyDeleteSaptha rushi harathi, Srungara harathi AM or PM mention cheyandi
ReplyDeleteVery good information for the first time visitors, Thank you very much Dear Sir
ReplyDeleteనమస్తే, ఈ ప్రశ్న ఇక్కడ అడగవచ్చో లేదో కానీ మరో వేదికలో ఎక్కడ సమాధానం చూడలేదు . అందుకే అడుగుతున్నాను.అన్యధా భావించకండి.స్థానికులు కానీ వారికి ఇక్కడ అంత్యక్రియలు జరుపుకొనిస్తారా,ఒకవేళ అవును ఐతే దానికి ఉండే ప్రక్రియ ఏమి ఉండొచ్చు.
ReplyDeleteరాజాచంద్రా గారు
ReplyDeleteచాలా బాగుంది
సంతోషం
Varanasi
ReplyDeleteChala bhaga chepparu sir, sir Meeku telisi taxi gani auto gani valla phone number unte pampagalaru sir thank you
ReplyDeleteKashilo single gaa velithe accommodation dorukuthundaa
ReplyDeleteమేము కాశీ కి ఈ సంవత్సరం మార్చి లో మరియు మే నెలల్లో వెళ్ళాం. ఒక సారి కాశీ నుండి గంగ నీళ్ళు తీసుకు వచ్చి రామేశ్వరం లో శివయ్యకు అభిషేకం చేసి అక్కడి నుండి ఇసుక తీసుకొని వెళ్లి మళ్ళీ కాశీ లో గంగ లో కలిపి సంపూర్ణ కాశీ యాత్ర చేశాం.
ReplyDeleteకాశీ లో మేము రెండు సార్లు మంగళ హారతి లో మరియు ఒక సారి సప్త ఋషి హారతి లో పాల్గొన్నాం. ఇవి ఒక నెల ముందు గానే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. మంగళ హారతి ఉదయం 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. స్పర్శ దర్శనం లభిస్తుంది. సప్త ఋషి హారతి సాయంత్రం 0645 PM నుండి 0815 PM వరకు ఉంటుంది. స్పర్శ దర్శనం ఉండదు. అయితే మంగళ హారతి కి టిక్కెట్లు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. జనం చాలా ఉంటుంది. మార్చి లో వెళ్ళినప్పుడు 30 మాత్రమే ఇచ్చారు. మే లో 90 ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఇస్తున్నట్లు ఉన్నారు. స్పర్శ దర్శనం కావాలి అంటే మంగళ హారతి బుక్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండాలి, స్వామి వారి కి దగ్గర లో ఉండి హారతి లో పాల్గొనాలి అంటే సప్త ఋషి హారతి బుక్ చేసుకోండి. కేవలం 5 టిక్కెట్ లు మాత్రమే ఆన్లైన్ లో విడుదల చేస్తారు. కాబట్టి జనం తక్కువ ఉంటారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారి తో పాటు ప్రోటోకాల్ ద్వారా టికెట్స్ పొందిన వారు కూడా ఉంటారు. రాత్రి sringara హారతి కూడా బుక్ చేసుకున్నాం కానీ వెళ్ళడం వీలు కాలేదు. హారతి timings.
0300AM to 0400 AM మంగళ హారతి.
1115 to 1220 Mid day Bhog Aarti
0645 PM to 0815 PM సప్త ఋషి హారతి
0900 PM to 1015 PM sringar/ Bhog Aarti
మంగళ హారతి టికెట్ లు నెల రోజుల ముందు అర్ధ రాత్రి 12 గంటలకు విడుదల చేస్తారు. మిగతా టికెట్స్ నెల రోజుల ముందు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టైమింగ్స్. మారవచ్చు. Website check చేసుకోండి.
Website. shrikashivishwanth.org
G SHANKAR GOUD
Hyderabad
నిజంగా చాలా బాగా వివరించారు...
ReplyDeleteమేము కాశీ వెళ్లొచ్చాను..
మీరు చెపుతుంటే ఆ రోజులు ఎందుకు వచ్చాయి...
నిజంగా దర్శనం సమయంలో అక్కడివారు ఎలా ప్రవర్తిస్తారు వారి గురించి చాలా ముఖ్యంగా వివరించారు...
ఇది నిజమే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే..