Kandrakota Nookalamma Talli Temple Information

Kandrakota Goddess Nookalamma Talli, East Godavari, Andhra Pradesh.పెద్దాపురం( Peddapuram ) మరిడమ్మ అమ్మవారి దర్శనం అయినతరువాత మీరు కాండ్రకోట ( Kandrakota ) నూకాలమ్మ అమ్మవారి దర్శనం చెయ్యండి. నూకాలమ్మ వారి ఆలయం  పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడ ల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు.....

వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. వూరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు) వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే .

 కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడట అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపం లో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతు ని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధం లో ఓడిపోయారట ! 


ఆతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మేరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట (అధికమయ్యాయి) ! ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తి ని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశ ల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి - వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట 

ఆ ఆది పరాశక్తి అంశే "నూకాలమ్మ అమ్మవారు" యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించినాడు - అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మ గా ... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా కొలువు తీరినారు . 

పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవం గా కన్నుల పండుగ గా జరిగే ఈ జాతరకి ఆంద్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు. 

జాతర సమయంలో గ్రామస్తుల తో పాటుగా శ్రీ గీతా శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు - చిన్నపిల్లలకు విశిష్ట సేవలు అందించడం అబినందనీయం. బచ్చు ఫౌండేషన్ వారు కాండ్రకోట గ్రామాన్ని గ్రామంలోని విద్యాలయాలను అభి వృద్ధిపరచిన తీరు బహు ప్రశంసనీయం.
Kandrakota Nookalamma Temple Timings :
Morning : 5 am to 12.30 pm
Evening : 4 pm to 8 pm

Kandrakota Nookalamma Talli Temple Surrounding Famous Temples:

Related Postings :
> Toli Tirupathi ( Chadalada Tirupati )


> Sarpavaram Bhavannarayana Swamy Temple

Content & Pics Credits : 
Vangalapudi Siva Shankar, Peddapuram

Kandrakota Goddess nookalamma talli temple is located in kandrakota. 7 km from peddapuram District of East Godavari State of Andra Pradesh. 
famous temples in east godavari, peddapuram surrounding temples, kandrakota, pithapuram, tirupati, divili, samarlakota temples, kandrakota temple address, hindu temples, best telugu website , Number one temple website in Telugu, Top devotional site in telugu, hindu temple details.  kandrakota nookalamma talli temple information in telugu, hindu temples guide.
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples