Peddapuram Maridamma Temple History in Telugu

2016 జాతర మహోత్సవములు
జాగరణ ఉత్సవం 03-7-2016 నుండి 09-08-2016 వరకు  
పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయం లో అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. నిలువెత్తు అమ్మవారు విగ్రహం చూస్తుంటే .. నిజంగా అమ్మవారే కూర్చుని దర్శనం ఇస్తున్నట్టు ఉంటుంది. మరిడమ్మ అమ్మవారు గ్రామ దేవత .. చాల శక్తి వంతమైన తల్లిగా ఇక్కడ పూజలు అందుకొంటింది . ఇక్కడ స్థలపురాణం ప్రకారం 17 వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి “ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవత గా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు. 


17 వ శతాబ్దములో ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడివి గా వుండేధి. ఒక సారి ఆ అడవులో పశువుల కాపరులకి “ 16 ఏళ్ల యువతి కనిపించి “ నేనుచింతపల్లి వారి ఆడపడుచుని . నేను ఈ ప్రదేశములో వున్నాను అని మా వాళ్ళకి చెప్పండి . “ అని చెప్పి అంతర్థానము అయ్యింది.ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లి వారికి జరిగింది అంతా చెప్పారు... ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ “ మానోజి “ చెరువు దగ్గరకి వొచ్చి చుట్టూ ప్రక్కల ప్రాంతములు వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతి రూపము దర్శనమిచింది . .. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప ధీప, నైవేధ్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు.

ప్రతీ సంవత్సరము ఆషాఢ మాసము లో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ఎంతో వైభవము గా 37 రోజుల పాటు జాతర జరుగును .రాష్ట్ర నలుమూలల నుండి మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు ఒక్క ఆది వారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం.


పూర్వం కలరా లాంటి భయంకర వ్యాధుల నుండి .. ఆ గ్రామ ప్రజలను రక్షించే అమ్మవారుగా ఎన్నో మహిమలు చూపించింది . పిలిస్తే పలికే ఈ అమ్మవారిని చుట్టుప్రక్కల గ్రామాల వారు కులదైవము గా ఆరాధిస్తారు

మరిడమ్మ జాతర జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లో ని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరుగుతుంది……


***ఉయ్యాల తాడి ***
=============

జేష్ఠ మాసం లోని అమావాస్య నుండి ప్రారంభ మై ఆషాడమాసం లో ని అమావాస్య వరకూ ముప్పై ఒక్క రోజులు జరిగే ఈ జాతరలో భాగంగా…… సరిగ్గా బహులైక జేష్ఠ అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మ వారికి ఉయ్యాల తాడిని వేస్తారు....

జాతర రోజు నుండి జాతర ముగిసే వరకూ అమ్మవారు మరియు ఆమె ఆడపడుచు లు అక్క చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం….


ఈ ఉయ్యాల తాడిని రైతు లు వారి వారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడి ని సమర్పించడాని కి ఎగబడతారు అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవలసి వుంటుంది....


ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మంది కి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మ్రోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ వుంటే దారిపొడవునా గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడిలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడివద్దకు సాగనంపుతారు ....

అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్దకు రావాలి అది అనాదిగా వస్తున్న ఆచారం 

పెద్దాపురం లో మరిడమ్మ అమ్మవారు వెలసినప్పటి నుండీ జాతర నిర్వహించుచున్న ఒకే ఒక వీది ఏమిటో తెలుసా ?


పాత పెద్దాపురం కోటముందు


***తొలి జాతర***

బహులైక జేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగలు ***గుడి వద్ద జాతర గరగలు కంటే ముందు*** ఎత్తి అమ్మవారి సమక్షం లో గరగ నృత్యం ఒక ఆట పులి నృత్యం ( పులి ఆటకి రాష్ట్రము లోనే ప్రసిద్ది చెందిన పులి ఆటకారులున్నారిక్కడ ) ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోటముందు కి పయనమవుతారు.. మిగిలిన కార్యక్రమం అంతా కోటముందు లోనే జరుగుతుంది ......
ఇది వరకూ ఈ వీది వారికి ఇంటికి ఒక ఎద్దుల బండి వుండేది .....ప్రతీ ఒక్కరు వ్యవసాయంతో పాటుగా ఇటుక బట్టీ వ్యాపారాలను నిర్వహించేవారు. వ్యవసాయక్షేత్రం ద్వారా వచ్చే గడ్డితో ఎద్దులను .. ఎద్దులద్వారా మట్టి తొక్కించి ఇటుకల వ్యాపారాన్ని జరుపుకునేవారు ...... దాదాపు 30 ఎద్దుల బళ్ళుతో ఒక మైలు (సుమారు కిలోమీటరున్నర దూరం) వరకూ రక రకాల వేషాలతో అంగరంగ వైభవం గా కాగడాల కాంతుల్లో అద్భుత రీతి లో జరిగేది పాత పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మ వారి జాతర మహోత్సవం ...

ఇక్కడ పెద్దాపురం కళాకారులు ప్రదర్శించే పాత పెద్దాపురం కోటముందు వాసుల పులి నృత్యం ... మాల మరిడీ సాముగరిడీలు… బంగారమ్మ గుడి వీధి వారి కర్రసాము…. కళావంతుల కోలాటాలను వీక్షించడానికి రాష్ట్రం నలుమూలలనుండీ ప్రేక్షకులు వచ్చేవారు.

Peddapuram Maridamma Temple Timings :
Morning : 5 am to 12.30 pm
Evening : 4 pm to 8.30 pm

Peddapuram Maridamma Temple Address:
Maridamma Temple,
Near Darga Center,
Peddapuram.
East Godavari District ,
Andhra Pradesh.
Phone Number : 08852-243746

Peddapuram Near by Temples
Pandavula Metta Peddapuram
Toli Tirupati ( Chadalada Tirupati ) 
Kandrakota Nookalamma Talli
Samarlakota Kumararama Bhimeswara Swamy Temple
Pithapuram Padagaya
Annavaram Satyannarayana Swamy
Bikkavaolu ( Biccavolu) Subrahmanya Swamy 
Peddapuram Maridamma Ammavari Temple Google map:


Pics & Content Credits: 
Vangalapudi Siva Krishna, Peddapuram
peddapuram maridamma temple history in telugu, peddapuram temple address, peddapuram famous temples, east godavari famous temples, Pithapuram , samarlakota, samalkota, annavaram, kandrakota , kakinada, Near by temples, hindu temples guide. telugu lo temples information, Temple best website in telugu, top telugu hindu temples website, 
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
  Blogger Comment
  Facebook Comment

1 comments:

 1. మమతల మా అమ్మతల్లి
  మము కాచే కల్పవల్లి
  మహిమాన్విత మరిడి తల్లి
  మా 'పురపు ఇలవేలుపు

  మన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి గురించి మీ బ్లాగులో వివరించినందుకు ధన్యవాదాలు సర్ - మీకు ముక్కోటి దేవతల దీవెనలు ఉంటాయి - ఎందఱో సందర్శకులకు సులువుగా దైవ దర్శనం అయ్యేలా మీరు రూపొందించిన ఈ బ్లాగు ఎంతో ప్రయోజనకరం - Thanq Mr. Raja Chandra

  ReplyDelete

Have You Visited These Temples