Drop Down Menus

Kapaleeshwar Temple Mylapore Details

కబాలి ఇప్పుడు అందరినోట ఇదే మాట.. నేను చెన్నై లో జాబ్ చేస్తున్నప్పుడు మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయానికి వెళ్తుండేవాడిని.
 కపాలి బదులు కబాలి అనే వాళ్ళు పిలిస్తే మనవాళ్ళు కూడా కబాలి అనే మొదలుపెట్టారు. సరే వాటి కోసం వాదన దేనికి .. చెన్నై లో సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి సుమారు 8 కిమీ దూరం, లోకల్ ట్రైన్ లో వెళ్లాలంటే సెంట్రల్ ఎదురుగా  బ్రిడ్జి క్రింద ఉన్న రైల్వే స్టేషన్ నుంచి ( park town station ) నుంచి మైలాపూర్ చేరుకోవచ్చు.

కపాలీశ్వర్ ఆలయం చాల పెద్దది, ఆలయం ఎదురుగా పెద్ద కోనేరు ఉంటుంది. పార్వతీదేవి నెమలి రూపం లో ఇక్కడ తపస్సు చెయ్యడం వల్ల ఈ ప్రదేశానికి మైలాపూర్ ( మైయిలా  అంటే నెమలి ) అని వచ్చింది.

ఈ ఆలయం చాల పురాతనమైనది,  7 వ శతాబ్దం లో పల్లవులు నిర్మించారు, నాయనార్లలో ముఖ్యులైన అప్పర్, జ్ఞాన సంబందర్ ఈ ఆలయం లోని శివుని గురించి కీర్తనలు రాసారు. 

తెలుగు లో కపాలం అంటే పుర్రే.. పరమశివుడు బ్రహ్మదేవుడి పుర్రేలను ధరించినవాడు కావడం వల్ల కపాలీశ్వర్ అని చెబుతారు. ఈ ఆలయం లోని శివలింగాన్ని బ్రహ్మదేవుడే ప్రతిష్టించాడని స్థలపురాణం. 

మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు దగ్గర్లోనే రామకృష్ణ మఠం ఉంటుంది.. చాల బాగుంటుంది తప్పకుండా వెళ్ళండి రామకృష్ణ పరమహంస కోసం బుక్స్ ఇక్కడ చాల తక్కువ ధరకే లభిస్తాయి.  మఠానికి దగ్గర్లోనే సాయిబాబా గుడి ఉంటుంది ఇక్కడకు కూడా వెళ్ళిరండి.
Temple Timings:
Morning : 5 am to 9 pm
Temple Address:
Arulmigu Kapaleeswarar Temple,
Mylapore,
Chennai-600 0004.

Tamil Nadu
Kapaleeshwar Temple Official website : 
http://www.mylaikapaleeswarar.tnhrce.in/

ఇవి కూడా చూడండి :
తమిళనాడు లోని ప్రసిద్ద ఆలయాలు 
కాశి లో ఆంధ్ర ఆశ్రమం లో మోసపోకండి. 

తలనీలాలు ఎందుకు ఇస్తాం ?
తిరుపతి సేవ టికెట్స్ బుక్ చేస్కోవడం ఎలా? 

kapaleeshwar temple mylapur, kapaleeswarar temple timings, kapaleeswarar temple history, kapaleeshwar temple history in telugu, chennai famous temples, chennai local famous temples, hindu temples guide, temple information in telugu, telugu devotional best website, telugu travel blog, telugu travel guide for devotes, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON