Drop Down Menus

Pithapuram Kukkuteswara Swamy Temple Padagaya History Timings Accommodation


త్రిగయా క్షేత్రాలములలో పిఠాపురం లో యున్న పాదగయ క్షేత్రం ఒకటి, పాదగయ క్షేత్రం లో పరమశివుడు గయాసురిని కోరిక మేరకు లింగరూపుడై స్వయంభూవమూర్తియై  కుక్కుటేశ్వరుని గా పూజలు అందుకుంటున్నాడు.  అతి ప్రాచీన శైవక్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రం లోనే అష్టాదశ శక్తి పీఠాలలో 10 వ శక్తిపీఠమైన పురుహూతికా దేవి శక్తి పీఠం కలదు. ఈ క్షేత్రం లోనే స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. 

భక్తులు కుక్కుటేశ్వరున్ని , పురుహూతికా దేవి కి పూజలు చేసి తరిస్తారు. పాదగయ క్షేత్రం లో మరో విశేషం పితృకర్మలు చేయడం. ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు ఐదు మాత్రమే కలవు అవి 1) శిరోగయ ( బీహారు ) 2) నాభి గయా ( ఒడిషా ) 3) పాదగయ ( పిఠాపురం ) 4) మాతృగయ ( గుజరాత్ ) 5) బదరీ బ్రహ్మకపాలా క్షేత్రం , కాశి వరకు వెళ్లలేని వాళ్ళు పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తారు. అందుకనే దక్షిణ కాశి అని పిఠాపురాన్ని పిలుస్తారు. గోదావరి పుష్కరాల సమయం లో పెద్ద ఎత్తున ఒడిషా నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పిండప్రదానం జరిపిస్తుంటారు. 
కుక్కుటేశ్వరుని ఆలయం లోకి ప్రవేశించగానే సాకార రూపంలో  ధ్యానం చేస్తున్నా పరమశివుడు మనకి దర్శనం ఇస్తారు , 

స్వామి వారి వెనకాలే ఉన్న పెద్ద కోనేరు , ఆ కోనేటిలో క్షేత్ర స్థలపురాణం గయాసుర వృత్తాంతం మనకి సూచనప్రాయంగా తెలిసేలా ఏర్పాటుచేసిన నిర్మాణం మనల్ని ముందుకు వెళ్లనీయకుండా ఒకసారి పరిశీలించేలా చేస్తుంది. గయాసురుడు , గయాసురుడుపై యాగం చేస్తూ విష్ణు, బ్రహ్మ , మహేశ్వరులు కనిపిస్తారు. 

కోనేటిలో దిగి స్నానం చేస్తున్నా భక్తులను చూస్తూ మనం కూడా అలానే చేస్తాం. మైక్ లోంచి గోడలమీద, కోనేటి స్నానం చేసేటప్పుడు సబ్బులు షాంపూలు ఉపగించకూడదు అని వినబడి కనబడగానే తీర్ధ స్నానాలు ఎలా చెయ్యాలో గుర్తుకువచ్చి సంకల్పం చెప్పించుకుని, సంకల్పం చెప్పడం రాకపోతే ప్రక్కన ఉన్న బ్రాహ్మణులను  పిలిచి సంకల్పస్నానం చేయించమని కోరితే వారు మన గోత్ర నామాలతో సంకల్ప స్నానం చేయించగా , వారికి ఓ పదిరూపాలు దక్షిణ ఇచ్చిన కాళ్లకు నమస్కరిం చి. ఆలయం దగ్గరకు ముందుకు నడువగా కుడివైపున అంతరాలయ దర్శనం టికెట్ కౌంటర్ కనిపిస్తే, ఎంతోదూరం నుంచి వచ్చాం స్వామి వారిని దగ్గర నుంచి చూసి తరిద్దాం అనుకుని టికెట్ తీస్కుని ధ్వజస్తంభానికి నమస్కరించి,  ప్రదిక్షణ పూర్వకంగా నడుస్తుంటే , ధ్వజస్తంభం ఎదురుగా  పెద్ద ఏకశిలా నంది కనిపిస్తుంది.  


ప్రదిక్షణ చేస్తూ  నడవగా ఎడమచేతివైపు విష్ణుపాదాలు , 

వినాయకుడు .. పెద్ద హాలులలో పూజలు చేయించుకుంటున్నా భక్తులు కనిపిస్తారు. ఇంకా ముందుకి చూస్తూ నడుస్తుంటే స్వయం భూ దత్తాత్రేయ ల  వారి ని దర్శించుకుని కుడివైపుకు తిరగగా రాములవారి సన్నది , ఆదిశంకరుల సన్నది , అయ్యప్ప , కాశి విశ్వేశ్వర అన్నపూర్ణ సన్నిధులు , సుబ్రహ్మణ్యుడు నవగ్రహాలను దర్శించి కుడివైపుకి తిరిగితే వేదపారాయణం మండపం కనిపిస్తుంది. కాస్త ముందుకి నడిస్తే పురుహూతికాదేవి శక్తి పీఠం కనిపిస్తుంది. అమ్మవారి దగ్గరకు ప్రత్యేకంగా వెళ్దాం అని స్వామి వారి దర్శనం చేస్కోవడానికి లైన్ లోకి వెళ్లి నిలబడి నెమ్మదిగా ముందుకి కదులుతూ 


స్వామివారి అంతరాలయ ప్రవేశం చేసి  .. ఎంతకాలానికి వచ్చాం స్వామి అనుకుంటూ నమస్కరిస్తుంటే పూజారిగారు మన దగ్గరున్న కొబ్బరికాయ, అరటిపళ్ళు తీస్కుని గోత్రనామాలతో పూజచేసి హారతి ఇచ్చి శఠగోపం  పెట్టినతరువాత మరో సారి స్వామి వారిని దర్శనం చేస్కుని 


వెనుక ఇంకా  ఉన్న భక్తులు  ఉన్నారు కదా..  అని ముందుకి కదిలి, ప్రక్కనే ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం చేస్కుని.. ముందుకు కదిలితే ఎదురుగా ఉన్న 10 వ శక్తి పీఠం పురుహూతికా దేవి 

దర్శనానికి లోపలి వెళ్లి ప్రదక్షణ పూర్వకంగా నడుస్తుంటే అమ్మవారి గోడలపైన 18 శక్తి పీఠాలు ఉండటం చూసి మనం కూడా మిగిలిన క్షేత్రాలు చూడాలి అని మనసులో అనుకుని అమ్మవారికి ఎదురుగ నిలబడితే అక్కడ కుంకుమ పూజచేయించుకోవడం చూసి మీరు కూడా చేయించుకుని ఆలయం బయటకు వచ్చి .. వెనుకవైపున సాయి బాబా ఆలయం ఉంది అని ఎవరో చెప్తే వెనక్కి వెళ్లి సాయిబాబా వారిని దర్శనం చేస్కుని . అక్కడే కాసేపు ప్రశాంతంగా కూర్చుని .. భోజన సమయం ఐతే అక్కడే ఆలయం లో అన్నదానం లో పాల్గోని తరించడమే. 
శివరాత్రి రోజుల్లో.. 
Padagaya Temple Timings :
Morning :7.30 am to 12:30 pm 
Evening : 4.30 pm to 8.30 pm

How to Reach Pithapuram Padagaya :
పిఠాపురం ఎలా చేరుకోవాలి :

పిఠాపురం చేరుకోవడం చాల చాల సులభం , పిఠాపురం కాకినాడకు 15 కిమీ దూరం లోను , సామర్లకోటకు 13 కిమీ దూరం లోను ఉంది. పిఠాపురం లో కూడా రైల్వేస్టేషన్ ఉంది. అన్ని ప్రాంతాల నుంచి అటు సామర్లకోట ట్రైన్ లో రావచ్చు, సామర్లకోట నుంచి పిఠాపురం 13 కిమీ దూరమే కాబట్టి మీరు బస్సు లోను లేదా ఆటో లో కూడా రావచ్చు. సామర్లకోట నుంచి వచ్చే ఆటో లు లేదా బస్సు లు గుడిదగ్గరే ఆగుతాయి. 
15 km from kakinda , 13 km from samalkota.

Padagaya Kshetram Contact Numbers :
Room Booking & Pooja Details : 08869252477
Padagaya EXECUTIVE OFFICER  : 8497955111

Temple Adrees :
The Executive Officer
SRI KUKKUTESWARA SWAMY DEVASTHANAM
PITHAPURAM
EAST GODAVARI DISTRICT
Pin-code : 533450

Padagaya Kukkuteswara Swamy Official Websites :
www.kukkuteswaraswamypadagaya.com
www.padagaya.com

Padagaya Temple History Free Download : 

Click Here to Downloadhttps://goo.gl/RakTQ4

Surrounding Temples Details :
పిఠాపురం లో చూడవలసిన దేవాలయాలు :
Kutimadhava Swamy Temple
పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతీమాధవ క్షేత్రం
Venugopala Swamy Temple Pithapuram
వేణుగోపాల స్వామి వారి ఆలయం
Anagha Datta Kshetram
అనఘ దత్త క్షేత్రం 
Pithapuram Near by Famous Temple List :
పిఠాపురం దగ్గర్లో గల క్షేత్రాలు :
> Samarlakota Kumara Bhimeswara Kshetram
 సామర్లకోట లో గల కుమార భీమేశ్వర క్షేత్రం  ( పంచారామ  క్షేత్రం ) 
Gollala Mamidada Surya Narayana Temple
Peddapuram Maridamma .. Pandavula Metta
 పెద్దాపురం మరిడమ్మ .. పాండవుల మెట్ట 
Kandrakota Nookalamma Temple
 కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారు 
>Toli Tirupathi Sri Srungara Vallabhaswamy
 తోలి తిరుపతి శ్రీ శృంగార వల్లభస్వామి 
> Annavaram Satyanaraya Swamy
 అన్నవరం సత్యనారాయణ స్వామి 
Talupulamma Lova
  తలుపులమ్మ లోవ 
Draksharamam ( Pancharama Kshetram & Shakti Peetham _ 
  ద్రాక్షారామం పంచారామ క్షేత్రం మరియు శక్తి పీఠం 
Bhavanarayana Swamy Temple Sarpavaram
 సర్పవరం భావనారాయణ స్వామి 
Pics Credits : Saride Nag

             


pithauram temple information  , pithapuram temple timings accommodation details , east godavari famous temples, pithapuram near by famous temples list , lord shiva temples, shakti peethas 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.