Drop Down Menus

Rameswaram Tour Package Details | Sri Pushpaka Tours and Travels | Tamil Nadu Tour 8 Days Package


తమిళనాడు  లో ప్రసిద్ద దేవాలయాలు అనగా మదురై , అరుణాచలం , కాంచీపురం , రామేశ్వరం , పళని , తంజావూరు , శ్రీరంగం , కుంభకోణం  ఇలా ప్రధానమైన క్షేత్రాలను కవర్ చేస్తూ తిరుపతి దర్శనం తో పాటు అలివేలుమంగాపురం , తిరుచానూరు పద్మావతి అమ్మవారి క్షేత్రం , కాణిపాకం ,  శ్రీకాళహస్తి ,  విజయవాడ , ద్వారకా తిరుమల క్షేత్రాలను కవర్ చేస్తూ   శ్రీ పుష్పక టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు జులై 3 వ తేదీ 2018 నాడు రామేశ్వరం యాత్ర తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి మొదలుకానుంది . 
ఈ ట్రావెల్స్ వాళ్ళు మహాబలిపురం , దారాసురం కూడా వీరు చూపించబోయే లిస్ట్ లో చేర్చడం బాగుంది . ఎందుకంటే మనం ఈ రెండు మిస్ చేస్తుంటాం . ఈ రెండు తప్పకుండ చూసి తీరాలి . ఎందుకో మీరు వెళ్ళినప్పుడు మీకే అర్ధమౌతుంది . యాత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి . 

యాత్ర చేయబోయే రోజులు : 8
క్షేత్రాల వివరాలు : తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ లోని మొత్తం 18 క్షేత్రాలు. 
తమిళనాడు రాష్ట్రం లో
1. సిరిపురం :  బంగారం గుడి ( గోల్డెన్ టెంపుల్ ) , వెల్లూర్ 
కాంచీపురం :
2. విష్ణుకంచి :  శ్రీ వరదరాజస్వామి వారి గుడి , బంగారు బల్లి ఈ క్షేత్రం లోనే కలదు . 108 వైష్ణవ క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. 
3. శివ కంచి :  శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం మరియు పంచభూత క్షేత్రాలలో పృథ్వి ( భూమి ) లింగమైన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి క్షేత్రం . అమ్మవారు ఈ ఆలయం లో మామిడి వృక్షం క్రింద తపస్సు చేసినట్టుగా స్థలపురాణం , ఈ మామిడి చెట్టు నాలుగు రకాల మామిడికాలను కాసేది . ఈ మామిడి చెట్టు వయస్సు 3500 సంవత్సరాలు . ఆ మామిడి చెట్టు పడిపోతే ఆ ప్రదేశం లో మరో మామిడి మొక్కను నాటారు . ఆ మామిడి కాండాన్ని ఈ ఆలయం లో చూడవచ్చు . 
4. మహాబలిపురం : అందరు తప్పకుండ చూడాల్సిన ప్రదేశం ఇది . సముద్రపు ఒడ్డున నిర్మించిన గుడి , పంచ రథాలు , గుహలు . చాల చాల బాగుంటాయి. పల్లవుల చోళుల యుద్ధం వల్ల అక్కడ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయి కానీ నిజానికి ఆవికానుక పూర్తిఅయితే ప్రపంచ వింతల్లో మహాబలిపురం కూడా చెప్పుకునేవాళ్ళం . 

నాకు అనిపిస్తుంది ఇలా నేను వివరిస్తూ వెళ్తే మీకు చదవడం కష్టం అని .. మామూలుగా ఊర్ల పేరు ఇస్తాను . 

5. తిరుక్కలుకుండ్రం : పక్షితీర్థం - శ్రీ వేదగిరీశ్వర్ దేవాలయం 

6. కుంభకోణం : శ్రీ శ్వేత గణపతి ఆలయం , శ్రీ ఆదికుంభేశ్వరాలయం , శ్రీ సారంగపాణి ఆలయం 
7 . దారాసురం : శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం 
8. తంజావూరు : శ్రీ బృహదీశ్వర ఆలయం , మణిక్కోయిల్ 
9. శ్రీరంగం : శ్రీ రంగనాధ స్వామి ఆలయం 
10. పళని : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం 
11. మదురై : శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం 
12. రామేశ్వరం : శ్రీ రామనాధ స్వామి ఆలయం , ధనుష్కోటి మరియు లోకల్ టెంపుల్స్ . 
13. తిరువణ్ణామలై : శ్రీ అరుణాచలేశ్వర ఆలయం 
ఆంధ్ర రాష్ట్రము లో దర్శించే క్షేత్రాలు :
14. కాణిపాకం : స్వయం భూ శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రం 
15. తిరుపతి : శ్రీ వేంకటేశ్వర క్షేత్రం , తిరుచానూర్ , అలివేలుమంగాపురం 
16. శ్రీకాళహస్తి : ఈ ఆలయం వాయులింగ క్షేత్రం , శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం 
17. విజయవాడ : శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 
18. ద్వారకా తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం 

ప్రత్యేక హాల్స్ : 
కాణిపాకం , పళని , రామేశ్వరం , అరుణాచల క్షేత్రాలలో ఉదయం పూట ప్రెష్ అవడానికి మరియు సిరిపురం, తిరుపతి క్షేత్రాలలో రాత్రి పడుకోవడానికి స్త్రీ , పురుషులకు వేరుగా హాల్స్ ఇవ్వబడును . 

టికెట్ ధర : 12,000/-
సీటు రిజర్వు  చేస్కోవడం : 
యాత్రకు రాదలచిన వారు 30 రోజులు ముందుగా ఆధార్ కార్డ్ జెరాక్స్ , ఒక ఫోటో సీటు 1కి 4000/-  అడ్వాన్స్ చెల్లించి సీటు రిజర్వు చేస్కోవలెను. 

SriPushpaka Tours & Travels Contact Numbers :
Cell Numbers : 9573620380, 8500108088
Office Number : 08854254966

Keywords :
Rameswaram tour packages, Rameswaram tour , 8 days trip , Tamilnadu Tour, Sri Purshpaka Tours and Travels, Temples guide travels. Tour Packages and details. 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Pondicherry is located in southern Indian state of Tamil Nadu on the Bay of Bengal coast hotels in pondicherry It boasts of an impressive building done up with magnificent exterior and beautiful interiors

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.