Drop Down Menus

Signification Of Saleshwaram Temple | Saleshwaram Lingamaiah Temple Srisailam

ఈ ఆలయ చరిత్ర:
ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. సలేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడిన గుహ ఆలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్టంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. 
ఈ  సలేశ్వరా స్వామి  ఆలయం శ్రీశైలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి నుండి 10 కిలోమీటర్ల దూరంలో 'సలేశ్వరం లింగయ్య ఆలయం' ఉంది. సర్వేశ్వరం మరియు సైలేశ్వరం అని కూడా పిలువబడుతుంది ఈ సలేశ్వరం. 
ఈ  సలేశ్వరం ఆలయం అత్యంత పురాతనమైన ప్రసిద్ధి దేవాలయం. ఈ సలేశ్వరం దేవాలయం 6 లేదా 7 వ శతాబ్దం నాటిది. మరియు సలేశ్వరస్వామి ఆలయం  గురించి  అనేక ప్రాచీన పురాణాల్లో  హిందూ లిపిలో శ్రీ పార్వతా పురాణం'లో  శ్రీశేరుర పురాణం, శ్రీశైలం గురించి 16 వ శతాబ్దంలో రచించిన శేషనాథ్ యొక్క ప్రసిద్ధ రచన ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడుతుంది. 
ఈ ప్రదేశంలో  సర్వేశ తీర్ధం మరియు పుష్కర తీర్ధం అనే రెండు తీర్ధం గురించి కూడా ప్రస్తావించబడ్డాయి.
ఈ సలేశ్వరం లింగయ్య ఆలయం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే  ఇది భారీ రాతిపై చెక్కబడింది అనిపిస్తుంది. జలపాతం పక్కన ఉన్న ఒక గుహలో శివలింగం ఉంది.సంవత్సరం అంత సలేశ్వర ఆలయం మూయబడి ఉంటుంది. 
ఇది కేవలం సంవత్సరంలో ఉగాది (తెలుగు నూతన సంవత్సరం) తరువాత మొదటి  చిత్రు పూర్ణిమలో లేదా ఏప్రిల్లో పౌర్ణమి రోజున 3 నుంచి 5 రోజులు మాత్రమే తెరువబడుతుంది. 
అ  సమయంలో  వేలాది మంది భక్తులు మరియు ఇతర రాష్ట్ర  ప్రజలు మరియు దేశం నాలుగుమూలలలో ఉన్న శివ భక్తులు ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. లింగయ్య జాతర ప్రసిద్ధి చెందింది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎక్కడ జాతర  నిర్వహించబడుతుంది. అ సమయంలో ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది.  
తెలంగాణ  అమరనాధ్ గా కూడా పిలువబడుతుంది . భక్తులు శ్రీశైలం చేరుకోవడానికి చాలా కాలం ఈ అడవి మార్గం నుండి  కూడా వెళ్లేవారు. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము.
ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న జలపాతమే యాత్రికులను మంత్రముగ్దులను చేస్తుంది. సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక కొండ నుండి ప్రవహించే నీటి జలపాతం ఈ దేవాలయానికి మరొక ప్రత్యేక ఆకర్షణ.

సంవత్సరం అంత  ఆకర్షణీయంగా ఉంటుంది.  ప్రకృతి ప్రియలకు మరియు  సాహస ప్రియులకు ఈ యాత్ర ఒక్క మంచి అనుభూతిని,భయంకలిగించే సాహసతో కూడుకున్న ప్రయాణం ఎంతగానో మానసిక ,శారీరక ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ యాత్ర చేయాలంటే ఎంతో ధైర్యం,అదృష్టం ఉండాలి. దట్టమైన అడవిలో వున్నందువలన అనాదిగా ఇక్కడ పూజాదికార్యక్రమాల చెంచులే నిర్వహిస్తున్నారు. దేవాలయ నిర్వహాణ తమ బాధ్యతగా భావిస్తారు.


           సాహస ప్రియులకి ఆదర్శవంతమైన ప్రదేశం, ఈ అద్భుతమైన (Trekking Trails ) ట్రెక్కింగ్ ట్రైల్స్ కోసం ఈ సలేశ్వరం ప్రసిద్ది చెందింది.ఈ ప్రదేశం శ్రీశైలం మరియు( Mannanur) మన్ననూర్ల మధ్య అభయారణ్యంలో ఉంది. ఈ రహదారిలో శ్రీశైలం నుండి 48 కి.మీ. దూరం ప్రయాణించిన తరువాత ఎడమవైపు మలుపు నుండి అటవీలోకి తీసుకోవాలి. 
అదే రహదారిలో 10 కిలోమీటర్ల ప్రయాణించిన తరువాత  ఈ ప్రాంతానికి సమీప రహదారి పాయింట్ చేరుకోవచ్చు. రహదారి నుండి బండరాళ్లు మరియు అటవీ ప్రాంతాల నుండి 2,3 కిలోమీటర్ల దూరం తరువాత పర్యాటకులు ఈ ఆలయానికి చేరుకుంటారు.
Sri Saleshwaram temple is a Lingamaiah temple (Shiva temple) located in Nallamala forest near Shrisailam. The temple is dedicated to Lord Shiva.
The significant feature of this temple is that, it will be opened only for 3 to 5 days during ChitraPurnima or the full moon day in April. Saleshwaram temple is found about 11 km from Nalamalla forest. It is famous for its wedge-shaped water fall,which seems to have been chiselled across a huge stone.  The Shiva Linga is in a cave next to the waterfall.
Related Postings:

Address:
Saleshwaram Cave Temple, 
Srisailam  Nallamala Forest, 
Mahabubnagar, Mallapur, 
Telangana,- 509326, India  

Transport:
By Road: 
The other way is the APSRTC buses which ply from Hyderabad at a distance of 230kms taking 8 hrs and from the Accham peta and Kalvakurthi Bus Depots. 

By Train:
Srisailam does not have a railway station. But the state highway and the Vijayawada- Guntakalu  line.

By Air:
There are no regular flights from other major cities of the country to Srisailam. Nearest airport is RajivGandhi International Airport around 157km away from Srisailam and the other is Vijayawada Airport around 200 km away from it.

Key Words:
Saleshwaram Temple, Lingamaiah Temple at a cave in Nallamala,History Of Saleshwaram Temple | Lingamaiah Jathara,History Of Saleshwaram Temple in Telugu,Saleshwaram Temple in Telugu, సలేశ్వరం గుడి,Saleshwaram Temple, Shiva Temple,Special Story On History Of Saleshwaram Temple,Saleshwaram Temple Story,Saleshwara Temple Story In Telugu, Telangana Temples,A Famous Cave Temple In Telangana,Saleshwaram,Saleshwara temple Phone no.
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON