Drop Down Menus

Misrikh , Misrikh Tirath Information | Uttar Pradesh | Hindu Temples Guide

మిస్రిఖ్ తీర్ధం , మిస్రిఖ్, ఉత్తర్ ప్రదేశ్ :

ఈ ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం. వైష్ణవ సంప్రదయాలో 108 విష్ణు ఆలయలలో ఈ ఆలయం ఒకటి.  ఈ ఆలయం గోమతి నది ఎడమ ఒడ్డున ఉంది. ఈ దేవాలాయం వద్ద ఉన్న తీర్ధం కూడా చాలా ప్రసిద్ది చెందినది. ఉత్తర్ ప్రదేశ్ లో ఈ తీర్ధం కలదు. ఈ ప్రాంతం నుంచి నైమిశారణ్యం చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయంలో హోళీ మరియు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఆలయ చరిత్ర :

ఈ ఆలయానికి దాదిచి మహారాజ్ మహర్షికు చాలా దగ్గరి సంబందం కలదు. అతను భ్రిగస్ వంశంలో జన్మించాడు.  అసుర వృత్రాన్ని ఓడించడానికి దేవతలు ఇతని ఎముకలను ఆయుధాలను తయారు చేయడానికి అనుమతించటానికి తన జీవితాన్ని వదులుకున్న ఘనత ఆయనది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో  బుషి ఉన్నప్పటి గుర్తులని దర్శించవచ్చు. దాదిచి మరియు అతని భార్య పేరు స్వర్చా మరియు అతని కుమారుడు పిప్పలడ ఋషి, అతను తన ఆశ్రమాన్ని భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలోని నైమిశరణ్యలోని మిస్రిఖ్‌లో స్థాపించాడు. నైమిశారణ్య పురాణాలన్నిటిలోనూ తన ఆశ్రమానికి చోటుగా పేర్కొనబడింది, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన శ్లోకం  "నారాయణం కవాచం" దాదిచి రచించినట్లు నమ్ముతారు.


పూర్వం దేవతల అధిపతి అయిన దేవేంద్రుడు మరియు రాక్షసులకి ఘోరమైన యుద్దం జరుగుతుంది. ఈ యుద్దం లో దేవతల రాజు ఒడిపోతాడు. అందుకు కారణం ఆలోచించగ వారికి పరమశివుని వరం వలన ఓడిపోయారు అని గ్రహించి , ఈ ముని ఆశ్రమం వద్దకి వచ్చి ఈ ఆశ్రమంలో పరమశివుని గురించి తపస్సు చేసుకోవడం కొరకు కొద్ది రోజులు ఈ ప్రాంతాన్ని తనకి అప్పగించవలసినది అడిగినాడు. అందుకు ఆ ముని సరేనాన్ని అన్నాడు. ఈ ప్రాంతంలో పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేసి స్వామి తో వారిని ఓడించే వరాన్ని పొందాడు. పరమశివుని ప్రత్యక్షం కావడం వల్ల ఈ ప్రాంతాన్ని అత్యంత పవితమైన ప్రాంతంగా భావిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 7.00-12.00
సాయంత్రం : 4.30-8.30

వసతి వివరాలు :

ఈ ఆలయం సమీపంలో సత్రాలు చాలానే కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఈ ఆలయానికి ఉత్తర్ ప్రదేశ్ నుంచి చాలా బస్ లు కలవు.

రైలు మార్గం :

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో స్టేషన్ ఆలయానికి కొద్ది దూరంలో కలదు. ఈ స్టేషన్ నుంచి 25 కి. మీ దూరంలో కలదు.

విమాన మార్గం :

లక్నో వద్ద ప్రధాన విమానాశ్రయం  నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఆలయ చిరునామా :

మిస్రిఖ్ తీర్ధం ,
మిస్రిఖ్,
నైమిశారణ్యం, 
లక్నో,
ఉత్తర్ ప్రదేశ్ : 261401

Key Words : Misrikh , Misrikh Tirath Information , Famous Temples In Uttar Pradesh ,  Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON