Bhagavad Gita 10th Chapter 33-42 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA DAŚAMOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత దశమోఽధ్యాయః

atha daśamoadhyāyaḥ |
అథ దశమోఽధ్యాయః |
akśharāṇāmakāroasmi dvandvaḥ sāmāsikasya cha |
ahamevākśhayaḥ kālo dhātāhaṃ viśvatomukhaḥ ‖ 33 ‖

అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామాసికస్య చ |

అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ‖ 33 ‖ 


భావం : అక్షరములలో "అ"కారమును నేను. సమాసములలో ద్వంద్వ సమాసమును నేను. అక్షయకాలము అనగా మహాకాలమును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.  

mṛtyuḥ sarvaharaśchāhamudbhavaścha bhaviśhyatām |
kīrtiḥ śrīrvākcha nārīṇāṃ smṛtirmedhā dhṛtiḥ kśhamā ‖ 34 ‖

మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |

కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ‖ 34 ‖


భావం : అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడా నేనే.  స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా అనువారందరును నేనే.

bṛhatsāma tathā sāmnāṃ gāyatrī Chandasāmaham |
māsānāṃ mārgaśīrśhoahamṛtūnāṃ kusumākaraḥ ‖ 35 ‖

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |

మాసానాం మార్గశీర్షోఽహమృతూనాం కుసుమాకరః ‖ 35 ‖


భావం : గానము చేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామమును నేను. ఛందస్సులో గాయత్రీఛందస్సును నేను. మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. 

dyūtaṃ Chalayatāmasmi tejastejasvināmaham |
jayoasmi vyavasāyoasmi sattvaṃ sattvavatāmaham ‖ 36 ‖

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |

జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ‖ 36 ‖

భావం : వంచకులలో జూదమును నేనే. ప్రభావ శాలురలోని ప్రభావమును నేను. విజేతలలో విజయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే. 

vṛśhṇīnāṃ vāsudevoasmi pāṇḍavānāṃ dhanañjayaḥ |
munīnāmapyahaṃ vyāsaḥ kavīnāmuśanā kaviḥ ‖ 37 ‖

వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః |

మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ‖ 37 ‖


భావం: వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే.  

daṇḍo damayatāmasmi nītirasmi jigīśhatām |
maunaṃ chaivāsmi guhyānāṃ GYānaṃ GYānavatāmaham ‖ 38 ‖

దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |

మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ‖ 38 ‖


భావం: శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్చగలవారి నీతిని నేనే. గోప్యవిషయ రక్షణమున మౌనమును నేను. జ్ఞానులయొక్క తత్వజ్ఞానమును నేనే. 


yachchāpi sarvabhūtānāṃ bījaṃ tadahamarjuna |
na tadasti vinā yatsyānmayā bhūtaṃ charācharam ‖ 39 ‖

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |

న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ‖ 39 ‖


భావం: ఓ అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచరప్రాణి ఏదియును లేదు.

nāntoasti mama divyānāṃ vibhūtīnāṃ parantapa |
eśha tūddeśataḥ prokto vibhūtervistaro mayā ‖ 40 ‖

నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |

ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ‖ 40 ‖


భావం : ఓ పరంతపా! నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని. 

yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitameva vā |
tattadevāvagachCha tvaṃ mama tejoṃ'śasambhavam ‖ 41 ‖

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంఽశసంభవమ్ ‖ 41 ‖


భావం: విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తు వేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలిసికొనుము.  

athavā bahunaitena kiṃ GYātena tavārjuna |
viśhṭabhyāhamidaṃ kṛtsnamekāṃśena sthito jagat ‖ 42 ‖

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |

విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ‖ 42 ‖

భావం: ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తు కేవలము నా యోగశక్తి యొక్క ఒక్కఅంశతోడనే ధరించుచున్నాను. 

oṃ tatsaditi śrīmadbhagavadgītāsūpaniśhatsu brahmavidyāyāṃ  yogaśāstre śrīkṛśhṇārjunasaṃvāde
vibhūtiyogo nāma daśamoadhyāyaḥ ‖10 ‖

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే


విభూతియోగో నామ దశమోఽధ్యాయః ‖10 ‖
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.   bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 10th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments