Bhagavad Gita 10th Chapter 1-10 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA DAŚAMOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత దశమోఽధ్యాయః
atha daśamoadhyāyaḥ |
అథ దశమోఽధ్యాయః |

bhūya eva mahābāho śṛṇu me paramaṃ vachaḥ |
yatteahaṃ prīyamāṇāya vakśhyāmi hitakāmyayā ‖ 1 ‖

భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |

యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ‖ 1 ‖


భావం : శ్రీ భగవానుడు : నా మాటలు విని ఆనందిస్తునన్నావు. కనుక నీ శ్రేయస్సు కోరి శ్రేష్టమైన వాక్యం మళ్ళీ చెపుతాను విను.

na me viduḥ suragaṇāḥ prabhavaṃ na maharśhayaḥ |

ahamādirhi devānāṃ maharśhīṇāṃ cha sarvaśaḥ ‖ 2 ‖

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ‖ 2 ‖

భావం : దేవగణములకుకాని, మహర్షులకు కాని, నా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియవు. దేవతలకు, మహర్షులకు అన్ని విధాలా ఆదిపురుషుణ్ణి నేనే కావడం దీనికి కారణం. 

yo māmajamanādiṃ cha vetti lokamaheshwaram 

asaṃmūḍhaḥ sa martyeśhu sarvapāpaiḥ pramuchyate ‖ 3 ‖

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసంమూఢ స్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ‖ 3 ‖

భావం : పుట్టుక, ఆది లేనివాడనన్ని , సమస్త లోకాలకూ ప్రభువుననీ నన్ను తెలుసుకున్నవాడు మనుష్యులలో వివేకవంతుడై, పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతాడు.

buddhirGYānamasaṃmohaḥ kśhamā satyaṃ damaḥ śamaḥ |
sukhaṃ duḥkhaṃ bhavoabhāvo bhayaṃ chābhayameva cha ‖ 4 ‖
బుద్ధిర్జ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శ్శమః |
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ‖ 4 ‖
ahiṃsā samatā tuśhṭistapo dānaṃ yaśoayaśaḥ |
bhavanti bhāvā bhūtānāṃ matta eva pṛthagvidhāḥ ‖ 5 ‖
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ‖ 5 ‖
భావం : బుద్ది , జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం బాహ్యేంద్రియా, అంతరింద్రియా, నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, నిర్భయం, అహింసా, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి - అపకీర్తి, వంటి వివిధ భావాలు ప్రాణాలకు వాటి వాటి కర్మనుసారం నావల్లనే కలుగుతున్నాయి.

maharśhayaḥ sapta pūrve chatvāro manavastathā |

madbhāvā mānasā jātā yeśhāṃ loka imāḥ prajāḥ ‖ 6 ‖

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ‖ 6 ‖

భావం : సప్తమహర్షులూ, సనకనందనాది, నలుగురు ప్రాచీనమునులూ, మనువులూ నా సంకల్పబలం వల్లనే నా మానస పుత్రులుగా పుట్టారు. వాళ్ళనుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు. 

etāṃ vibhūtiṃ yogaṃ cha mama yo vetti tattvataḥ |

soavikampena yogena yujyate nātra saṃśayaḥ ‖ 7 ‖

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |

సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ‖ 7 ‖

భావం : నా సృష్టి మహిమనూ, యోగాశక్తినీ యాదార్ధంగా ఎరిగినవాడికి నిశ్చయంగా, నిశ్చలమైన యోగా సిద్ది కలుగుతుంది.

ahaṃ sarvasya prabhavo mattaḥ sarvaṃ pravartate |
iti matvā bhajante māṃ budhā bhāvasamanvitāḥ ‖ 8 ‖

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |

ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ‖ 8 ‖

భావం : సర్వజగత్తుకూ నేనే మూలకారణమాని, నా వల్లనే సమస్తం నడుస్తుందనీ గ్రహించే బుద్దిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు.

machchittā madgataprāṇā bodhayantaḥ parasparam |

kathayantaścha māṃ nityaṃ tuśhyanti cha ramanti cha ‖ 9 ‖

మచ్చిత్తాః మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |

కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ‖ 9 ‖

భావం : అలాంటి భక్తులు మనుషులూ, ప్రాణాలు నాకే అర్పించి నిరంతరం నన్ను గురించి ఒక్కోళ్ల కొకళ్ళు చెప్పుకుంటూ సంతోషం, పరమనందం  పొందుతారు. 


teśhāṃ satatayuktānāṃ bhajatāṃ prītipūrvakam |
dadāmi buddhiyogaṃ taṃ yena māmupayānti te ‖ 10 ‖

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |

దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ‖ 10 ‖

భావం : నా మీదే మనసు నిత్యం నిలిపి ప్రేమపూర్వకంగా నన్ను సేవించే వాళ్ళకు బుద్ది యోగం ప్రసాదిస్తాను. ఆ జ్ఞానంతో  వాళ్ళు నన్ను చేరగలుగుతారు.
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 10th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments