Bhagavad Gita 14th Chapter 1-9 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA CHATURDAŚOADHYĀYAḤ

శ్రీమద్ భగవద్ గీత చతుర్దశోఽధ్యాయః

atha chaturdaśoadhyāyaḥ |
అథ చతుర్దశోఽధ్యాయః |

śrībhagavānuvācha |
శ్రీభగవానువాచ |
paraṃ bhūyaḥ pravakśhyāmi GYānānāṃ GYānamuttamam |
yajGYātvā munayaḥ sarve parāṃ siddhimito gatāḥ ‖ 1 ‖

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |

యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ‖ 1 ‖


భావం : శ్రీ భగవానుడు : జ్ఞానాలన్నీటిలోకి ఉత్తమం, ఉత్కృష్టం అయిన జ్ఞానాన్ని నీకు మళ్లీ చెబుతాను విను. ఈ జ్ఞానం తెలుసుకున్న మునులంతా సంసార వ్యధల నుంచీ, బాధలనుంచీ తప్పించుకుని మోక్షం పొందారు. 

idaṃ GYānamupāśritya mama sādharmyamāgatāḥ |
sargeapi nopajāyante pralaye na vyathanti cha ‖ 2 ‖

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః |

సర్గేఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ‖ 2 ‖

భావం : ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి స్వరూపం పొందినవాళ్లు సృష్టి సమయంలో పుట్టరు. ప్రళయ కాలంలో చావరు.  

mama yonirmahadbrahma tasmingarbhaṃ dadhāmyaham |
sambhavaḥ sarvabhūtānāṃ tato bhavati bhārata ‖ 3 ‖

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ |

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ‖ 3 ‖

భావం : అర్జునా! మూలప్రకృతి నాకు గర్భాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని వుంచుతున్నందు వల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి.  

sarvayoniśhu kaunteya mūrtayaḥ sambhavanti yāḥ |
tāsāṃ brahma mahadyonirahaṃ bījapradaḥ pitā ‖ 4 ‖

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ‖ 4 ‖

భావం : కౌంతేయా! అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నీటికి మూల ప్రకృతే తల్లి. నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని. 
sattvaṃ rajastama iti guṇāḥ prakṛtisambhavāḥ |
nibadhnanti mahābāho dehe dehinamavyayam ‖ 5 ‖

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |

నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ‖ 5 ‖

భావం : అర్జునా! ప్రకృతి వల్ల పుట్టిన సత్వం రజస్సు,తమస్సు అనే మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి.

tatra sattvaṃ nirmalatvātprakāśakamanāmayam |
sukhasaṅgena badhnāti GYānasaṅgena chānagha ‖ 6 ‖

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ |

సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ‖ 6 ‖

భావం : అర్జునా! వాటిలో సత్వగుణం నిర్మాలమైనది కావడం వల్ల కాంతీ, ఆరోగ్యమూ కలగజేస్తుంది.అది సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది.   

rajo rāgātmakaṃ viddhi tṛśhṇāsaṅgasamudbhavam |
tannibadhnāti kaunteya karmasaṅgena dehinam ‖ 7 ‖

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ |

తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ‖ 7 ‖

భావం : కౌంతేయా! రాగస్వరూపం కలిగిన రజోగుణం ఆశకూ, ఆసక్తికి మూలమని తెలుసుకో, కర్మలమీద ఆసక్తి కలిగించే అది ఆత్మను బంధిస్తుంది.

tamastvaGYānajaṃ viddhi mohanaṃ sarvadehinām |
pramādālasyanidrābhistannibadhnāti bhārata ‖ 8 ‖

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |

ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ‖ 8 ‖

భావం : అర్జునా! అజ్ఞానంవల్ల జనించే తమోగుణం ప్రాణులన్నిటికి అవివేకం కలగజేస్తుంది తెలుసుకో. అది పరాకు, బద్దకం, నిద్రలతో ఆత్మను శరీరంలో బంధిస్తుంది. 

sattvaṃ sukhe sañjayati rajaḥ karmaṇi bhārata |
GYānamāvṛtya tu tamaḥ pramāde sañjayatyuta ‖ 9 ‖

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |

జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ‖ 9 ‖


భావం : అర్జునా! సత్వ
గుణం చేకూరుస్తుంది. రజోగుణం కర్మలలో చేరుస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరచి ప్రమాదాన్ని కలగజేస్తుంది. 
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 14th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments