Drop Down Menus

Bhagavad Gita 14th Chapter 10-18 Slokas and Meaning in Telugu | భగవద్గీత 14వ అధ్యాయం 10-18 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత చతుర్దశోఽధ్యాయః
అథ చతుర్దశోఽధ్యాయః |

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ‖ 10 ‖


భావం : అర్జునా! రజోగుణాన్ని, తమోగుణన్ని అణచివేసి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్వతమో గుణాలను అణచివేసి రజోగుణమూ సత్వరజోగుణాలను అణగాద్రోక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.   

సర్వద్వారేషు దేహేఽస్మిన్ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత ‖ 11 ‖
భావం : ఈ శరీరంలోని ఇంద్రియాలన్నీటి నుంచీ, ప్రకాశించే జ్ఞానం ప్రసరించినప్పుడు సత్వగుణం బాగా వృద్దిపొందిందని తెలుసుకోవాలి. 

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ‖ 12 ‖
భావం : అర్జునా! రజోగుణం అభివృద్ది చెందుతున్నప్పుడు లోభం, కర్మలపట్ల ఆసక్తి, అశాంతి, ఆశ అనే లక్షణాలు కలుగుతుంటాయి. 


అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ‖ 13 ‖
భావం : కురునందనా! బుద్దిమాంద్యం, బద్దకం, అలక్ష్యం, ఆజ్ఞానం ఈ దుర్లక్షణాలు తమోగుణ విజృంభణకు తార్కాణాలు. 

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే ‖ 14 ‖
భావం : సత్వగుణం ప్రవృద్ది చెందిన సమయంలో మరణించినవాడు ఉత్తమజ్ఞానులు పొందే పుణ్యలోకాలు పొందుతాడు. 

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ‖ 15 ‖
భావం : రజోగుణం ప్రబలంగా వున్న దశలో మృతిచెందితే కర్మల మీద ఆసక్తి కలవాళ్లకు జన్మిస్తాడు. అలాగే తమోగుణవృద్దిలో తనువు చాలించిన వాడు పామరులకూ, పశుపక్ష్యాదులకూ పుడతాడు.

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్ ‖ 16 ‖
భావం : సత్వగుణం సంబంధమైన సత్కార్యాల ఫలితంగా నిర్మలసుఖమూ, రాజసకర్మల మూలంగా దుఃఖం, తామసకర్మలవల్ల అజ్ఞానం కలుగుతాయని చెబుతారు. 


సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ‖ 17 ‖
భావం : సత్వగుణం వల్ల జ్ఞానం, రజోగుణం వల్ల లోభం, తమోగుణం వల్ల అజాగ్రత, మోహం, అజ్ఞానం సంభవిస్తాయి. 

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ‖ 18 ‖
భావం : సత్వగుణ సంపన్నులకు ఉత్తమలోకాలు సంప్రాప్తిస్థాయి. రజోగుణం ప్రధానంగా వున్నవాళ్లు మానవలోకన్నే పొందుతుండగా, తమోగుణం కలిగిన వాళ్లు నరకలోకానికి పోతుంటారు.

14వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 14th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON