Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

Bhagavad Gita 16th Chapter 1-12 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత షోడశోఽధ్యాయః
అథ షోడశోఽధ్యాయః |

శ్రీభగవానువాచ |
అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ‖ 1 ‖

అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునమ్ |
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ‖ 2 ‖
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ‖ 3 ‖
భావం : శ్రీ భగవానుడు: అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ది, జ్ఞానయోగనిష్ట, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళ స్వభావం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, త్యాగబుద్ది, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంఛీంచక పోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణలూ దేవతల సంపదవల్ల పుట్టిన వాడికి కలుగతాయి. 


దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ‖ 4 ‖
భావం : పార్ధా! రాక్షస సంపదలో పుట్టిన వాడి లక్షణాలు ఇవి కపటం, గర్వం, దూరహంకారం, కోపం, కరినత్వం, అవివేకం.  

దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా |
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ‖ 5 ‖
భావం : దైవ సంపద మూలంగా మోక్షమూ ఆసుర సంపద వల్ల సంసార బంధమూ కలుగుతాయి. అర్జునా! నీవు దైవ సంపదలో జన్మించావు. కనుక విచారించనక్కరలేదు.  

ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిందైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ‖ 6 ‖
భావం : అర్జునా! ఈ లోకంలో ప్రాణుల సృష్టిదైవమని, అసురమని రెండు రకాలు. దైవ సంపద గురించి వివరంగా ఇది వరకే చెప్పాను. ఇక అసుర సంపద గురించి విను.   

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ‖ 7 ‖
భావం : అసుర స్వభావం కలిగిన వాళ్ళకు చేయదగ్గ దేదో, చేయకూడనిదేదో తెలియదు. వాళ్లలో శుచిత్వం, సదాచారం , సత్యం కనిపించవు.  

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్ ‖ 8 ‖
భావం : ఈ జగత్తు అసత్యమనీ, ఆధారమూ అధిపతి లేనిదనీ, కామవశంలో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరో కారణం లేదని వారు వాదిస్తారు.  


ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః |
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ‖ 9 ‖
భావం : అలాంటి నాస్తికులు ఆత్మను కోల్పోయిన అల్ప బుద్దులు ఘొర కృత్యాలు చేసే లోకకంటకులు, ప్రపంచ వినాశనానికి పుడతారు.  

కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తంతేఽశుచివ్రతాః ‖ 10 ‖
భావం : వాళ్లూ అంతూదరీ లేని కోరికలతో ఆడంబరం, గర్వం, దూరభిమానమనే దుర్గుణాలతో, అవివేకం వల్ల దుష్ప్రభాలతో దూరచారులై తిరుగుతారు. 

చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః |
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ‖ 11 ‖
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |
ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్ ‖ 12 ‖
భావం : వాళ్లు మృతిచెందే వరకు వుండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించడమే పరమవధిగా భావించి, అంతకు మించిందేది లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకొని కామక్రోధాలకు వశూలై విషయ సుఖాలను అనుభవించడం కోసం అక్రమ ధనార్జనకు పునుకుంటారు. 

16వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 16th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

Post a Comment

Popular Posts