Drop Down Menus

Bhagavad Gita 15th Chapter 11-20 Slokas and Meaning in Telugu | భగవద్గీత 15వ అధ్యాయం 11-20 శ్లోకాల భావాలు


శ్రీమద్ భగవద్ గీత పన్చదశోఽధ్యాయః
అథ పంచదశోఽధ్యాయః |

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః ‖ 11 ‖


భావం : ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మ సమస్కారం లేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ‖ 12 ‖
భావం : సూర్యుడిలో వుండి జగత్తునంతటిని ప్రకాశింపజేసె తేజస్సు, చంద్రుడిలో, అగ్నిలో ఉండే తేజస్సు నాదే అని తెలుసుకో. 


గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ‖ 13 ‖
భావం : నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలను ధరిస్తున్నాను. అమృత మాయుడైన చంద్రుడిగా సమస్త నస్యాలను పోషిస్తున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ‖ 14 ‖
భావం : వైశ్వానరుడు అనే జరరాగ్ని రూపంతో సకల ప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణపాన వాయువులతో కలిసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.  

సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ|
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ‖ 15 ‖
భావం : సర్వప్రాణుల హృదయాలలో వున్న నావల్లనే జ్ఞాపకం. జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదలన్నీంటి వల్ల తెలుసుకోవలసి నటువంటి వాడిని నేనే. వేదాంతులకు కర్తనూ, వేదాలనూ ఎరిగిన వాణ్ణి నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ‖ 16 ‖
భావం : ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీఇద్దరు పురుషులు ఉన్నారు. నశించే సమస్త ప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ, మార్పు లేని జీవుడిని అక్షరుడనీ అంటారు.  
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ‖  17 ‖
భావం : ఈ ఉభయల కంటే ఉత్తముడు, నాశనం లేనివాడు ఈశ్వరుడిగా మూడు లోకలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ.  

యస్మాత్క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః |
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ‖ 18 ‖
భావం : నేనే క్షరుడని మించిన వాడిని, అక్షరుడి కంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ది పొందాను. 

యో మామేవమసంమూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ‖ 19 ‖
భావం : అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునే వాడు సర్వజ్ఞుడు అన్నీ విధాలా నన్నే ఆరాధిస్తాడు. 

ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత ‖ 20 ‖
భావం : అర్జునా! అతి రహస్యమైనా ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్న వాడు బుద్దిమంతుడూ, కృతార్ధూడూ అవుతాడు.  

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
పురుషోత్తమయోగో నామ పంచదశోఽధ్యాయః ‖15 ‖

15వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 15th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.