Bhagavad Gita 17th Chapter 15-28 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA SAPTADAŚOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత సప్తదశోఽధ్యాయః
atha saptadaśoadhyāyaḥ |
అథ సప్తదశోఽధ్యాయః |

anudvegakaraṃ vākyaṃ satyaṃ priyahitaṃ cha yat |
svādhyāyābhyasanaṃ chaiva vāṅmayaṃ tapa uchyate ‖ 15 ‖

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ‖ 15 ‖


భావం : ఇతరులకి బాధ కలిగించకుండా సత్యం, ప్రియం, హితం అయిన సంభాషణ సాగించడం వేదధ్యయనం చేయడం వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు.  

manaḥ prasādaḥ saumyatvaṃ maunamātmavinigrahaḥ |
bhāvasaṃśuddhirityetattapo mānasamuchyate ‖ 16 ‖

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |

భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ‖ 16 ‖

భావం : మనస్సును నిర్మలంగా వుంచుకోవడం, మౌనం వహించడం, శాంత స్వభావమూ, ఆత్మ నిగ్రహమూ అంతఃకరణ శుద్ది కలిగి  ఉండడం - మనస్సు తో చేసే తపస్సు అంటారు.  

śraddhayā parayā taptaṃ tapastattrividhaṃ naraiḥ |
aphalākāṅkśhibhiryuktaiḥ sāttvikaṃ parichakśhate ‖ 17 ‖

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః |

అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ‖ 17 ‖

భావం : నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్లు పరమశ్రద్దతో ఫలాపేక్ష లేకుండా మూడు విధాలైన ఈ తపస్సు చేసే అది సాత్త్వికం చెబుతారు. 
satkāramānapūjārthaṃ tapo dambhena chaiva yat |
kriyate tadiha proktaṃ rājasaṃ chalamadhruvam ‖ 18 ‖

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ |

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ‖ 18 ‖

భావం : సత్కారం, సన్మానం, పూజలు, పొందడం కోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం, ఆనిశ్చితం, అలాంటిది రాజసమంటారు. 

mūḍhagrāheṇātmano yatpīḍayā kriyate tapaḥ |
parasyotsādanārthaṃ vā tattāmasamudāhṛtam ‖ 19 ‖

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః |

పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ‖ 19 ‖
భావం : మొండి పట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లు కాని, ఇతరులకు హాని తలపెట్టి కాని చేసే తపస్సు తామస మవుతుంది. 

dātavyamiti yaddānaṃ dīyateanupakāriṇe |
deśe kāle cha pātre cha taddānaṃ sāttvikaṃ smṛtam ‖ 20 ‖

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే |

దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ‖ 20 ‖

భావం : దానం చేయడం కర్తవ్యంగా భావించి, పుణ్యక్షేత్రాలలో పర్వదినాలలో యోగ్యతను గమనించి, ప్రత్యుపకారం చేయలేని వాళ్లకు చేసే దానమే సాత్త్వికం. 

yattu prattyupakārārthaṃ phalamuddiśya vā punaḥ |
dīyate cha parikliśhṭaṃ taddānaṃ rājasaṃ smṛtam ‖ 21 ‖

యత్తు ప్రత్త్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |

దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ‖ 21 ‖

భావం : ప్రత్యుపకారం పొందాలనే వుద్దేశ్యంతో కాని, ప్రతి ఫలాన్ని ఆశించి కాని, మనసులో బాధపడుతూ కాని చేసే దానం రాజసం. 

adeśakāle yaddānamapātrebhyaścha dīyate |
asatkṛtamavaGYātaṃ tattāmasamudāhṛtam ‖ 22 ‖

అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే |

అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ‖ 22 ‖

భావం : అనువు గాని చోట ఆకాలంలో ఆపాత్రుడికి ఆగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానం తామసం.  

oṃ tatsaditi nirdeśo brahmaṇastrividhaḥ smṛtaḥ |
brāhmaṇāstena vedāścha yaGYāścha vihitāḥ purā ‖ 23 ‖

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః |

బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ‖ 23 ‖

భావం : పరబ్రహ్మకు ఓం తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు, సృష్టించబడ్డాయి.  

tasmādomityudāhṛtya yaGYadānatapaḥkriyāḥ |
pravartante vidhānoktāḥ satataṃ brahmavādinām ‖ 24 ‖

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |

ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ‖ 24 ‖

భావం : అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగా చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడు "ఓమ్" అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు.

tadityanabhisandhāya phalaṃ yaGYatapaḥkriyāḥ |
dānakriyāścha vividhāḥ kriyante mokśhakāṅkśhibhiḥ ‖ 25 ‖

తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |

దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ‖ 25 ‖

భావం : మోక్షాన్ని కోరేవాళ్లు ఫలాపేక్ష లేకుండా పలు విధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సుల వంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్ధన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు 

sadbhāve sādhubhāve cha sadityetatprayujyate |
praśaste karmaṇi tathā sachChabdaḥ pārtha yujyate ‖ 26 ‖


సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే |

ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ‖ 26 ‖
భావం : పార్ధా! ఉనికి, ఉత్తమం ఈ రెండు అర్ధాలతో సత్ అనే పదాన్ని వాడుతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్ శబ్దాన్ని ఉపయోగిస్తారు. 

yaGYe tapasi dāne cha sthitiḥ saditi chochyate |
karma chaiva tadarthīyaṃ sadityevābhidhīyate ‖ 27 ‖

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |

కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ‖ 27 ‖

భావం : యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్టకు కూడా సత్ శబ్ధం సంకేతం. ఈశ్వరుడికి ప్రీతికి చేసే కర్మలన్నీటిని సత్ అనే చెబుతారు. aśraddhayā hutaṃ dattaṃ tapastaptaṃ kṛtaṃ cha yat |
asadityuchyate pārtha na cha tatprepya no iha ‖ 28 ‖

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేప్య నో ఇహ ‖ 28 ‖

భావం : పార్ధా! హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు వీటికి అశ్రద్దగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటి వల్ల ఇహలోకంలో కాని పరలోకంలోకాని ఫలితమేమి ఉండదు.

oṃ tatsaditi śrīmadbhagavadgītāsūpaniśhatsu brahmavidyāyāṃ yogaśāstre śrīkṛśhṇārjunasaṃvāde

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
śraddhātrayavibhāgayogo nāma saptadaśoadhyāyaḥ ‖17 ‖

శ్రద్ధాత్రయవిభాగయోగో నామ సప్తదశోఽధ్యాయః ‖17 ‖
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 17th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments