Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 17th Chapter 1-14 Slokas and Meaning in Telugu | భగవద్గీత 17వ అధ్యాయం 01-14 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత సప్తదశోఽధ్యాయః
అథ సప్తదశోఽధ్యాయః |

అర్జున ఉవాచ |
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ‖ 1 ‖


భావం : అర్జునుడు: కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికి శ్రద్ధ పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది ? సాత్వికమా ? రాజసమా ? తామసమా ?
   
శ్రీభగవానువాచ |
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ‖ 2 ‖
భావం : శ్రీ భగవానుడు: ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద సాత్త్వికీమని, రాజసమని, తమసమని మూడు విధాలు. దాన్ని వివరస్తాను విను.

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ‖ 3 ‖
భావం : అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద ఉంటుందో అలాంటి వాడే అవుతాడు. 


యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ‖ 4 ‖
భావం : సాత్త్వికులు దేవతలనూ, రాజసులూ యక్షరాక్షసులను, తామసులు భూతప్రేతాలను పూజిస్తారు. 

అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః |
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ‖ 5 ‖
కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాంతఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్ ‖ 6 ‖
భావం : శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ ఆవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా, అంతరాత్మగా వున్న నన్ను కూడా పీడించే ఆడంబరులూ, అహంకారులూ, కామబలగర్వితులూ, అసుర స్వభావం కలిగిన వాళ్లని తెలుసుకో. 

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ‖ 7 ‖
భావం : అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలూ. అలాగే యజ్ఞం, తపస్సు, జ్ఞానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను. 


ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ‖ 8 ‖
భావం : సాత్త్వికులు ప్రీతి కలిగించే ఆహార పదార్ధలు ఇవి - ఆయుర్ధాయం , బుద్ది బలం, శరీర బలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం వీటిని వృద్ది చేస్తూ రసమూ, చమురు కలిగి చాలా కాలం ఆకలిని అణిచిపెట్టి, మనస్సుకి ఆహ్లాదం కలుగజేసేవి. 

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ‖ 9 ‖
భావం : బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారం కలిగి చమురు లేకుండా వెర్రి దాహం పుట్టించే ఆహార పదార్ధాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ మనస్సుకు వ్యాకులత, వ్యాధులు కలుగజేస్తాయి.

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ‖ 10 ‖
భావం : తామసులకు చల్లబడిపోయింది, సారం లేనిది, వాసన కొడుతున్నది, చలిది ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం అంటే ఇష్టం. 

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ‖ 11 ‖
భావం : తమ కర్తవ్యంగా విశ్వసించే, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్త్విక యజ్ఞమంటారు. 

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ‖ 12 ‖
భావం : అర్జునా! ఫలాన్ని ఆశించి కాని, ఆడంబరం కోసం కాని చేసే యజ్ఞం రాజసయజ్ఞం అని గ్రహించు. 

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ‖ 13 ‖
భావం : ఆశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్దతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమంటారు.  

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ‖ 14 ‖
భావం : దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను, పూజించడం పవిత్రంగా ఉండడం కల్లా కపటం లేకుండా ప్రవర్తించడం బ్రహ్మ చర్య దీక్షనూ అహింసా వ్రతాన్ని అవలంబించడం - వీటిలో శరీరంతో చేసే తపస్సని చెబుతారు.    


17వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 17th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు