Drop Down Menus

Bhagavad Gita 2nd Chapter 61-72 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


శ్రీమద్ భగవద్ గీత ద్వితీయోఽధ్యాయః
అథ ద్వితీయోఽధ్యాయః |

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖ 61 ‖

భావం : యోగాసాదకుడు ఇంద్రియా లన్నింటిని వశపరచుకొని నా మీదే మనసు వుండాలి. అలాంటివాది ప్రజ్ఞ సుస్థిరమవుతుంది.
ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ‖ 62 ‖
క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ‖ 63 ‖
భావం : ఎప్పుడు శబ్ధది విషయాల గురించి ఆలోచించేవాడికి వాటిమీద బాగా ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి.  కొరికలు కోపం కలుగజేస్తాయి. కోపం వల్లన అవివేకం కలుగుతుంది. ఆవివేకం వల్ల మరపు , మరపు వల్ల బుద్ది నశించశడం బుద్ది నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది.

రాగద్వేషవిముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ‖ 64 ‖
భావం : మనసుని నిగ్రహించుకొని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో వున్న ఇంద్రియల వల్ల విషయ సుఖాలు అనుభవించే వాడు మనశ్శాంతిని పొందుతాడు.

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ‖ 65 ‖
భావం : మనస్సు నిర్మాలమైతే సమస్త దుఃఖాలు సుమసిపోతాయి. మనస్సు నిర్మలంగా వున్నవాడి ప్రజ్ఞకు చలనం లేదు.

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |
న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్ ‖ 66 ‖
భావం : మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కానీ ఆత్మ చింతన కానీ అలవడవు. అలాంటివాడికి మనశ్శాంతి లేని వాడికి సుఖం శూన్యం. 

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ‖ 67 ‖
భావం : చుక్కలేని నాపను సుడిగాలి దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుని బుద్దిని పాడు చేస్తుంది.

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖ 68 ‖
భావం : అర్జునా! అందువల్ల విషయ సుఖల వైపుకు వెళ్ళకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి స్థిరమైన బుద్ది కలుగుతుంది. వాడే స్థితప్రజ్ఞడు.


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ‖ 69 ‖
భావం : ఆత్మనుభూతి లేని అని ప్రాణులకు రాత్రి తోచే సమాయంలో మనో నిగ్రహం కలిగిన ముని మేలుకొని వుంటాడు. విషయాలపట్ల ఆసక్తితో సర్వప్రాణులూ మేలుకువగా వునపుడు ఆత్మ నిష్ట కలిగిన యోగికి రాత్రి అవుతుంది.

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ ‖ 70 ‖
భావం : నిరంతరం నిండుతున్నప్పటికి చలించకుండా నిచ్చిన సముద్రంలోని నది జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామలన్నీ లీనమై అణగిపోతాయో వాడు శాంతిని పొందుతాడు. భౌతిక సుఖలకు బానిస అయినవాడికి మోక్షం లేదు.

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ‖ 71 ‖
భావం : కొరికాలన్నీటిని విడిచిపెట్టి ఆశ, అహంకారం , మమకారం లేకుండా మెలిగే వాడు పరమ శాంతిని పొందుతాడు.

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ‖ 72 ‖
భావం : అర్జునా! ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి ప్రపంచవిషయాలమీదకు మరలా మళ్లదు. జీవితం చివరి ఘట్టంలో అయిన అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సాంఖ్యయోగో నామ ద్వితీయోఽధ్యాయః ‖2 ||






2వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 


bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 2nd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. చాల బాగ వివరించినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  2. Revision chesukuntoo mananam cheyadalasina vaarki hand in pocket
    Super technology.

    ReplyDelete

Post a Comment