Bhagavad Gita 6th Chapter 1-12 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


ŚRĪMAD BHAGAVAD GĪTA ŚHAŚHṬHOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత షష్ఠోఽధ్యాయః

atha śhaśhṭhoadhyāyaḥ |
అథ షష్ఠోఽధ్యాయః |

śrībhagavānuvācha |
శ్రీభగవానువాచ |
anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karoti yaḥ |
sa saṃnyāsī cha yogī cha na niragnirna chākriyaḥ ‖ 1 ‖

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |

స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ‖ 1 ‖

భావం : శ్రీ భగవానుడు: కర్మఫలాపేక్ష లేకుండా కర్తవ్యలను ఆచరించే వాడే నిజమైన సన్యాసి. యోగి అవుతాడు అంతే కానీ అగ్ని హోత్రది కర్మ మానివేసినంత మాత్రాన కాదు. 

yaṃ saṃnyāsamiti prāhuryogaṃ taṃ viddhi pāṇḍava |
na hyasaṃnyastasaṅkalpo yogī bhavati kaśchana ‖ 2 ‖
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |

న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన ‖ 2 ‖

భావం : పాండునందనా! సన్యాసమూ, కర్మ యోగమూ , ఒకటే అని తెలుసుకో. ఎందువల్ల నంటే సంకల్పాలను వదలిపెట్టిని వాడేవాడూ యోగి కాలేడు.    

ārurukśhormuneryogaṃ karma kāraṇamuchyate |
yogārūḍhasya tasyaiva śamaḥ kāraṇamuchyate ‖ 3 ‖

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ‖ 3 ‖

భావం : ధ్యానయోగాన్ని సాధించినదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. యోగసిద్దిపొందినవాడికి కర్మ త్యాగమే సాధనం. 

yadā hi nendriyārtheśhu na karmasvanuśhajjate |
sarvasaṅkalpasaṃnyāsī yogārūḍhastadochyate ‖ 4 ‖

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |

సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ‖ 4 ‖
భావం : ఇంద్రియ విషయాలమీదకాని, కర్మలమీదకాని, ఆసక్తి లేకుండా సంకాల్పలన్ని విడిచి పెట్టినవాడిని యోగరుఢుడంటారు. 

uddharedātmanātmānaṃ nātmānamavasādayet |
ātmaiva hyātmano bandhurātmaiva ripurātmanaḥ ‖ 5 ‖

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ‖ 5 ‖

భావం : తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉద్దరించుకోవాలి. తన ఆత్మను అధోగతి  పాలుచేసుకోకుడదు. 

bandhurātmātmanastasya yenātmaivātmanā jitaḥ |
anātmanastu śatrutve vartetātmaiva śatruvat ‖ 6 ‖

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ‖ 6 ‖

భావం : మనస్సును స్వాధీన పరచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించడానికి మనస్సే ప్రబల శత్రువులాగ ప్రవర్తిస్తుంది. 

jitātmanaḥ praśāntasya paramātmā samāhitaḥ |
śītośhṇasukhaduḥkheśhu tathā mānāpamānayoḥ ‖ 7 ‖

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ‖ 7 ‖

భావం : ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణలు, సుఖదుఃఖాలు మానావమానాల పట్ల సమభావం కలిగి ఉంటాడు.  

GYānaviGYānatṛptātmā kūṭastho vijitendriyaḥ |
yukta ityuchyate yogī samalośhṭāśmakāñchanaḥ ‖ 8 ‖

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ‖ 8 ‖

భావం : శాస్త్రజ్ఞానంవల్ల, అనుభవజ్ఞానంవల్ల సంతృప్తి చెందిని వాడు, నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టినీ రాతినీ బంగారాన్ని సమదృష్టితో చూసేవాడు యోగి అని చెప్పబడతాడు. 
suhṛnmitrāryudāsīnamadhyasthadveśhyabandhuśhu |
sādhuśhvapi cha pāpeśhu samabuddhirviśiśhyate ‖ 9 ‖

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ‖ 9 ‖

భావం : శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు విరోధి బంధువు, సాధువు , దురాచారి - వీళ్ళందరిపట్ల సమబుద్ది కలిగినవాడే సర్వోత్తముడు.  

yogī yuñjīta satatamātmānaṃ rahasi sthitaḥ |
ekākī yatachittātmā nirāśīraparigrahaḥ ‖ 10 ‖

యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః |

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ‖ 10 ‖

భావం : యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా వుండి, ఆశలను వదిలి, ఇంద్రియాలనూ, మనస్సునూ వశపరచుకొని, ఏమి పరిగ్రహించకుండా చిత్తన్ని ఆత్మమీదే నిరంతరం నిలపాలి. 

śuchau deśe pratiśhṭhāpya sthiramāsanamātmanaḥ |
nātyuchChritaṃ nātinīchaṃ chailājinakuśottaram ‖ 11 ‖

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ‖ 11 ‖

భావం : ఎక్కువ ఎత్తుపల్లమూ కాని పరిశుద్దమైన ప్రదేశంలో దర్బాలు పరచి, దాని మీద చర్మమూ , ఆ పైన వస్త్రమూ వేసి స్థిరమైన అసనాన్ని ఏర్పరచుకోవాలి. 

tatraikāgraṃ manaḥ kṛtvā yatachittendriyakriyāḥ |
upaviśyāsane yuñjyādyogamātmaviśuddhaye ‖ 12 ‖

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః |

ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే ‖ 12 ‖

భావం : ఆ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలనూ, మనస్సునూ స్వాధీన పరచుకొని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ది కోసం యోగాభ్యాసం చేయాలి. 
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 6th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments