Bhagavad Gita 8th Chapter 1-9 Slokas and Meaning in Telugu |సరళమైన తెలుగు లో భగవద్గీత  | Bhagavad Gita Audio Download


ŚRĪMAD BHAGAVAD GĪTA AŚHṬAMOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత అష్టమోఽధ్యాయః
atha aśhṭamoadhyāyaḥ |
అథ అష్టమోఽధ్యాయః |

arjuna uvācha |
అర్జున ఉవాచ |
kiṃ tadbrahma kimadhyātmaṃ kiṃ karma puruśhottama |
adhibhūtaṃ cha kiṃ proktamadhidaivaṃ kimuchyate ‖ 1 ‖

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |

అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ‖ 1 ‖


భావం : అర్జునుడు: పురుషోత్తమ! బ్రహ్మమంటే ఏమిటి ? ఆధ్యాత్మమంటే ఏమిటి ? కర్మ అంటే ఏమిటి ? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి ? 

adhiyaGYaḥ kathaṃ koatra deheasminmadhusūdana |
prayāṇakāle cha kathaṃ GYeyoasi niyatātmabhiḥ ‖ 2 ‖

అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన |

ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ‖ 2 ‖

భావం : మధుసూధన! ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు? ఎలా వుంటాడు ? మనో నిగ్రహం కలవాళ్ళు మరణసమయంలో నిన్నేలా తెలుసుకోగలుగుతారు.  

śrībhagavānuvācha |
శ్రీభగవానువాచ |
akśharaṃ brahma paramaṃ svabhāvoadhyātmamuchyate |
bhūtabhāvodbhavakaro visargaḥ karmasaṃGYitaḥ ‖ 3 ‖

అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే |

భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ‖ 3 ‖

భావం : శ్రీ భగవానుడు : సర్వోత్తమం, శాశ్వతామూ అయినా పరమాత్మనే బ్రహ్మమనీ ఆత్మ పరమాత్మతత్వాన్నీ యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. 

adhibhūtaṃ kśharo bhāvaḥ puruśhaśchādhidaivatam |
adhiyaGYoahamevātra dehe dehabhṛtāṃ vara ‖ 4 ‖

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |

అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ‖ 4 ‖
భావం :  ఈ శరీరంలాంటి నశించే స్వభావం కలిగిన పదార్ధలను అధిభూత మంటారు. పురుషుడే అధిదైవం ఈ దేహంలో అంతర్యామి రూపంలో వుండే అధియ జ్ఞాన్ని నేనే. 

antakāle cha māmeva smaranmuktvā kalevaram |
yaḥ prayāti sa madbhāvaṃ yāti nāstyatra saṃśayaḥ ‖ 5 ‖

అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ |

యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ‖ 5 ‖

భావం : మరణసమయాలో నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా స్వరూపానే పొందుతాడు. ఇందులో సందేహమేమి లేదు. 

yaṃ yaṃ vāpi smaranbhāvaṃ tyajatyante kalevaram |
taṃ tamevaiti kaunteya sadā tadbhāvabhāvitaḥ ‖ 6 ‖

యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కలేవరమ్ |

తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ‖ 6 ‖

భావం : కౌంతేయా! అంత్యకాలంలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో, ఆ భావాలను తగిన స్థితినే పొందుతాడు.  tasmātsarveśhu kāleśhu māmanusmara yudhya cha |
mayyarpitamanobuddhirmāmevaiśhyasyasaṃśayam ‖ 7 ‖

తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |

మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయమ్ ‖ 7 ‖

భావం : అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్దం చేయీ.మనస్సునూ, బుద్దినీ నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతాడు.

abhyāsayogayuktena chetasā nānyagāminā |
paramaṃ puruśhaṃ divyaṃ yāti pārthānuchintayan ‖ 8 ‖

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |

పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ‖ 8 ‖

భావం : పార్ధ! మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించే వాడు ఆయననే పొందగలుగుతాడు. 

kaviṃ purāṇamanuśāsitāramaṇoraṇīyaṃsamanusmaredyaḥ|
sarvasya dhātāramachintyarūpamādityavarṇaṃ tamasaḥ parastāt ‖ 9 ‖

కవిం పురాణమనుశాసితారమణోరణీయంసమనుస్మరేద్యః|

సర్వస్య ధాతారమచింత్యరూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ‖ 9 ‖

భావం : సర్వమూ తెలిసినవాడు, సనాతనుడు, సకలలోకానూ శాసించేవాడు. సూక్ష్మతి సుక్ష్మమైన వాడు, సూర్యుడు వంటి కాంతి కలిగిన వాడు, అఖిల జగత్తుకు ఆధారమైనవాడు, ఆలోచించడానికి శక్యంకాని రూపం కలిగిన వాడు అజ్ఞానంధ కారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా పుంచుకొని భక్తిభావంతో,యోగబలంతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును బాగా నిలిపి ధ్యానించే వాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు.
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 8th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments