Drop Down Menus

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే సకల శుభాలు | Hanuman Tamalapaku Pooja

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు:
ఆంజనేయుడు సీతారాములవారికి ప్రియమైన భక్తుడు. అలాంటి స్వామివారిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
హనుమంతునికి తమలపాకుల పూజ చేసేందుకు ఓ కారణం ఉంది. అందేటంటే.. ఓసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామునిని స్వామీ ఏమిటది..? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది..? అని అడిగారు.

అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి బాగా ఎదుగుతారు. అలానే వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి పండ్లు, తమలపాకులు దక్షిణ భాగంలో దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది.

1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.
3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.
5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.
6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.
7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.
10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.
11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హర ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .
Famous Posts:







ఆంజనేయ స్వామి, తమలపాకు, హనుమాన్ చాలీసా, Hanuman laksha Tamalapakula puja, anjaneyaswamy pooja, lord hanuman images, hanuman chalisa, hanuman story in telugu
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.