1. ఇంటి పై ఓంకార చిహ్నముండాలి.
2. ఇంటి పై కాషాయ ధ్వజం ఎగరాలి.
3. ఇంటి వాకిట్లో తులసి ఉండి రోజు సేవించాలి.
4. ఇంట్లో దేవతల, మహనీయుల చిత్ర పటములు మాత్రమే ఉండాలి.
5, ఇంటి ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, ముగ్గులు వ్యవస్థితంగా ఉండాలి.
Also Read : హిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు
6. ఇంటి లో శుద్ధ త్రాగునీటి వ్యవస్థ, మురుగునీరు పోవుటకు వ్యవస్థ పుండాలి.
7. ఇంటి ఆవరణ లో ఆకు కూరలు, కూరగాయలు మరియు వేప వంటి నీడ మొక్కల పెంపకము జరగాలి.
8. ఇంటి వారంతా ప్రాతః కాలం లేచుట, వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని వ్యాయామం, యోగ చేయాలి. సూర్యోదయం అయిన తరువాత సూర్యునికి నమస్కరించడం. పిల్లలు ఉదయం 4 గంటలకు లేచి 2 గంటలు పాఠ్య పుస్తకాలు చదువు కుంటే బాగా జ్ఞాపకముంటుంది ఇందుకోసం రాత్రి త్వరగా పడుకోవాలి. పెద్దలు అచరణ ద్వారా పిల్లలకు ఈ విషయాలు నేర్పుట.
9. ప్రతి నిత్యము స్నానము, కుంకుమ ధారణ, దేవునికి నమస్కరించుట, కలిగి ప్రార్ధించుట, అందరి క్షేమము, దేశ క్షేమము కాంక్షించుట.
10. కుటుంబ సభ్యులు నియమితంగా మందిర దర్శనము చేసుకొనుట.
Also Read : ఉదయం నిద్రలేవగానే వేటిని చూడకూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?
11. పిన్నలు తమ ఇళ్లలోన పెద్దలకు, తల్లి దండ్రులకు (పండుగ ఇతర ప్రత్యేక సందర్భాలలో) పాదాభివందనం చేయుట, ఆశీర్వచనం తీసుకొనుట.
12. భోజనం ముందు భగవంతుని స్మరించి భుజించుట.
13. ఇంటి వారంతా కనీసం ఒక పూట కలిసి భుజించుట.
14. ఇంటి వారంతా ఆత్మీయంగా కలిసి మెలసి ఉండటం, విమర్శలు మానుట, పరస్పర గౌరవం, పరామర్శలతో జీవించుట.
15. ఇంట్లో అతిధి మర్యాదలు పాటించుట.
Also Read : పిల్లల కోసం శ్లోకాలు - స్తోత్రాలు
16. కుటుంబ వాతావరణం సంస్కారప్రదం గా ఉండటం, అరుపులు కేకలు కాక పరస్పరము ప్రేమ పూర్వకముగా సంభాషించుట, అనుభవాలు పంచుకొనుట.
17. ఇరుగు పొరుగు వారితో సత్సంబధము కలిగి ఉండటము.
18. ఇంటి వారంతా సామాజిక హిందూ సమరసతను పాటించుట,
19. ఇంట్లో బాల బాలికలు, యువతి యువకులు విద్యార్జన చేయడం, గురుభక్తి కలిగి యుండి, సరస్వతి ప్రార్ధన చేయుట.
20. మాతృ భాషలు, సంస్కృతం అభ్యసించుట, మాట్లాడుట.
Also Read : గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే
21. ఇంటిలో సత్గ్రంథ శ్రవణం, ప్రవచనము పట్ల ఆసక్తి, ప్రతి హిందూ గృహంలో రామాయణ, మహాభారతం, భాగవతం, భగవద్గీత గ్రంథాలు ఉండడము
22. ఇంట్లో యోగి పత్రికల పఠనము, వార్తలు వినుటలో ఆసక్తి, మమ్మీ, డాడి, అంకుల్, ఆంటీ పదాలను వాడకుండుట.
23. భజన సమయంలో మొబైల్ ఫోన్లు వాడకుండుట, టెలివిజన్ వాడకుండుట, వారంలో ఒక రోజు దూరదర్శన్ చరవాణిలు వాడకుండా ఉండటము.
24. ఇంట్లో స్వదేశీ వస్తువులు వాడుట, విదేశీ వ్యామోహానికి దూరంగా ఉండటం, అనుకరణకు దూరంగా ఉండటము.
25. ఇంటి లో మిత వ్యయమును పాటించుట. పొదుపు చేయడం, ఖర్చు లేక్క వ్రాయుట. మాతృ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం, దేవ ఋణం తీర్చుకోగలగడం, పిల్లలకు దానమిచ్చే గుణం నేర్పడము.
Also Read : పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?
26. ధర్మ సేవా కార్యములు కోసం ఖర్చు చేయడము.
27. ఇంట్లో వారంతా పొగాకు, మధ్యపానము, జూదము, దుర్వ్యసనములకు దూరంగా ఉండుట.
28. తమ వీధి శుభ్రత, బాగోగులు పట్టించుకునుట.
29. ఇంటివారంతా సమాజ హిత కార్యములలో పాల్గొనుట.
30. సంఘ విద్రోహులు అదుపు చేయడం లో కర్తవ్యము పాటించుట.
Also Read : మణిద్వీప వర్ణన చదివినా విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి
31. అన్ని పండుగలను నిజమైన స్పూర్తితో భక్తిశ్రద్ధలతో జరుపు కొనుట. పుట్టిన రోజును మనదైన పద్ధతులలో దీపం వెలిగించి జరుపుకొనుట.
32. పెళ్లి వంటి శుభకార్యాలలో దుబారా ఆడంబరాలు లేకుండా చేసుకోనుట. సంస్కృతి ప్రతిబింబించే కార్యక్రమములు నీర్వహించుట.
33. మనదైన పంచాంగం ననుసరించి పండుగలు, మహాత్ముల జయంతిని, మన పుట్టిన రోజులు జరుపుకొనుట.
34. మన వేష భాషలందు భారతీయ సంస్కారం కలిగియుండుట.
35. అన్నింటిలో పరహితము, ధర్మహితము, దేవహితము, విశ్వహితములకు ప్రాధాన్యతనిచ్చుట
Also Read : నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి.?
36. ప్రతిఒక్కరూ సజ్జనుల తో స్నేహం చేయడం, సత్సంగములలో పాల్గొనడం, సాధకుడిగా జీవించడం. చివరగా,
37. చాణుక్యుడు గృహస్థాశ్రమం గురించి అర్థశాస్త్రంలో చెప్పిన క్రింది శ్లోకం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే!
*సానందంసదనం సుతాశ్చ సుధియః* *కాంతా ప్రియా భాషిణీ !*
*సన్మిత్రం సుధనం సయోషితిరతశ్చాజ్ఞాపరా సేవకాః |*
*ఆతిథ్యం శివపూజనం ప్రతి దినం మృష్టాన్న పానం గృహే*.
*సాధుః సంగముపాసతేహి సతతం ధన్యోగృహేభ్యో నమః* ||
Also Read : మీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి
భావము:
1. ఇల్లు ఆనందానికి నిలయం,
2. పిల్లలు బుద్ధి మంతులు,
3. ఇల్లాలు ప్రియ భాషిణి,
4 చక్కటి స్నేహితులున్నారు,
5. సత్సంపాదన,
6. పత్నితోనే శారీరక సంబంధం,
7. ఆజ్ఞను పాలించే సేవకులు,
8. అతిధులను పిలిచి ఆతిధ్యమివ్వడము,
9. ప్రతి రోజు దేవతార్చన,
10. ఇంటనే మృష్టాన్న భోజనము
11. సాధుసంతులు ఇంటికి నిత్యమూ రావడం.
Also Read : మరణం తరువాత ఏం జరుగుతుంది?
ఈ పై విషయాలను పాటిస్తే ఇల్లు స్వర్గ తుల్యమవుతుంది. ఒక దీపంతో మరియొక దీపం వెలిగించాలి. నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు .... ....హిందువుగా గర్వించు... హిందువుగా జీవించు...హిందూత్వం శ్వాసించు....
Famous Posts :
> అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
సనాతన ధర్మం, sanatana dharma book in telugu, sanatana meaning in telugu, sanatana dharma principles in telugu, sanatana dharma quotes in telugu, sanathana dharmam, dharmam meaning in telugu, dharmam ante emiti in telugu, sanathana dharmam in tamil, ధర్మం
Comments
Post a Comment