Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ ఈనెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. *** ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్ఎస్ఓ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల. ***కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌కు అనుమ‌తి. @.. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం..కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆఫ్‌లైన్ కౌంటర్లను మూసివేస్తున్నారు. ప్రతి భక్తుడు తప్పనిసరిగా వెబ్‌సైట్ ద్వారా ఏదైనా (ఉచిత దర్శనంతో సహా) ఆన్‌లైన్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలి. ఇప్పుడే బుక్ చేసుకోండి.***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

నవరాత్రి పూజ ఎవరు చేసుకోవాలి? Navaratri Pooja Vidhanam | Hindu Temple Guide

నవరాత్రి పూజ ఎవరుచేసుకోవాలి?

నవరాత్రి పూజ ఎవ్వరైనా చేయవచ్చు, శక్తి కొద్దీ ఎలా అయినా చేసుకోవచ్చు.

ఉదయాన్నే మీరు శుచిగా పూజ గది శుభ్రం చేసి కలశం పెట్టుకునే అలవాటు ఉంటే పెట్టుకోండి లేదంటే  ఒక పీట పైన అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, విగ్రహం ఉన్న వాళ్ళు రోజూ పసుపు నీటితో అభిషేకం చేసుకోవచ్చు, పాలు పంచామృతాలు  యధా శక్తి మీ ఇష్టం శ్రీ సూక్తం తెలిస్తే అది చదవండి లేదంటే ఆడియో పెట్టుకుని ఓం దుం దుర్గయై నమః అనుకుంటూ శ్రీ సూక్తం కానీ చండీ పారాయణ స్త్రోత్రలతో కానీ వింటూ నామ జపం చేస్తూ అభిషేకం చేయండి.. చక్కగా అలంకారం చేయండి మీకు ఉన్నది తృప్తిగా నైవేద్యం పెట్టండి లలితా సహస్ర నామంతో పారాయనఁ చేస్తూ కుంకుమ పూజ చేయండి. రెండు పూటలా దీపారాధన చేసుకోండి..

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.. 

ఇంక చేయగలిగిన వారు చేయడం తెలిసిన వారు పీఠం ,కలశస్తాపన , విగ్రహం, అభిషేకం, చండీ పారాయనఁ, దేవీ భాగవతం పారాయణ, హోమం, అన్నశాంతి, ఆహార నియమాలు, బ్రహ్మ చర్యం, దీపాల కొలువు, భూ శయనం, బొమ్మల కొలువు, నవధాన్య ఆరాధన . శ్రీచక్రం కుంకుమ పూజ ,నవావర్ణ పూజ , ఇలా యధా శక్తి జరుపుకుంటారు  

ఇలా చేస్తేనే ఆ తల్లి కరునిస్తుంది అని లేదు ఎలా చేసిన భక్తిగా చేస్తే ఆ తల్లి కరునిస్తుంది భక్తి ప్రధానం మరి కొందరు అంత హడావిడిగా ఎందుకు చేస్తారు అంటే అది వారి వారి తృప్తి కోసం ఎంత సేవచేసిన తనివి తీరని ఆనందం ఆ తల్లిని ఎంతగా ఆరాధిస్తున్నామో కూడా తెలియని భక్తి పరవశం ఉపవాసం చేయమని నేను ఎవరికీ చెప్పను కానీ నేను విజయదశమి రోజు ఆహారం తీసుకుంటాను ,జావ లాంటి పదార్థాలు తీసుకుంటాను, ఏ సమయంలో అయినా కుంకుమార్చన లో శ్రీచక్ర పూజ అమ్మవారి పారాయణ, అభిషేకం అలంకారం పూలు కట్టుకోవడం అకండ దీపం, దీప దుర్గా ఉపాసన.. నేల పైన నిద్రపోవడం కానీ ఎప్పుడు పడుకుంటాను ఎప్పుడు లేస్తాను కూడా గుర్తు ఉండదు ఒక గంట నిద్రపోయిన వెంటనే స్నానం చేసి మళ్ళీ పూజ గదిలోనే ఉంటాను. అదో లోకం కాకపోతే మీ అందరి కోసం ఈ గ్రూవ్ వల్ల కాంటాక్ట్ లో ఉండి పూజ వివరాలు మీకు చెప్తూ ఉంటాను. అంత మొరటుగా చేయమని చెప్పను ఎవరి ఆసక్తి వారిది.

Also Readపూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు ఉండవచ్చా?

ఇంట్లో సూతకము ఉన్నవారూ పీఠం పెట్టి వ్రతంగా చేయాకుడదు కానీ దీపారాధన చేసి సహాస్ర నామం పారాయణ చేసుకోవచ్చు పానకం నైవేద్యం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టకూడదు గుడి కి వెళ్లిదర్శనం చేసుకోవచ్చు.

ఎవరికి తెలిసిన విధంగా వారు ప్రశాంతంగా తృప్తిగా చేసుకోండి.

 కానీ ఈ కరోన టైం లో ఆర్ధికంగా దెబ్బతిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి అమ్మవారి పెరు చెప్పి మీకు తెలిసిన మీకు దగ్గరలో ఉన్న బీదవాళ్ళకు బియ్యం బెల్లం నైయ్యి ,సరుకులు లాంటివి ఇస్తే పండగ రోజు వారి ఇంట్లో కూడా పరమాన్నం వండుకుంటారు. డబ్బుగా ఎవరికి ఇవ్వకండి చూశారుగా డ్రింక్ షాప్ ల ముందు ఎలా నిల్చుని తాగేసారో...

Also Readనవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ? 

కుమారి పూజ 9 సం లోపు పిల్లలకు చేయాలి, పూజలా కాకపోయినా ఆ వయసు పిల్లలకు అమ్మవారిగా భావించి గాజులు ఇవ్వండి స్వీట్స్ పెట్టండి వారికి సంతోషం కలగాలి..అది మీకు శుభం మీ ఇంట్లో ఆ వయసు పిల్లలు ఉన్నా వారికి చేయవచ్చు..

Famous Posts:

వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  

శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 


యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి


బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 


గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా ?


ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్ 


మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం 

Navratri Puja, navratri ki puja vidhi, navratri pooja vidhi 2020, navratri puja vidhi, navratri puja vidhi at home, simple navratri puja at home in telugu, navratri puja samagri, navratri ki puja, dasara, ammavaru, durga mata.

Comments

Popular Posts