Tiruppavai Pashuram Day 6 in Telugu - Meaning | తిరుప్పావై ఆరవ రోజు పాశురం - పద్యం మరియు భావము

Thiruppavai 6 Pasuram Lyrics in Telugu

6.పాశురము

పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్ వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుఱ్ఱు కళ్ళచ్చగడం కలక్కయ క్కాలోచ్చి వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న విత్తినై ఉళ్ళత్తుక్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్ మెళ్ళ వెళున్దు ఆయన పేరరవమ్ఉ ళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

భావము: అందరికంటె ముందుగనే మేల్కొన్నవారు, ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుచున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) శంఖధ్వనిని నీవు విన లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు యైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు.

ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ! అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవుమాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా ! రమ్ము! రమ్ము! మాతో గూడి వ్రతము చేయుము.

1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:

తిరుప్పావై 1వ పాశురం

తిరుప్పావై 2వ పాశురం

తిరుప్పావై 3వ పాశురం

తిరుప్పావై 4వ పాశురం

తిరుప్పావై 5వ పాశురం

తిరుప్పావై 6వ పాశురం

తిరుప్పావై 7వ పాశురం

తిరుప్పావై 8వ పాశురం

తిరుప్పావై 9వ పాశురం

తిరుప్పావై 10వ పాశురం

తిరుప్పావై 11వ పాశురం

తిరుప్పావై 12వ పాశురం

తిరుప్పావై 13వ పాశురం

తిరుప్పావై 14వ పాశురం

తిరుప్పావై 15వ పాశురం

తిరుప్పావై 16వ పాశురం

తిరుప్పావై 17వ పాశురం

తిరుప్పావై 18వ పాశురం

తిరుప్పావై 19వ పాశురం

తిరుప్పావై 20వ పాశురం

తిరుప్పావై 21వ పాశురం

తిరుప్పావై 22వ పాశురం

తిరుప్పావై 23వ పాశురం

తిరుప్పావై 24వ పాశురం

తిరుప్పావై 25వ పాశురం

తిరుప్పావై 26వ పాశురం

తిరుప్పావై 27వ పాశురం

తిరుప్పావై 28వ పాశురం

తిరుప్పావై 29వ పాశురం

తిరుప్పావై 30వ పాశురం

Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu , తిరుప్పావై 6వ పాశురం

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS