Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

తొమ్మిదిరోజుల పాటు పూజ చేయలేని వారికి ప్రత్యామ్నాయం త్రిరాత్ర వ్రతం అంటారు? దాని విశిష్టత ఏమిటి? Devi Triratra Vratam Archives

ఋషిపీఠం తొమ్మిదిరోజుల పాటు పూజ చేయలేని వారికి ప్రత్యామ్నాయం త్రిరాత్ర వ్రతం అంటారు? దాని విశిష్టత ఏమిటి?

శరన్నవరాత్రుల గురించి చెప్తూ పాడ్యమినుంచి నవమి వరకు పూజ చెప్పారు. అలా చేయలేని వారు తృతీయం నుంచి చేయవచ్చు అన్నారు. అప్పుడు అది సప్తరాత్ర వ్రతం అవుతున్నది. అలాగూ చేయవచ్చు.

లేని పక్షంలో మరొకటి చెప్పారు. పంచమినుంచి ప్రారంభం చేయమన్నారు. అప్పుడు సరిగ్గా పంచరాత్రములు వస్తాయి. అలాకూడా చేయలేనటువంటి వాళ్ళు సప్తమినుంచి మొదలుపెట్టుకొని చేయమని చెప్పారు. సప్తమి, అష్టమి, నవమి అవుతున్నది.

ఇలా త్రిరాత్ర వ్రతం. ఇదైనా చేసి తీరాలి. అయితే త్రిరాత్ర వ్రతం కూడా చేయలేనటువంటి వారు నవమినాడైనా పూజచేయాలి. దశమి వచ్చింది కదా అని నవమి వరకు చేయడం మానివేసి ఒక్క దశమి చేస్తే మాత్రం నిష్ఫలమే. అది శారదారాధన అవదు. అనగా శరన్నవరాత్రి పూజ అవదు. అందుకు త్రిరాత్రవ్రతం ముఖ్యమైనది. చేయలేని వారు నవమినాడైనా చేయాలి అని చెప్పారు. అంతేకానీ శరన్నవరాత్రి ఏమాత్రమూ చేయకుండా ఉండకూడదు అని ఆ విధి చెప్పడంలోని ఉద్దేశ్యం. 

అందుకు ఇది నవరాత్రము, సప్తరాత్రము, పంచరాత్రము, త్రిరాత్రము, ఏకరాత్రము అని ఇన్ని విధానములతో చెప్తున్నారు. త్రిరాత్ర వ్రతంలో ముఖ్యం ఏమిటంటే ఎప్పుడైనా మూడు సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది. మూడైతే తొమ్మిదవుతుంది. శరన్నవరాత్రులలో మూడుమార్లు మూడు వచ్చింది. అది దానియొక్క ప్రత్యేకత. అలా లేనప్పుడు ఒక్క మూడైనా మనం చేయగలగాలి. ఆఒక్క మూడు చేసినప్పుడు త్రిశక్తుల స్వరూపుడైన అమ్మవారిని ఈ మూడు రాత్రులలో మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపములుగా ఆరాధన చేయడం ఉన్నది.

ఇంకో వ్యవహారంలో సరస్వతి, లక్ష్మి, దుర్గ అని చెప్పడం కూడా ఉన్నది. ఏవిధంగానైనా అమ్మవారు ముగ్గురమ్మల మూలపుటమ్మ అని చెప్పబడుతున్నది కనుక ఆ త్రి అనే సంఖ్య అద్భుతమైన విశ్వ నియమాన్ని చెప్పే సంఖ్య, ఒక పూర్ణ సంఖ్య. త్రికరణాలు అని చెప్తున్నారు. మనోవాక్కాయకర్మలు అని. అలాగే లోకములు కూడా త్రిలోకములు, కాలములు కూడా త్రికాలములు. ఈ కారణం చేత త్రిసంఖ్యకి అంత ప్రాధాన్యం ఉంది కనుకనే ఇది మనోవాక్కాయ కర్మలను శుద్ధి చేయడానికి, మనయొక్క సంకల్పాలను సిద్ధింపజేయడానికి ఈ త్రిరాత్రవ్రతం చాలా ముఖ్యమైనది అని చెప్పారు. నవరాత్రములు చేయలేనప్పుడు త్రిరాత్రములైనా చేసి ధన్యులు కావాలని శాస్త్రం విధిస్తున్నది..

navratri day 1 to 9 goddess, navratri day 1 mantra, which goddess is worshipped on each day of navratri, navratri day 1 color, navratri 1st day devi name, navratri first day april 2021, 1 navratri 2021 october, first navratri october 2021, navaratri pooja telugu

Comments

Popular Posts