5.పాశురము
మాయనై మన్ను, వడమదురై మైన్దనై త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై త్తాయైక్కుడల్ విళక్కమ్ శెద్ద దామోదరనై తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తాళుదు వాయినాల్ పాడి, మనత్తినాల్ శిల్టిక్క పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్ తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
భావము: మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను అనుసందించుడు.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురాలు:
Tags: తిరుప్పావై, పాశురాలు, తిరుప్పావై పాశురాలు, Tiruppavai telugu, Thiruppavai Pasurams Telugu, Tiruppavai Pasurams, Godhadevi, Pasurams Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment