Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

గురు శుక్ర మౌఢ్యమి ప్రారంభం - మౌఢ్యమి లో చేయకూడని, చేయదగిన కార్యాలు | Guru Moudyami, Sukra Moodam in 2022

ఈ రోజు సాయంత్రం 5.26 నిమిషముల నుండి గురు మూఢమి ప్రారంభం.

గురు మూఢమి

మూడమి లేదా మూడం కార్యక్రమం లేదా ఫంక్షన్ నిర్వహించలేని ఒక అశుభ కాలం. 

2022-2023లో గురు మూఢ కాలం ఒకటి మరియు శుక్ర మూఢమి కాలం ఒకటి.

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో రెండు రకాల మూఢాలు ఉన్నాయి - గురు మూడమి లేదా గురు లోపం మరియు శుక్ర మూడమి లేదా శుక్ర లోపం.

మూడమి అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం. 

గ్రహాలు బృహస్పతి లేదా గురు (గురు) మరియు శుక్ర (శుక్రుడు) సూర్యుని (సూర్యుడు) సమీపంలో ఉన్నప్పుడు , మూఢమి సంభవిస్తుంది.

సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం తన శక్తిని కోల్పోతుంది. 

గ్రహ చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది.

శుక్ర గ్రహం (శుక్ర గ్రహం) సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మూఢం సంభవిస్తుంది , దాని శక్తిని మరియు బలాన్ని కోల్పోయి హానికరం మరియు అశుభకరమైనది. 

గురు మూడం 2022-2023 (20 ఫిబ్రవరి 2022 నుండి 20 మార్చి 2022)

స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర గురు మూడమి 20 ఫిబ్రవరి 2022 , మాఘ కృష్ణ తృతీయ (మాఘ బహుళ చతుర్థి ), 5.26 గంటలకు , కుంభ రాశి యొక్క శతభిష నక్షత్రం 4వ త్రైమాసికంలో పశ్చిమ దిశలో గురు గ్రహస్థం ద్వారా ప్రారంభమవుతుంది.

గురు మూఢం 20 మార్చి 2022న , ఫాల్గుణ మాసం (ఫాల్గుణ బహుళ విదియ)లో కృష్ణ ద్వితీయ, 8.38 AMకి పూర్వాభాద్ర నక్షత్రం 2వ త్రైమాసికంలో తూర్పు దిశలో గురు గ్రహ ఉదయానికి ముగుస్తుంది.

అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?

గురుగ్రహమే కాని, శుక్ర గ్రహమేకాని సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి"గా వాడుకభాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నగురు, శుక్ర మౌడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి - శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు.ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమాము:

పెళ్ళిచూపులు,వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం ,విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతనవధువు ప్రవేశం, నూతన వాహనము కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం,  పుట్టువెంట్రుకలకు, వేదా"విధ్యా"ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

మౌఢ్యమిలో చేయదగిన పనులు:

జాతకర్మ.. జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు,జప,హోమాది శాంతులు ,గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా,శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిని స్త్రీలు,బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిధులలో అశ్వని,రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

గురు మూఢమి, shukra moudyami, Guru Moudyami, Sukra Moodam in 2022, sukra moodami, guru moudyami, 

Comments

Popular Posts