Drop Down Menus

మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి? Why should arches be built with mango leaves?

మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి.

హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది. ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలుహిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది.

ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, ఇంటి ద్వారాలకు కేవలం మామిడి ఆకులతోనే ఎందుకు తోరణాలు కడతారో చాలా మందికి తెలియదు. ఆ కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 

1. సాధారణంగా మామిడి ఆకుల్లో ల‌క్ష్మీదేవి కొలువైవుంటుందని పెద్దలు చెపుతారు. అందుకే ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌.

2. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. ఈ కారణంగా అన్నీ శుభాలే క‌లుగుతాయి.

3. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు గృహాల్లో కూడా క‌డితే అంతామంచే జ‌రుగుతుంద‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.

4. ఇంట్లో ఏవేని దుష్టశక్తులు ఉండివున్నట్టయితే ఆ శక్తులన్నీ వెళ్లిపోయి.. దేవ‌త‌లు అనుగ్ర‌హిస్తార‌ట‌. అలాగే, మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు. మామిడి ఆకుల తోర‌ణాల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌.

5. ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌. త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం కోసం క‌లుగుతుంద‌ట‌.

ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి మ‌న‌కు లభిస్తుంది.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

mango, leaves, mango leaves, benefits of mango leaves, mango leaves decoration, functions,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON