దేవి నవరాత్రులలో ఏడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం | Navratri 7th Day Pooja Sri Kalaratri Devi
నవరాత్రులలో ఏడవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం - శనివారం 21 అక్టోబర్ 2023- సప్తమి, మా కాలరాత్రి పూజ.
కాళరాత్రి ( సరస్వతి )
కాళరాత్రీ దుర్గాదేవి నవదుర్గల్లో ఏడవ అవతారం. కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవి పురాణములో దుర్గా దేవిని సర్వాంతర్యామి , సర్వలోకాల్లో , సర్వజీవులలో ఆమె నివసిస్తుంది.
కాళరాత్రి దుర్గాదేవి : స్వరూపము చూచటకు మిక్కిలి భయానకము, ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను కలిగి ఉంటాయి . ఈమె వాహనము గాడిద ( గార్దభము), తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయముద్రను కలిగియుండును.
ఒక ఎడమచేతిలో ఇనుప ఆయుధమును ( వజ్రాయుధం ), మఱొక ఎడమచేతిలో ఖడ్గమును ధరించియుండును. ఈమె ఎల్లప్పుడును శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అని అందురు. కాళరాత్రి దుర్గ దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవును , ఈమె యనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు, భయముగాని, శత్రువుల భయముగాని, ఏ మాత్రమును ఉండవు. భయవిముక్తులగుదురు. కాళరాత్రిమాత దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము.
ధ్యాన శ్లోకం
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||
ఏడవ రోజు అమ్మవారు జగన్మాత సరస్వతీ రూపంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.
Related Posts:
> నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
> నవరాత్రుల్లో 2వ రోజు చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )
> నవరాత్రుల్లో 3వ రోజు చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )
> నవరాత్రుల్లో 4వ రోజు చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )
> నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )
> నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)
> నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )
> నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )
> నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )
> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం
కాళరాత్రి దేవీ, kalaratri devi story, kalaratri devi mantra, kalaratri devi temple, kalratri mantra benefits, kalratri mata telugu, vijayadasami, devi navaratrulu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment